Karthika Deepam June 3rd Episode: ఎందుకు బతికించారు.. ప్రాణం పోతే ప్రశాంతంగా... సౌందర్యతో దీప ఆవేదన

అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కార్తీకదీపం సీరియల్‌లో అనేక రకాల భావోద్వేగాలు మరోసారి కనిపించాయి. ఆరోగ్యం కుదుటపడి ఇంటికి చేరిన దీపకు కష్టాలు, టెన్షన్లు తప్పడం లేదు. జీవితంలో తాను తప్పు చేశాను అంటూ కార్తీక్ బాంబు పేల్చడంతో ఇంటి సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇంట్లో జరిగే పూజ రోజున నేను చేసిన తప్పును చెబుతానని కార్తీక్ చెప్పడంతో ఇంటి సభ్యుల్లో ముఖ్యంగా దీప.. ఏం చెబుతాడోననే విషయం ఇప్పడు పాత్రల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో 1056‌ ఎపిసోడ్‌లోను, అంతకు ముందు.. జరిగిన విషయాలు ఏమిటంటే..

ప్రాణాపాయ స్థితి నుంచి ఇంటికి చేరిన దీపకు

ప్రాణాపాయ స్థితి నుంచి ఇంటికి చేరిన దీపకు


ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన దీప సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకొన్నది. ఇంటిలో ఆనంద క్షణాలు వ్యక్తమయ్యే సమయంలో అనూహ్యంగా ఇంటి సభ్యులకు ఓ విషయం చెప్పాలనుకొన్నానని కార్తీక్ వెల్లడించారు. తాను చెప్పాలని ప్రిపేర్ అయితే.. దీప ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాను. కాబట్టి దేవుడి ముందే ఆ విషయం చెప్పు అంటూ కార్తీక్‌కు తల్లి సౌందర్య సలహా ఇచ్చింది.

టెన్షన్‌లో దీప, శ్రావ్య, సౌందర్య

టెన్షన్‌లో దీప, శ్రావ్య, సౌందర్య


అయితే కార్తీక్ ఏం చెబుతాడో? కార్తీక్ ఎలాంటి విషయం చెప్పి మళ్లీ దీపను కష్టాల్లోకి నెడుతాడో అనే విషయం దీపను, ఆమె సోదరి శ్రావ్యను కంగారు పెట్టింది. తన బావ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని శ్రావ్య ఘాటుగా సౌందర్యతో అన్నారు. అంతేకాకుండా ఏ విషయం చెబుతాడో అనే భయం దీపను వెంటాడుతున్నది. ఇలా ట్విస్టులు కొనసాగుతున్న సమయంలో సౌందర్య కూడా టెన్షన్‌లో పడిపోయింది.

ఏం కొంపలు మునిగాయంటూ..

ఏం కొంపలు మునిగాయంటూ..


ఓ పక్క శ్రావ్య, మరో పక్క దీప ఇంట్లో ఏడుస్తూ ఉండటంపై అత్త సౌందర్య ఘాటుగా స్పందించింది. అక్కడ చెల్లి, ఇక్కడ అక్క.. ఏం కొంపలు మునిగిపోయాయని ఏడుస్తున్నారు. శ్రావ్య నీ గురించే ఏడుస్తూ బాధపడుతున్నది. ఇప్పుడు ఏం జరిగిందని మీరంత బాధపడుతున్నారు అంటూ సౌందర్య క్లాస్ పీకింది.

అలా బాంబు పేల్చిన కార్తీక్

అలా బాంబు పేల్చిన కార్తీక్


సౌందర్య మాటలపై దీప స్పందిస్తూ... కార్తీక్ బయటకు వెళ్తుంటే.. మీరు ఏం చెప్పాలనుకొంటున్నారో ఇప్పుడే చెప్పండి.. నా బుర్ర బద్దలైపోయేలా ఉంది అంటే.. నేను ఓ పెద్ద తప్పు చేశాను దీప. అది నీకు చెప్పాలి. ఆ విషయం నా జీవితానికి, భవిష్యత్‌కు సంబంధించింది అంటూ బాంబు పేల్చాడు అని దీప చెప్పింది.

ఎలాంటి ప్రళయం సృష్టిస్తారో అంటూ దీప

ఎలాంటి ప్రళయం సృష్టిస్తారో అంటూ దీప


అంతేకాకుండా నేను చెప్పబోయే విషయం పిల్లలు వినకూడనిది అంటున్నారు. ఆయన రేపు ఎలాంటి బాంబు పేల్చుతాడో.. ఎలాంటి ప్రళయం సృష్టిస్తారో అనే భయం నన్ను వెంటాడుతున్నది. మానసికంగా, శారీరకంగా బాగా అలిసిపోయాను అత్తయ్యా.. ఊహించిన విషయం ఆయన నోటి నుంచి వస్తే.. అది విని తట్టుకొనే గుండె నిబ్బరం నాకు లేదు అంటూ దీప కన్నీటి పర్యంతమైంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
దీపను ఓదార్చిన సౌందర్య

దీపను ఓదార్చిన సౌందర్య

సౌందర్యతో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. అసలు నన్ను ఎందుకు బతికించారు అత్తయ్యా.. అలాగే వదిలేసి ఉండి ఉంటే.. ఈపాటికి ప్రాణాలు పోయి ప్రశాంతంగా ఉండేదానిని అంటూ దీప కన్నీరుమున్నీరయ్యారు. దాంతో దీప మాటలకు అడ్డుపడుతూ.. ఏమిటే ఆ మాటలు.. ప్రాణాలు పోతే ప్రశాంతంగా ఉంటావా? అర్థం లేని మాటలు మాట్లాడకు...ధైర్యంగా ఉండూ, ఏం జరగదు అంటూ దీపను సౌందర్య ఓదార్చే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X