Karthika Deepam June 11th Episode: అమ్మను బయటకు పంపించావా? నిలదీసిన శౌర్య, హిమ.. తలదించుకొన్న కార్తీక్

మోస్ట్ టీఆర్పీ రేటింగ్ ఉన్న కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మోనిత పెట్టిన చిచ్చు, దీప ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అయోమయంలో ఉన్న కార్తీక్ కుటుంబ సభ్యులకు సడెన్‌గా ఫాంహౌస్ నుంచి ఇంటికి వచ్చిన హిమ, శౌర్య షాకిచ్చారు. వారం రావడంతో దీప గురించి ఏం చెప్పాల్సి వస్తుందని కంగారు పడ్డారు. డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్న వారిని చూసి ఎందుకు మీ ముఖాల్లో కంగారు కనిపిస్తున్నదంటూ ఇద్దరు ప్రశ్నించారు. 1063 ఎపిసోడ్‌లో జరిగిన ప్రధాన అంశాలు మీ కోసం..

Recommended Video

Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !
అమ్మ ఎక్కడ అంటూ

అమ్మ ఎక్కడ అంటూ

తమ తల్లి దీప గురించి ఇంటి సభ్యులెవరూ స్పందించకపోవడంతో మేము రావడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. అయితే ఇలా తొందరగా ఎందుకు వచ్చారని అడిగితే.. కారు డ్రైవర్‌కు ఏదో పని ఉందంటూ త్వరగా తీసుకొచ్చారు అని హిమ, శ్రావ్య చెప్పారు. అంతలోనే అమ్మ ఎక్కడా అంటూ అటు ఇటూ చూస్తూ ప్రశ్నించారు. వారి నుంచి సమాధానం లభించకపోయే సరికి అనుమానంతో ఇళ్లంతా వెతికారు.

సౌందర్య, కార్తీక్‌ను నిలదీసిన పిల్లలు

సౌందర్య, కార్తీక్‌ను నిలదీసిన పిల్లలు

అయితే దీప గురించి ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో ఇళ్లంతా వెతికారు. బీరువాలు, బెడ్ రూంలు అన్నీ చూసి తమ తల్లి ఇంట్లో లేదని శౌర్య డిసైడ్ అయిపోయింది. అప్పటికే నాన్నమ్మ సౌందర్యను, తండ్రిని ప్రశ్నలతో కంగారు పెడుతున్న హిమతో శౌర్య జత కలిసింది. తమ తల్లి ఎక్కడికి వెళ్లింది అంటూ ఇద్దరిని ప్రశ్నించారు. పిల్లల నుంచి బాణాల్లా దూసుకొస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడ్డారు.

అమ్మ వెళ్లిపోయిందంటూ..

అమ్మ వెళ్లిపోయిందంటూ..

నాన్నమ్మ, తండ్రి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో.. అమ్మ మళ్లీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారా అంటూ హిమ ప్రశ్నిస్తే.. లేదు అంటూ శౌర్య సమాధానం చెప్పింది. అమ్మ బట్టలు సర్దుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది అని శౌర్య అనగానే.. నిజమా డాడీ అని హిమ ప్రశ్నించింది. మళ్లీ అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందా చెప్పు డాడీ.. నువ్వైనా చెప్ప నాన్నమ్మ.. అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందా? నాన్న వైపు చూస్తున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

నీవే పంపించావా డాడీ..

నీవే పంపించావా డాడీ..

అమ్మను ఇంటి నుంచి నువ్వే పంపించావా డాడీ అని హిమ అంటే.. మళ్లీ ఏమైంది.. ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చింది.. ఒంటరిగా ఎలా వెళ్లింది. అప్పుడే అన్ని పనులు చేయలేదు కదా.. ఇంతకు ముందులా వంట చేయలేదు కదా.. నువ్వే కదా వంట చేయవద్దని అన్నావు. అమ్మకు ఆరోగ్యం కుదుట పడగానే బయటకు పంపించావా? అందుకే మమ్మల్ని ఫాంహౌస్‌లో దించి వచ్చావా? మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంటే.. మేము అడిగేవన్నీ నిజమే అని భయమేస్తుంది డాడీ.. అని హిమ కంగారు అడిగింది.

దీప ఇంటికి వెళ్లిన కార్తీక్, శౌర్య, హిమ

దీప ఇంటికి వెళ్లిన కార్తీక్, శౌర్య, హిమ

మీ అమ్మను ఎక్కడికి వెళ్లమనలేదు. మీ అమ్మను ఎక్కడికి పంపించలేదని చెప్పు డాడీ అంటూ హిమ, శౌర్య నిలదీశారు. అయితే తదుపరి ఎపిసోడ్‌లో పిల్లల్నద్దరిని దీప ఇంటికి తీసుకెళ్లడం ప్రోమోలో కనిపించింది. ఇంటి నుంచి ఎందుకు వచ్చావు అంటే.. అంత పెద్ద ఇంటిలో ఉండలేకపోయాను అని దీప.. అంటే.. నాన్నకు ఇక్కడ ఉండటం కష్టమే కాదా అని పిల్లలు ఇద్దరు ప్రశ్నించారు. అయితే నేను ఎక్కడికి వెళ్లను ఇక్కడే ఉంటా అని కార్తీక్ పిల్లలతో చెప్పడం మరో ట్విస్టుగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X