Karthika Deepam June 14th Episode Part 1: కార్తీక్ సిగ్గుతో చచ్చిపోతున్నాడు.. వాడిని చూస్తే జాలి.. సౌందర్య

అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న కార్తీకదీపం సీరియల్‌లో ప్రెగ్నెంట్ అని మోనిత చిచ్చు పెట్టిన తర్వాత కార్తీక్ కుటుంబంలో తీవ్రమైన అశాంతి కనిపించింది. కార్తీక్ చేసిన పనికి మనస్తాపం చెందిన దీప ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ క్రమంలో ఫాంహౌస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన శౌర్య, హిమకు తల్లి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీప ఇంట్లో లేకపోవడంతో పిల్లలు ఇద్దరు నిలదీశారు. దాంతో తనతో రమ్మని వారిద్దరిని దీప ఇంటికి తీసుకెళ్లాడు కార్తీక్. అయితే అర్ధరాత్రి అయినా కార్తీక్ తిరిగి రాకపోవడంతో తల్లి సౌందర్య, సోదరుడు ఆదిత్యలో టెన్షన్ కనిపించింది.

తన అత్త, భర్తతో శ్రావ్య మాట్లాడుతూ.. అక్కడే నిద్రపోయారేమో అని శ్రావ్య అంటే.. వాళ్లిద్దరూ పిల్లల ముందు మోనిత గురించి గొడవ పడుతుంటూ ఉంటారా.. పిల్లల ముందు గొడవ పుడుతున్నారేమో ఏమో అంటూ ఆదిత్య అని అనుమానం వ్యక్తం చేశాడు.

దాంతో సౌందర్య స్పందిస్తూ... ఆ మాత్రం కామన్ సెన్స్ వాళ్లకు ఉంది అంటూ కార్తీక్‌ను సమర్దించింది.. తల్లి ప్రేమ కదా సమర్ధిస్తున్నావు అని ఆదిత్య అన్నాడు. దాంతో నేను కార్తీక్‌ను సమర్థించడం లేదురా.. జరిగిన దానికి వాడు సిగ్గుతో చచ్చిపోతున్నాడు. ఎవరు ఎన్ని మాటలు అన్నా గానీ మౌనంగా భరిస్తున్నాడు అని సౌందర్య అన్నారు.

Karthika Deepam June 14th Episode Part 1: Soundarya Sympathy on Karthik

కార్తీక్ ఇదివరలా లేడు. అవును మౌనిత అంటే నాకు ఇష్టం. కాలేజ్ డేస్ నుంచి ప్రేమించింది. ఒకట్రెండు సార్లు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. దీపతో విభేదాలు వచ్చి పదేళ్లు అయింది. కానీ మోనితను పెళ్లి చేసుకొంటానని ఈ మధ్య కూడా చెప్పాను. కానీ అనుకొని పరిస్థితుల్లో తొందరపడ్డాం. మోనితకు తాళి కట్టాలి. న్యాయం చేయాలని తెగేసి చెప్పేవాడు. కాని వాడిలో దీప పట్ల ప్రేమ, జరిగిపోయిన దానికి ప్రాయశ్చిత్తం నాకు స్పష్టంగా కనిపిస్తున్నది అని సౌందర్య అన్నారు.

ఇప్పుడు దీపకు ఎలాంటి సమాధానం చెబుతాడు.. మోనితకు ఎలాంటి న్యాయం చేస్తాడు. ఈ తతంగం అంతా పిల్లలకు తెలియకుండా ఎలా జాగ్రత్త పడుతారు. మా చూపుల బాణాలను ఎలా తట్టుకొంటారు అనే విషయాలు చేసి వాడి మీద జాలీ వేస్తున్నది అని సౌందర్య ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X