Karthika Deepam June 12th Episode: కడుపుతో ఉన్నది నిజమేనా? నాటకమా? మోనితపై ప్రియమణి అనుమానం

అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి కార్తీక్ ఆయన పిల్లల మధ్య ఎమోషనల్ సీన్లు కనిపించాయి. ఇక కడుపుతో ఉన్న మోనిత చూసి పనిమనిషి అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇంకా 1064 ఎపిసోడ్‌లో ఎలాంటి సంఘటనలు, ఎమోషన్స్ చోటుచేసుకొన్నాయంటే...

బికినీలో తడిసిన అందాల ఫొటోలతో షాకిచ్చిన సోనాలి

నీకు జాలీ వేయలేదా నాన్న

నీకు జాలీ వేయలేదా నాన్న

అమ్మ ఎక్కడికి వెళ్లింది? అమ్మ ఎక్కడికి వెళ్లలేదని చెప్పండి డాడీ. అమ్మను చూస్తే అందరూ అయ్యో పాపం అంటారు.. నీకు జాలీ వేయలేదా డాడీ.. అమ్మను కాదు. మమల్ని చూసినా జాలి అనిపించదా? చిన్నప్పుడు నాకు అమ్మ ఒక్కతే.. నాన్న లేడు. హిమకు అమ్మలేదు కానీ నాన్న ఒక్కడే. ఎప్పుడు అమ్మో.. నాన్నో ఒక్కరే చాయిసా నాన్న.. అందరం కలిసి ఉండే అదృష్టం లేదా నాన్న అని హిమ, శౌర్య ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో మీ ప్రశ్నలకు సమాధానం నేను చెబుతాను.. నాతో రండి.. అంటూ వారిని తీసుకెళ్లారు.

ప్రియమణితో మోనిత

ప్రియమణితో మోనిత

ఇదిలా ఉండగా, కార్తీక్ నా బుట్టలో పడ్డారనే సంతోషంలో మోనిత మునిగి తేలుతుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తూనే ఆనందంలో ఉంది. ఇలాంటి సమయంలో పాలు తాగండి అంటూ పనిమనిషి ప్రియమణి గ్లాస్ ఇచ్చింది. ప్రియమణితో మాట్లాడుతూ.. ఇక నుంచి కూరల్లో మసాలాలు, ఉప్పు బాగా తగ్గించు. ఇక నుంచి ఎంత తక్కువగా మసాలాలు తింటే అంత మంచింది అంటూ మోనిత చెప్పింది.

నీవు కడుపుతో ఉన్నావా?

నీవు కడుపుతో ఉన్నావా?

ప్రియమణితో సూచనలు ఇస్తూ.. రేపటి నుంచి నేను ఏం వండాలో రాసిస్తాను. సిన్సియర్‌గా ఫాలో అవ్వాలి అంటూ మోనిత చెప్పింది. ప్రియమణి తనలో అనుమానాలను బయటపెడుతూ.. నిజంగా నీవు కడుపుతో ఉన్నావా? ఇది కూడా నాటకమేనా అంటూ ప్రశ్నింది. దాంతో మోనితకు ఎక్కడలేని కోపం వచ్చింది. అసహనంతో ఊగిపోయింది.

 నాటకాలు ఆడేదానిలా కనిపిస్తున్నానా?

నాటకాలు ఆడేదానిలా కనిపిస్తున్నానా?

ప్రియమణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏం మాట్లాడుతున్నావు.. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను. నేను నాటకాలు ఆడే దానిలా కనిపిస్తున్నానా లేదా అబద్దం ఆడే వాడిలా కనిపిస్తున్నా.. చూడు అంటూ కోపంతో ఊగిపోయింది. దాంతో అది కాదమ్మా అంటూ ప్రియమణి ఏదో చెప్పబోగా ఆ మాటలకు అడ్డుపడుతూ మోనిత ఫైర్ అయింది.

నా బిడ్డకు తండ్రి కార్తీకే..

నా బిడ్డకు తండ్రి కార్తీకే..

ప్రియమణి అనుమానాలకు వివరణ మరింత వివరణ ఇస్తూ.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నిజం. ఆ బిడ్డకు తండ్రి కార్తీక్ అనేది వాస్తవం. అంతే కానీ నేను వేరే వాడితో తిరిగి.. అంటూ మోనిత ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో నా ఉద్దేశం అది కాదు అంటూ ప్రియమణి అడ్డుపడింది. దాంతో పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఆపి.. నీ పని చూసుకో అంటూ మోనిత కోపగించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X