Karthika Deepam June 4th Episode: దేవుడికి కాదు.. దేవతకు దండం పెట్టుకోవాలి అంటూ దీప కాళ్లకు కార్తీక్ నమస్కారం
తెలుగు బుల్లితెరపై గత కొన్ని వారాలుగా టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్న కార్తీక దీపం సీరియల్‌లో ఊహించని సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఇప్పటి వరకు దీపకు చేసిన అన్యాయానికి క్షమాపణ కోరుకోవాలని మదనపడుతున్న కార్తీక్ అన్నంత పనిచేశాడు. ఇంటి సభ్యుల్లో ఆనందాలు వ్యక్తమవుతున్న సమయంలో మోనిత వచ్చి మరో చిచ్చు పెట్టింది. ఈ సీరియల్‌లొని 1057 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

దీప నుదుడిపై చేయిపెట్టి ప్రేమగా
పూజా కార్యక్రమం జరుగుతుందనే ఆనందంలో ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు కార్తీక్ చేరుకొన్నాడు. ఇంటి సభ్యులందరి దృష్టి కార్తీక్‌పైనే ఉండటంతో తాను ముభావంగా నడుచుకొంటూ దీప వద్దకు చేరుకొన్నాడు. దీప నుదుటిపై చేయిపెట్టి ముక్కుపై పడిన కుంకుమను మెల్లగా ఊది తొలగించే ప్రయత్నాన్ని కార్తీక్ చేశాడు. దీపపై కార్తీక్ కురిపిస్తున్న ప్రేమను చూసి సౌందర్యతోపాటు అందరూ ఆనందంలో మునిగిపోయారు.

నా కొడుకు, కోడలికి అంటూ..
పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం కావడంతో ఏ జంటకు పూజ చేస్తున్నారంటూ పూజారి అడగడంతో నా పెద్ద కొడుకు, పెద్ద కోడలికి అంటూ సౌందర్య సంతోషంగా చెప్పింది. వారిద్దరు వచ్చి కూర్చొంటే పూజ జరిపిస్తాను అంటూ పూజారి చెప్పడంతో కార్తీక్ నాలుగు అడుగులు ముందుకు వేశాడు.

దీపకు గిఫ్ట్ ఇవ్వాలని కార్తీక్
అంతలోనే ఇక దీపకు గిఫ్గుగా ఇద్దామని అనుకొన్న మహా ప్రస్థానం పుస్తకాన్ని తేవడం మరిచిపోయిన కార్తీక్ మళ్లీ తన రూమ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే పూజకు దుర్ముహుర్తం వస్తుంది. పూజలో కూర్చోమంటూ కార్తీక్‌కు సౌందర్య సూచించడంతో ఆ ప్రయత్నాన్ని మానుకొన్నాడు.

నేను చిత్రవధకు గురిచేశాను...
కార్తీక్‌ను పిలిచి ముందు వచ్చి దేవుడికి దండం పెట్టుకో అంటూ సౌందర్య అంటే.. దేవుడికి కాదు.. మమ్నీ.. దేవతకు దండం పెట్టుకోవాలి అంటూ కార్తీక్ అనడంతో అందరూ కంగారుగా చూశారు. దీప వద్దకు వచ్చి కాళ్లకు నమస్కరించాడు. దాంతో దీప కాస్త దూరం జరిగింది. ప్రేమగా దీపను చూస్తూ కార్తీక్ తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు.
Recommended Video

ఉరిశిక్ష వేసినా సరిపోదు అంటూ
దీపను ఉద్దేశించి.. నేను చేసిన నేరానికి ఏ కోర్టు శిక్ష వేయలేదు. బయటకు చెప్పుకోలేని తప్పును నేను చేశాను. మాటలతో, చేతలతో గుండెల్లో పొడిచి పోడిచి చిత్రవధ చేశాను. అందర్నీ క్షోభ పెట్టి జీవితాలతో ఆడుకొన్నాను. నేను చేసిన అపరాధం హత్య నేరం కంటే పెద్దది. దానికి ఉరిశిక్ష వేసినా సరిపోదు. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప అంటూ కార్తీక్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అంతలోనే మోనిత అక్కడకు వచ్చి ప్రెగ్నెంట్ అని బాంబు పేల్చింది.


Click it and Unblock the Notifications











