Karthika Deepam June 5th Episode: నా కడుపులో బిడ్డకు తండ్రివి నీవే.. కార్తీక్ ఇంట్లో మోనిత హైడ్రామా

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకదారణతో సాగుతున్న కార్తీకదీపం సీరియల్‌లో రోజు రోజుకు భావోద్వేగాలు మలుపు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కార్తీక్, దీప దాంపత్య జీవితం సర్దుకొన్నదనే లోపే వారి కాపురంలో డాక్టర్ మోనిత చిచ్చు పెట్టింది. నేను ప్రెగ్నెంట్ అంటూ కార్తీక్ ఇంట్లో బాంబు పేల్చిన తర్వాత అంతా అయోమయం నెలకొన్నది. ఈ క్రమంలో 1058 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

మోనితను నిలదీసిన సౌందర్య

మోనితను నిలదీసిన సౌందర్య

తాను ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. అందరూ అనుమానంగా చూడటంతో డాక్టర్ మోనిత దేవుడిపై కూడా ప్రమాణం చేసింది. అయినా ఏం మాట్లాడుతున్నావు అంటూ సౌందర్య నిలదీయడంతో... నేను చెప్పిన మాటలు అర్ధం కాకపోవడానికి మీరు చిన్నవాళ్లు కాదంటూ కౌంటర్ వేసింది.

మోనితపై కార్తీక్ ఆగ్రహం

మోనితపై కార్తీక్ ఆగ్రహం

తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అంటూ ఆరోపణలు చేసిన మోనితపై కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాప్ ఇట్ మోనిత. ఏ మాట్లాడుతున్నావు నువ్వు. మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇది జోక్ చేసే విషయమా? నీ గురించి, అమ్మ, దీప ఎప్పుడు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు నీ వ్యవహారం కళ్లారా చూస్తున్నాను. మా ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా పిలువని పేరంటానికి వచ్చినట్టు వస్తావు. రసభాస చేయాలని చూస్తావు. ఇప్పుడు నీవు చేసేది హద్దులు మీరినట్టు ఉంది అంటూ కార్తీక్ ఫైర్ అయ్యాడు.

మోనిత గెట్ అవుట్ అంటూ...

మోనిత గెట్ అవుట్ అంటూ...

తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మోనితపై మండిపడుతూ.. నీవు నా ఫ్రెండ్‌వా? శత్రువా? ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నావు? అంటూ నిలదీశాడు.. దాంతో నిజం మాట్లాడుతున్నాను కార్తీక్ అంటూ మోనిత అంటే.. షటప్ అండ్ గెట్ అవుట్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కార్తీక్ మండిపాటుపై మోనిత స్పందిస్తూ.. మగాడివి అనిపించుకొన్నావు కార్తీక్. ఆడది అంటే అంత అలుసా? నిలదీసింది.

డీఎన్‌ఏ టెస్ట్‌ అంటూ

డీఎన్‌ఏ టెస్ట్‌ అంటూ

మోనిత అంతటితో ఆగకుండా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెబితే దాచేస్తే దాగే విషయమా? ఇవాళ కాకపోతే రేపైనా విషయం బయటపడదా? నా ప్రెగ్నెన్సీకి కారణం నీవు కాదంటావా? రేపు డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తే అది కూడా బయటపడుతుంది కదా కార్తీక్. ఏ ఆడపిల్ల అయినా ఈ విషయంలో అబద్దం చెబుతుందా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నీవే కారణమని దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను అంటూ కార్తీక్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.

అయోమయంలో కార్తీక్ కుటుంబం

అయోమయంలో కార్తీక్ కుటుంబం

మోనిత మాటలతో, ఆరోపణలతో ఇంటి సభ్యులంతా నివ్వెరపోయారు. దీప, సౌందర్య పరిస్థితి దారుణంగా మారింది. ఇక శ్రావ్య, దీప తండ్రి మురళీ కృష్ట విషయం చెప్పనక్కర్లేకుంటా కనిపించింది. పూజ జరుగాల్సిన శుభ సమయంలో మోనిత రూపంలో ఇలాంటి రచ్చ జరగడంతో అందరూ షాక్‌లో ఉన్నారు. మోనిత ఆరోపణలకు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితుల్లో ఒకరి ముఖం మరొకరు చూసుకొంటూ నిలుచుండిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X