Karthika Deepam June 1st Episode: కార్తీక్‌తో పెళ్లికి మోనిత రెడీ .. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న డాక్టరమ్మ!
తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎక్కువ వారాలు టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ మోనిత తన వ్యూహాలకు పదును పెట్టి మరోసారి ట్విస్టు ఇచ్చింది. హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి దీప చేరడాన్ని మోనిత జీర్ణించుకోలేకపోయింది. దాంతో తనదైన శైలిలో కుట్రలు పన్నుతూ కనిపించింది. ఈ సీరియల్ 1035 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
పైట లేకుండా కుర్రాళ్లను కట్టిపడేస్తున్న నికిత స్వామి.. హాట్ స్టిల్స్

డాక్టర్ భారతీని ఇంటికి ఆహ్వానించి
దీపను క్లిష్టమైన సర్జరీ చేసి చావు నుంచి తప్పించిన డాక్టర్ భారతిని డాక్టర్ మోనిత తన ఇంటికి ఆహ్వానించింది. త్వరగా రావాలని కబురు పెట్టడంతో డాక్టర్ భారతీ మోనిత ఇంటికి వచ్చింది. హడావిడిగా రమ్మన్నావు ఎందుకని ప్రశ్నిస్తే.. పని మనిషిని అది తీసుకురా అంటూ వంటింట్లోకి పంపించింది. మోనిత చేష్టలు అర్థం కాక డాక్టర్ భారతీ కన్‌ఫ్యూజ్‌కు గురైంది.

నీకు స్వీట్లు ఇష్టమని...
ఇంతలోనే ప్రియమణితోపాటు మోనిత మైసూర్ పాక్ స్వీట్‌తో ముందుకొచ్చింది. ఈ స్వీట్స్ ఎందుకు అంటూ భారతి ప్రశ్నిస్తే.. కాలేజీలో ఎవరు స్వీట్స్ తెచ్చినా వదలకుండా అన్నీ తినేసే దానికి కాదా.. నీకు ఇష్టం అని నేనే ప్రియమణితో చేయించాను అంటూ మోనిత చెప్పి ఇంట్లోకి వెళ్లింది.

మోనిత హావభావాలతో షాక్
మోనిత హావభావాలను చూసి డాక్టర్ భారతీ కంగు తిన్నది. మోనిత ఎప్పుడు ఏమీ చేస్తుందో తెలియదు అంటూ కంగారు పడింది. ఇంతలో ఓ ప్లేట్‌లో పూలు, పండ్లు, చీరె తీసుకొచ్చి బహుమతిగా ఇవ్వబోయింది. అయితే తీసుకోవడానికి నిరాకరిస్తూ.. ఇది ఎందుకు అంటూ భారతీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. నీవు దీపను సురక్షితంగా కాపాడావు కదా.. అందుకే నీకు ఈ బహుమతి అంటూ మోనిత తనదైన శైలిలో జవాబిచ్చింది.

దీపను చావు అంచుల్లోంచి అంటూ
నీవు ఇలాంటి గిఫ్టును ఇవ్వడం అవసరమా? అంటూ భారతీ అయోమయంతో ఏదో చెప్పబోయింది. అయితే దీపను చావు అంచుల్లో నుంచి బయటకు తెచ్చి కార్తీక్ చేతిలో పెట్టావు కదా.. అందుకే ఈ బహుమానం. ఏదో నా తృప్తి కోసం ఇస్తున్నాను. ఇలా నాకు తీసుకోవడం అలవాటు లేదు. దీపకు సర్జరీ చేసినందుకు నాకు డాక్టర్ గోవర్ధన్ ఫీజు ఇచ్చాడు అంటూ భారతి చెప్పింది. భారతీ చెప్పిన మాటలు వినకుండా నీవు తీసుకోకపోతే నా మీద ఒట్టే అంటూ బలవంతంగా గిఫ్టును చేతిలో పెట్టింది.

నా పనుల్లో నేను ఉంటా..
డాక్టర్ భారతీ అక్కడి నుంచి వెళ్లగానే ఓ విషపు నవ్వు నవ్వి.. ఇప్పుడు వెళ్లి ఈ విషయం కార్తీక్‌తో చెబుతావు. కార్తీక్ ఈ విషయాన్ని అత్తా, కోడళ్లకు చెబుతాడు. నేను భారతీకి గిఫ్టు ఇచ్చిన గురించి, నా ఇక్వేషన్స్ అర్థం కాక తలపట్టుకొంటారు. ఈ పని మేము చేయలేదు ఏమిటా అని గిల్టీ ఫీలింగ్‌తో ఉంటారు. ఈ లోపు నేను చేయాల్సి పని నేను చేస్తా అంటూ డాక్టర్ మోనిత తనదైన శైలిలో నవ్వుల్లో మునిగిపోయింది.

కార్తీక్‌తో ఏడడుగులు అంటూ
డాక్టర్ భారతీకి చీరె గిప్టుగా ఇచ్చి కార్తీక్ కుటుంబానికి శాంతి లేకుండా చేశానన్న ఆనందంలో డాక్టర్ మోనిత మునిగిపోయింది. త్వరలోనే నేను కార్తీక్‌తో ఏడడుగులు నడవాలనే కోరిక తీరబోతున్నది. కార్తీక్ నావాడు కాబోతున్నాడంటూ అవధుల్లేని సంతోషానికి గురి అయింది.
తన ఆనందాన్ని పట్టలేక పనిమనిషి ప్రియమణిని పిలిచి నీకు ఎవరైనా పూజారి తెలుసా? అని అడిగింది.
Recommended Video

ప్రియమణి పూజారికి ఫోన్ కలిపి
దాంతో మోనిత ప్రశ్నకు సమాధానం ఇస్తూ .. ఏదైనా పూజలు చేయించుకొంటావా అమ్మా అని అడిగితే.. ముందు నీకు ఎవరైనా పూజారి తెలుసా? ప్రియమణిని మోనిత కసురుకొన్నది. దాంతో ప్రియమణి పూజారికి ఫోన్ కలిపి మోనితకు ఇచ్చింది. పూజారితో మోనిత మాట్లాడుతూ.. మంచి రోజులు ఎప్పుడు ఉన్నాయి అని అడిగితే.. రేపే మంచి రోజు ఉంది. మీరు ప్రారంభించాల్సిన పని రేపే మొదలుపెట్టవచ్చు అంటూ పూజారి చెప్పడంతో హ్యాపీగా ఫీలైంది.


Click it and Unblock the Notifications











