Karthika Deepam June 2nd Episode: నోర్మూసుకో మోనిత.. నా కాళ్ల వద్ద పడి ఉండాలి కార్తీక్.. ఎత్తుకుపై ఎత్తుతో..
కార్తీక దీపం సీరియల్‌కు సంబంధించిన 1055 ఎపిసోడ్‌లో డాక్టర్ మోనితకు తీవ్ర అవమానం ఎదురైంది. కార్తీక్, అతడి ఫ్యామిలీపై పగపట్టి కక్ష తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న మోనిత షాక్ తగిలింది. ఏదో చెద్దామని అనుకొంటూ వెళ్లిన మోనిత గొడవకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చింది. జూన్ 2వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

పెద్ద ఝలక్ ఇవ్వబోతున్నా అంటూ
కార్తీక్‌ను తన బుట్టలో ఎలా వేసుకోవాలనే ఆలోచనలతో మోనిత సతమతమైంది. అర్జెంట్‌గా కార్తీక్‌ను కలవాలి. నా ఇంటికే రమ్మని చెబితే అంటూ మనసులో అనుకొని.. నేను వాళ్లింటికి వెళ్లడం కరెక్ట్ అంటూ డాక్టర్ మోనిత ఓ నిర్ణయానికి వచ్చింది. రేపు పెద్ద ఝలక్ ఇవ్వబోతున్నాను కనుక.. వాళ్లింటికి వెళ్లి దీప భర్తగా కార్తీక్‌ను చివరిసారిగా చూస్తా. నా విషయంలో దీప గానీ, సౌందర్య గానీ ఓవరాక్షన్ చేస్తే అది ఈ రోజు వరకే. ఎందుకంటే రేపటితో సీన్ రివర్స్ అంటూ డాక్టర్ మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్‌గా కనిపించింది.

ఎన్నో ఏళ్ల కల సాకారం
పాపం దీప.. కార్తీక్ మారిపోయాడు. ఇక జీవితాంతం తనతో ఉంటాడని అనుకొంటుంది. కానీ రేపటి నుంచి కార్తీక్ నా భర్తగా ఉంటాడు. ఎన్నో ఏళ్ల కల రేపటితో నెరవేరబోతుంది అంటూ కార్తీక్ ఇంటికి చేరుకొన్నది. హాయ్ కార్తీక్ అంటూ పలకరంచగానే.. ఏంటి ఇలా రావడం ఇష్టం లేదా.. నాకు దొడ్డి దారిన రావడం నాకు ఇష్టం ఉండదని మోనిత పకపక నవ్వింది. మోనిత ఇలా నవ్వుతుండగానే దీప, సౌందర్య అక్కడికి చేరుకొన్నారు.

సౌందర్యకు షాకిచ్చిన మోనిత
ఇంట్లో పిల్లలు కనిపించకపోయే సరికి.. వాళ్లు ఎక్కడ అని సౌందర్య అడిగితే ఫాంహౌస్‌లో ఉన్న నాన్న వద్ద వదిలేశాను అని కార్తీక్ సమాధానం ఇచ్చాడు. అయితే రేపు పూజ పెట్టుకొని పిల్లలు అక్కడ ఎందుకు వదిలేశావు అంటూ సౌందర్య మాటల్ని అంతటితో ఆపేసింది. దాంతో నేనే వస్తానన్ని అనుకొంటున్నారా? నేను రావాలని అనుకొంటే వస్తాను.. మీరు రావొద్దని అనుకొన్నా వస్తాను అంటూ మోనిత తనదైన శైలిలో షాకిచ్చింది.

మోనితకు క్లాస్ పీకిన కార్తీక్
తన కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకోబుతున్న డాక్టర్ మోనితపై కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు పెళ్లై పదేళ్లు అయినా కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటూ ఏదో చెప్పబోయిన మోనితను ఉద్దేశించి.. నీవు నోర్మూసుకొంటావా? దయచేసి మా ఇంటి వ్యవహారంలో తలదూర్చకు. నీకు ఎన్నిసార్లు చెప్పినా కామన్ సెన్స్ లేకుండా పోతుంది అంటూ కార్తీక్ గట్టిగా క్లాస్ పీకారు.
Recommended Video

కార్తీక్ నిన్ను వదలను అంటూ...
దాంతో నేను మీ ఫ్యామిలీ మెంబర్‌గా భావించి నేను ఈ విషయంలో సలహాలు ఇవ్వబోయాను. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మాట్లాడుకోండి అంటూ అక్కడి నుంచి మోనిత వెళ్లిపోయింది. కారులో వెళ్తూ కార్తీక్‌పై అసహనం వ్యక్తం చేసింది. తనను దీప, సౌందర్య ముందు అవమానిస్తాడా అంటూ ఊగిపోయింది. ఇన్నాళ్లు చేదుగా మారిన భార్య ఇప్పడు బెల్లం అయిపోయిందా.. రేపు ఈ సమయానికి నా కళ్ల వద్ద ఉన్న క్లచ్ మాదిరిగా పడి ఉంటావు. నిన్ను వదలను అంటూ మోనిత్ కోపంతో ఊగిపోయింది.


Click it and Unblock the Notifications











