Karthika Deepam June 4th Episode:నేను ప్రెగ్నెంట్, నీ కొడుకు వల్లే గర్బవతిని అయ్యా, బాంబు పేల్చిన మోనిత

కార్తీకదీపం సీరియల్‌లో అందరూ ఊహించినట్టుగానే డాక్టర్ మోనిత ఆటం బాంబు పేల్చింది. కార్తీక్, దీప దాంపత్యంలో నిప్పులు పోసింది. పచ్చగా కొనసాగాల్సిన వారి కాపురం, ఇంట్లో జరుగాల్సిన పూజా కార్యక్రమాన్ని అడ్డుకొన్నది. కార్తీక్ ఇంటి సభ్యులకు మనశాంతి లేకుండా చేసింది. తాజాగా ఎపిసోడ్ 1057‌ ఏం జరిగిందంటే..

 దీప నీకు నరకం చూపించానంటూ

దీప నీకు నరకం చూపించానంటూ

కార్తీక్ తన ఇంటిలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి తాను తప్పు చేశానంటూ కార్తీక్ కాళ్లపై పడ్డాడు. జీవితంలో అనేక రకాలుగా క్షోభను, నరకాన్ని చూపించాను. అనకూడదని మాటలు అంటూ అవమానించాను అంటూ దీపను కార్తీక్ క్షమాపణ కోరుకొన్నారు. అంతలోనే డాక్టర్ మోనిత అందంగా తయారై అక్కడికి ఎంట్రీ ఇచ్చింది.

నీకు సంతానం కలుగుతుందని తెలిసింది

నీకు సంతానం కలుగుతుందని తెలిసింది

కార్తీక్‌ను ఉద్దేశించి చేసిన తప్పును గుర్తించావు. సరిద్దిద్దుకోవడం సులభం అంటూ డాక్టర్ మోనిత వారి కుటుంబంలో జోక్యం చేసుకొన్నది. నీకు సంతానం కలిగే యోగ్యత ఉంది. ల్యాబ్‌లో రిపోర్టులు తారుమారు అయ్యాయి. మానవ తప్పిదం వల్ల నీకు సంతానం కలుగదనే అబద్ధం చోటుచేసుకొన్నది. అది మానవ తప్పిదం అంటూ మోనిత అందరికీ షాకిచ్చేలా కామెంట్లు చేసింది.

 శౌర్య, హిమ నీ బిడ్డలే

శౌర్య, హిమ నీ బిడ్డలే

నీకు సంతానం కలుగుతుందనే విషయం నిజం. శౌర్య, హిమ నీకు పుట్టిన బిడ్డలే. అందులో ఎలాంటి అనుమానం లేదు. కంగ్రాట్స్ కార్తీక్.. నీకు పిల్లలు పుట్టే యోగం ఉందని ఈ రోజే కన్ఫర్మ్ అయింది. ఇది సంతోషించాల్సిన విషయమే కాదా? దీనికి క్షమాపణలు కోరుకోవడం ఎందుకు? అని డాక్టర్ మోనిత ట్విస్టు ఇచ్చింది.

 నన్ను ఆశీర్వదించండి అంటీ అంటూ మోనిత

నన్ను ఆశీర్వదించండి అంటీ అంటూ మోనిత

నీకు పిల్లలు పుడుతారనే శుభవార్తను నేను మోసుకొచ్చాను. వాస్తవానికి అందరికీ స్వీట్లు తినిపించి ఈ వార్తను చెప్పాలనుకొన్నాను. కానీ సంతోషంలో స్వీట్లు తీసుకురావడం మరిచిపోయాను. ఇక్కడ పూజ జరుగుతుంది కదా.. అక్షింతలు నా నెత్తిన ఆశీర్వదించండి.. అంటీ అంటూ సౌందర్య కాళ్లకు నమస్కరించింది దాంతో సౌందర్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నీవు వాడికి పిల్లలు పుడుతారని చెప్పడం ఏమిటి? నేను ఆశీర్వదించడం ఏమిటి? అంటూ ఫైర్ అయింది.

నీ కొడుకు వల్ల నాకు గర్బం అంటూ మోనిత

నీ కొడుకు వల్ల నాకు గర్బం అంటూ మోనిత

దాంతో మోనిత విషపు నవ్వు నవ్వుతూ ... నేను నెల తప్పాను ఆంటీ.. నాకు ఈ రోజే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటూ అందరికి షాకిచ్చింది. దాంతో సౌందర్య కోపంగా మోనిత.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకొంటున్నావు అంటూ నిలదీసింది. ఈ క్రమంలో సౌందర్యను మరింత ఇరిటేట్ చేస్తూ ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోవడం ఏమిటి? మీరు ఏమైనా చిన్న పిల్లా ఆంటీ..? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను అంటూ బాంబు పేల్చింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
 కోలుకోలేని విధంగా కార్తీక్ ఫ్యామిలీ

కోలుకోలేని విధంగా కార్తీక్ ఫ్యామిలీ

మోనిత ఇచ్చిన షాక్‌తో కార్తీక్‌తోపాటు ఇంటి సభ్యులందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. దీప పరిస్థితి ఇక మాటల్లో చెప్పలేనంతగా మారింది. దీప తండ్రి, సోదరి, మరిది అంతా మోనిత తీరు, ప్రవర్తనతో కుంగిపోయారు. సంతోషకరమైన సమయంలో మోనిత పెట్టిన చిచ్చు నుంచి కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X