Karthika Deepam June 14th Episode Part 2: 10 రోజులే గడువు, ఇక వణికిస్తా: కార్తీక్‌కు మోనిత వార్నింగ్

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకదారణ ఉన్న కార్తీకదీపం సీరియల్‌ రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతున్నది. తనపై పడిన మచ్చను కుటుంబ సభ్యులకు, దీపకు చెప్పుకోవడానికి కార్తీక్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కార్తీక్‌కు సానుకూలంగా సపోర్ట్ లభించడం లేదు. ఈ క్రమంలో నేరుగా దీప ఇంటికి వెళ్లి కార్తీక్‌కు మోనిత హెచ్చరించడంతో ఆసక్తిని రేపింది. కార్తీక దీపంలో ఏం జరుగుతున్నదంటే..

కార్తీక్‌కు గట్టి షాక్

కార్తీక్‌కు గట్టి షాక్

తీవ్ర అనారోగ్యానికి గురైన దీప కోలుకోవడాన్ని మోనిత జీర్ణించుకోలేకపోయింది. ఇక కార్తీక్ కాపురంలో ఎలాంటి సమస్యలు లేవు అనుకోగానే మోనిత గట్టి షాక్ ఇచ్చింది. కార్తీక్ వల్ల తాను గర్బవతిని అయ్యాను అంటూ బాంబు పేల్చడంతో కార్తీక్ కుటుంబంతోపాటు దీప కుటుంబం కూడా డిఫెన్స్‌లో పడ్డారు. కార్తీక్, దీప, మోనిత వ్యవహరంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ వారిలో నెలకొన్నది.

కార్తీక్‌పై అనేక అనుమానాలు

కార్తీక్‌పై అనేక అనుమానాలు

మోనిత ప్రెగ్నెంట్ అనే విషయం దీప సంసారంలో మరోసారి చిచ్చు రేపింది. కార్తీక్ ఇలాంటి పని చేస్తాడా అనే విషయాన్ని కార్తీక్ తల్లి జీర్ణించుకోలేకపోయింది. కార్తీక్ సోదరుడు ఆదిత్య, మరదలు శ్రావ్య అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. కార్తీక్ వల్ల మరోసారి దీప జీవితం ఇబ్బందుల్లో పడిందని శ్రావ్య కామెంట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దీప ఇంటి నుంచి వెళ్లిపోవడం కార్తీక్‌ను మరింత షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో దీప ఇంటిలో ఉన్న కార్తీక్‌కు మోనిత గట్టి షాక్ ఇచ్చింది.

నీ ఫ్యామిలీ మొత్తాన్ని గడగడ

నీ ఫ్యామిలీ మొత్తాన్ని గడగడ

నీ అనుమానం వల్ల దీప చాలా కష్టాలు పడింది. ఆమె అమాయకురాలు. నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి దశాబ్ద కాలం వేచి చూసింది. కానీ నేను అలా కాదు. పదేళ్లపాటు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. పదే పది రోజు నీకు టైమ్ ఇస్తున్నాను. ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సరిగ్గా పదో రోజులోగా సరిగ్గా నాకు సమాధానం, న్యాయం జరుగకపోతే.. మొత్తం నీ ఫ్యామిలీ మొత్తాన్ని గడగడ వణికి పోయేలా చేస్తాను. బీ రెడీ అంటూ మోనిత వార్నింగ్ ఇచ్చింది.

Recommended Video

Yash, Puri Jagannadh To Team Up For A Political Thriller || Filmibeat Telugu
ఉత్కంఠ పెంచిన 1065 ఎపిసోడ్

ఉత్కంఠ పెంచిన 1065 ఎపిసోడ్


సుదీర్ఘంగా సాగుతున్న కార్తీక దీపం 1065 ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రమోలో మోనిత భారీ ట్విస్టు ఇవ్వడం ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచింది. మోనిత వార్నింగ్‌ను కార్తీక్ ఎలా ఎదుర్కొంటాడు? ఇప్పటికే అయోమయంలో ఉన్న దీపకు ఎలాంటి సమాధానం ఇస్తాడనే విషయం మరింత ఆసక్తిని రేపింది. రాబోయే ఎపిసోడ్‌లో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లభించడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X