twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam June 10th Episode: రివాల్వర్‌తో షూట్ చేయి.. నన్ను చంపేయ్ మమ్మీ.. తల్లితో కార్తీక్ ఎమోషనల్‌

    |

    టెలివిజన్ చరిత్రలో రేటింగ్ విషయంలో రికార్డులు తిరగరాస్తున్న కార్తీక దీపం సీరియల్‌లో రోజు రోజుకు ఎమోషనల్ కంటెంట్ మరింత పెరిగిపోతున్నది. నీవు వల్లనే ప్రెగ్నెంట్ అయ్యానని కార్తీక్ కాపురంలో చిచ్చు పెట్టడంతో ఇంట్లో అంతా గందరగోళం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక్‌ను ఆయన తల్లి సౌందర్య నిలదీసింది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉద్వేగం సాగిన 1062 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    Recommended Video

    Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
    నిప్పులాంటి కార్తీక్ అంటూ..

    నిప్పులాంటి కార్తీక్ అంటూ..

    మోనిత వ్యవహారంతో ముఖం చూపించుకోలేకపోతున్న కార్తీక్‌ను పెద్దోడా ఇలా రా అంటూ మేడపైన ఉన్న సౌందర్య పిలిచింది. నా కొడుకు నా ముందు తల దించుకొన్నాడు. నా కొడుకు యోగ్యుడు, శ్రీరామచంద్రుడు అని మురిసిపోయేదాన్ని. ఆడపిల్లల తల్లిదండ్రులు సబ్జెక్ట్‌లో ఏదైనా డౌన్స్ ఉంటే నీ వద్దకు పంపించేవారు.

    రాత్రిపూట కంబైన్డ్ స్టడీస్ ఉంటే కంగారు పడేవారు కాదు. ఆడపిల్లలు పేరెంట్స్‌గా ఏ భయం లేదా అంటే.. వాళ్లు వచ్చింది సౌందర్య ఇంటికి.. వచ్చింది నిప్పు లాంటి కార్తీక్ వద్దకు అంటూ సమాధానం చెప్పేవాళ్లు. కానీ నీ నుంచి ఇది ఊహించలేదని సౌందర్య అంటే... నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ కార్తీక్ చెప్పాడు.

    నీవు కూడా అలాంటి మగాడివేనని..

    నీవు కూడా అలాంటి మగాడివేనని..

    ప్రతీ మనిషిలో మంచి, చెడు రెండు ఉంటాయి. అవకాశాన్ని బట్టి ఆ లక్షణాలు డామినేట్ చేస్తాయి. అందరిలోను దైవత్యం, రాక్షసత్వం ఉంటుంది. బలహీనమైన క్షణాల్లో కూడా లోపలి రాక్షసుడిని బయటకు రానివ్వ వాడిని సంస్కారవంతుడు అని అంటారు. నా కొడుకు సంస్కారవంతుడని అనుకొన్నాను. నీవు కూడా మామూలు మగాడివని నిరూపించుకొన్నావు అంటూ కార్తీక్‌ను సౌందర్య నిలదీసింది.

    నన్ను పాతాళంలోకి దించేశావు...

    నన్ను పాతాళంలోకి దించేశావు...

    కార్తీక్.. ఏదో దుష్ట గ్రహ ప్రభావం వల్ల అనుమానం అనే జబ్బు వాడిని పట్టుకొందని, మిగితా విషయాల్లో సుగుణాల రాశి అని అనుకొనేదానిని. కానీ దీప ఇప్పుడు తలఎత్తుకొని నిలబడింది. నీవు తలదించుకొని నిలబడ్డావు. నన్ను పాతాళంలోకి దించేశావు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో నీవు నిలబడ్డావు అని సౌందర్య ఆవేదన వ్యక్తం చేశారు.

    పిల్లలకు ఏం సమాధానం చెబుతావు

    పిల్లలకు ఏం సమాధానం చెబుతావు

    ఫామ్ హౌస్ నుంచి నాన్న ఫోన్ చేశారు. పిల్లలకు ఫామ్‌హౌస్ సరదా తీరిపోయిందట. రేపో, మాపో వాళ్లు వస్తారు. పిల్లలకు తల్లి కనిపించదు. ఏమైందని డాడీ అని నిన్నే అడుగుతారు. ఏమని సమాధానం చెబుతావు. ఇన్నాళ్లు చేయని నేరానికి శిక్ష వేశాను. ఇప్పుడు అదే నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను. కాలుష్యం నావైపు వీచిందా అని చెబుతావా? ఏం చెప్పాలో తెలియక.. తప్పు వాళ్ల అమ్మ మీదకు నెట్టకు? ఆడవాళ్లంటే నీకు లోకువ కదా.. మగ బుద్ధి చూపిస్తావని చెబుతున్నాను అంటూ సౌందర్య కంటతడి పెట్టింది.

    నాకు ఆ ధైర్యం లేదు...

    నాకు ఆ ధైర్యం లేదు...

    పిల్లల్ని నేను చెప్పేదాకా ఫాంహౌస్ నుంచి పంపించకు అంటే.. ఎందుకు అని నాన్న అడిగారు. ఆయనకు ఏమి సమాధానం చెప్పమంటావురా? భయపడకురా? నేను ఏం చెప్పను రా. నీవు ఏం ఘనకార్యం చేశావని చెప్పమంటావు? నీవు మళ్లీ తాతగారు కాబోతున్నారు. కంగ్రాట్యులేషన్ అంటూ చెప్పమంటావా? ఈ శుభవార్త విని ఆయన గుండె తట్టుకోలేక ఆయనకు ఏదైనా అయితే భరించాల్సి నేనే కదా. నాకు అంత ధైర్యం లేదు కార్తీక్ అంటూ సౌందర్య కన్నీరుమున్నీరు అయ్యారు.

    చచ్చిపోతే బాగుంటుందని.. కార్తీక్

    చచ్చిపోతే బాగుంటుందని.. కార్తీక్

    సౌందర్య మాటలతో ఆవేదన చెందిన కార్తీక్ మరింత భావోద్వేగానికి గురయ్యాడు. నన్ను నీ రివాల్వర్‌తో షూట్ చేసి చంపేయ్.. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక పవిత్రమూర్తిని క్షోభపెట్టాను. ఆ పాపం చేసినందుకు చచ్చిపోతే బాగుండనిపిస్తుంది మమ్మీ. గిల్టీ ఫీలింగ్‌తో క్షణ క్షణం ప్రాణం పోయే కంటే ఒక్కసారి ప్రాణం పోతే బాగుండనిపిస్తుంది. నన్ను చంపేయ్ మమ్మీ.. ఒక్కటి మాత్రం నిజం. ఇది పొరపాటు వల్ల జరిగింది. దీప మీద ప్రేమ లేకనో.. మోనితమీద మోజుతోనో కాదు. నన్ను నమ్ము మమ్మీ అంటూ కార్తీక్ చేతులెత్తి దండం పెట్టాడు. కోడలు ఆ పని చేసిందంటే నమ్మని దానివి. కొడుకు కొవ్వెక్కి ఈ పని చేశాడంటే నమ్ముతున్నావా మమ్మీ అంటూ కంటతడి పెట్టాడు.

    మోనిత గోతికాడ నక్కలా...

    మోనిత గోతికాడ నక్కలా...

    కార్తీక్ నీవు తప్పు చేశావంటే నేను నమ్మకపోవచ్చు. ఏదో బలహీనమైన క్షణంలో నిన్ను రెచ్చగొట్టి ఉంటుందేమో. కానీ మోనిత గోతికాడ నక్కలా పొంచి ఉంది. కానీ తప్పు తప్పే కదా కార్తీక్. ఏదో చిన్న తప్పు జరిగిందని రబ్బర్ మాదిరిగా తుడిపేయలేము కదా. మోనిత మంచిది కాదురా.. కాపురంలో నిప్పులు పోసే ఆడదిరా. అలాంటి వారికి దూరంగా ఉండమని, నేను, నీ భార్య చిలకకు చెప్పినట్టు చెప్పాను. పెడచెవిన పెట్టావు. ఇప్పటికైనా మోనిత గురించి వాస్తవం తెలిసిందా? ఇప్పుడు తెలుసుకొని లాభం ఏమి? బురదలో అడుగు వేశావు. ఇప్పుడు కడుక్కొంటే పోయేది కాదు అని సౌందర్య ఆవేదన వ్యక్తం చేసింది.

    English summary
    Karthika Deepam 10th June's Episode of 1062 goes with emotional content. Karthik tries to reveal facts to deepa but, avoid him. After Monita's pregnancy revelations, situation become horrible in karthik's home. In this emotional situtaion, Deepa left home again amid Soundryas requests and pray.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X