Karthika Deepam June 3rd Episode: దేవదాసుగా మారిన డాక్టర్ బాబు.. మద్యం గ్లాసుతో దీపకు షాక్
కార్తీకదీపం సీరియల్ అనేక మలుపులతో సుదీర్ఘంగా ముందుకు సాగుతున్నది. ఈ సీరియల్‌లో డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ మనోవేదనకు గురికావడం సీరియల్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. దీప ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆనందంలో మునిగిపోయిన కార్తీక్‌కు ఊహించని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మోనిత వ్యవహారం తనకు తలనొప్పి తెచ్చిపెట్టేలా మారడంతో మానసికంగా ఉద్వేగానికి గురి అవుతున్నాడు. ఈ క్రమంలో పరిస్థితులను తట్టుకొలేక కార్తీక్ మద్యం సేవిస్తూ దీపకు కనిపించడం తల్లిని, భార్యకు ఎమోషనల్‌గా మారింది.
కార్తీక్ ఒంటరిగా ఉన్నాడని.. కోడలు దీపను అందంగా తయారు చేసి గదిలోకి పంపించింది అత్త సౌందర్య. అయితే వెంటనే రావడంతో ఏం జరిగిందంటూ అత్త నిలదీసింది. దాంతో ఆయన నన్ను చూడటం లేదు. నన్ను పట్టించుకోలేదు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఆయన మందు కూడా తాగుతున్నాడు అత్తమ్మ అంటూ దీప చెప్పింది.

కార్తీక్ రెగ్యులర్‌గా మందు తాగుతున్నాడా? అంటే.. లేదు మద్యం సేవించడం మానేశాడు. ఆ మధ్యలో మనసు బాగోలేక తాగి వస్తే మందలించాను. అప్పటి నుంచి మానేశాడు. మళ్లీ ఇప్పుడే ఆ మాట నీ నుంచి విన్నాను అని సౌందర్య చెప్పారు.
దీప గదిలోకి వెళ్లగానే కార్తీక్ గ్లాస్‌తో మద్యం సేవిస్తూ.. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పుస్తకం పట్టుకొని ఎమోషనల్‌గా కనిపించాడు. భర్త అలా కనిపించడంతో ఏమీ తోచక దీప తిరిగి వెళ్లింది.


Click it and Unblock the Notifications











