Karthika Deepam June 3rd Episode: దీపకి ప్రేమతో కార్తీక్ అంటూ గిఫ్ట్: డాక్టర్ బాబుకు మోనిత బ్లాక్‌మెయిల్ కాల్

మోస్ట్ పాపులర్ డైలీ సీరియల్ కార్తీక దీపంలో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకొంటున్నాయి. కొద్ది రోజుల క్రితం దీపపై అనుమానాలు, అవమానాలు తొలగిపోవడంతో డాక్టర్ కార్తీక్ తాను భార్యకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భార్యపై ప్రేమను కురిపిస్తూ డాక్టర్ బాబు లవ్లీ గిఫ్టును సిద్ధం చేశారు. అయితే ఈ ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో కార్తీక్ ఎదురైన సమస్య ఏమిటంటే...

దీప మనసులో కల్లోలం

దీప మనసులో కల్లోలం

కార్తీక్, దీప దంపతుల మధ్య సానుకూల పరిస్థితులు నెలకొనడంతో కుటుంబ సభ్యులకు మనశాంతి కలుగుతుంది. కానీ తాను తప్పు చేశానంటూ ఓ మాట చెప్పడం, అది పూజ రోజున దేవుడు ముందు వెల్లడిస్తానని ట్విస్టు పెట్టడంతో దీప మనసులో కల్లోలం రేగుతున్నది.

కార్తీక్‌పై పగకు మోనిత శపథం

కార్తీక్‌పై పగకు మోనిత శపథం

ఇక దీప, కార్తీక్ దగ్గర కావడం డాక్టర్ మోనితకు సహించడం లేదు. తన వద్ద బ్రహ్మస్త్రం ఉందంటూ, కార్తీక్‌ను తన కాలి కింద కారు క్లచ్‌ మాదిరిగా వాడుకొంటానని మోనిత శపథం చేసింది. ఈ క్రమంలో పెళ్లికి కూడా ఏర్పాట్లు చేసుకొంటూ షాకులిస్తున్నది. మోనిత ప్రయత్నాలు, ప్రవర్తన కార్తీక్ కుటుంబంలో కలవరానికి గురిచేస్తున్నది.

శ్రీశ్రీ రచించిన పుస్తకాన్ని అందంగా ప్యాక్

శ్రీశ్రీ రచించిన పుస్తకాన్ని అందంగా ప్యాక్

కార్తీక్ ఇలాంటి ట్విస్టుల మధ్య దీపపై ప్రేమను కురిపిస్తూ గిఫ్టును తయారు చేశాడు. గతంలో దీప తనకు ఇష్టమైన శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పుస్తకాన్ని నేలకు విసిరికొట్టడం, మరో సందర్భంలో పుస్తకాన్ని చింపి వేయడం లాంటి చేయడం జరిగింది. అయితే తాను అలా ప్రవర్తించిన దీప మనసును బాధపెట్టినందుకు ఆమెకు అదే పుస్తకాన్ని ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

దీపకు ప్రేమతో డాక్టర్ బాబు అంటూ

దీపకు ప్రేమతో డాక్టర్ బాబు అంటూ

మహా ప్రస్థానం పుస్తకంను గిఫ్టు ప్యాక్ చేసి.. దానిపై ఓ పేపర్ అంటించి.. ముందు దీపకి ప్రేమతో డాక్టర్ బాబు అంటూ రాశాడు. అది నచ్చకపోవడంతో వెంటనే చించి .. మరో పేపర్‌పై దీపకి ప్రేమతో కార్తీక్ అంటూ అతికించాడు. ఇలా ప్రేమగా దీపకు గిఫ్టును ఇవ్వాలనుకొంటున్న సమయంలో ఫోన్ రింగ్ అయింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
డాక్టర్ బాబుకు ఊహించిన ఫోన్ కాల్

డాక్టర్ బాబుకు ఊహించిన ఫోన్ కాల్

ఇక కార్తీక్ బాబును రేపు పెళ్లి చేసుకొంటానని ఉవ్విల్లూరుతూ ఆనందంలో తలమునకలైపోతున్న డాక్టర్ మోనిత.. కార్తీక్ ఫోన్ చేసి ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒకవేళ కార్తీక్ అందుకొన్న ఫోన్ మోనిత అయి.. ఆమె కార్తీక్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్ధమై ఉంటుంది అనే ఊహాగానాలు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X