Karthika Deepam June 7th Episode: నేను నెల తప్పాను.. కానీ నీవు మాట తప్పావు.. కార్తీక్‌కు మోనిత షాక్

కార్తీక దీపంలో సీరియల్‌లో డాక్టర్ మోనిత ప్రెగ్నెన్సీ వ్యవహారం ఇప్పుడు కథను మలుపు తిప్పేలా కనిపిస్తున్నది. కార్తీక్, దీప, మోనిత మధ్య ట్రయాంగిల్ ఫ్యామిలీ స్టోరీ ఆసక్తికరంగా మారింది. మోనిత చేసిన ఆరోపణలకు కార్తీక్ ఎలా ముగింపు ఇస్తాడనే విషయం ప్రేక్షకులకు, ఈ సీరియల్ అభిమానులకు ఉత్కంఠగా మారింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నీవే అంటూ మోనిత చేసిన ఆరోపణలకు డాక్టర్ కార్తీక్ సమాధానం ఇస్తూ....

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
నీవు తప్పు చేశావు మోనిత..

నీవు తప్పు చేశావు మోనిత..

ప్రెగ్నెన్సీ వ్యవహారం బయపెట్టిన మోనితతో.. నీవు తప్పు చేశావు. నీవే కాకుండా నాతో సరిదిద్దుకోలేని తప్పు చేయించావు. ఎందుకలా చేశావు. ఆ రోజు నేను తాగిన మత్తులో ఉంటే నా చెంప పగలకొట్టాల్సి ఉండాల్సింది. అలా చేస్తే నా ప్రాణంగా ప్రేమించే కుటుంబం ముందు దోషిగా తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేదా అంటూ కార్తీక్ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని ఎలా కొట్టమంటావు అంటూ మోనిత ఆవేదన వ్యక్తం చేసింది.

 కార్తీక్ అందుకే నీకు అర్పించుకొన్నాను..

కార్తీక్ అందుకే నీకు అర్పించుకొన్నాను..

అయినా జరిగిన దానిలో తప్పంతా నాదే అన్నట్టు.. నన్ను ఎందుకు నిందిస్తున్నావు కార్తీక్.. నేను ఎప్పుడు ఎలా చూశానో.. ఆ రోజు కూడా అలానే చూశాను. కానీ నన్ను నీవే వేరేలా చూశావు. ఆ సమయంలో వద్దని చెప్పాలని చూశాను. కానీ రేపే మనం పెళ్లి చేసుకొందామని చెప్పావు. 16 సంవత్సరాలుగా నా మనసులో వేరే మగాడికి స్థానం ఇవ్వలేదు. అలాంటి నాకు నీఅంతటా నీవే జీవిత భాగస్వామిగా స్థానం ఇస్తానంటే ఆనంద పడ్డాను. అందుకే నన్ను నేను అర్పించుకొన్నాను అంటూ మోనిత కంటతడి పెట్టుకొంటూ కార్తీక్‌కు తన బాధను వెల్లడించింది.

పెళ్లి ప్రస్తావన ఎందుకు తీసుకరాలేదంటూ..

పెళ్లి ప్రస్తావన ఎందుకు తీసుకరాలేదంటూ..

కార్తీక్ తీరును తప్పు పట్టే ప్రయత్నం చేస్తూ.. ఈ తప్పులో నాకు ఇందులో దురుద్దేశం లేదు. నేను నెల తప్పాను అంతే.. కానీ నీవు మాట తప్పావు. అదే నాకు బాధగా ఉంది అంటూ మోనిత చెబితే... ఎందుకు ఇన్ని రోజులు నాతో చెప్పలేదు. ఈ విషయం చెప్పి పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు అంటూ కార్తీక్ నిలదీసే ప్రయత్నం చేశాడు. దాంతో చెప్పాలని నాకు ఉన్నా వినే పరిస్థితి నీకు ఎక్కడుంది. నీ భార్య నిన్ను మనశాంతిగా ఉండనిచ్చిందా? ప్రతీ రోజు ఏదో ఒక గొడవ కదా.. అలాంటి పరిస్థితుల్లో నా స్వార్థం చూసుకోగలనా? అంటూ మోనిత తన వాదనను వినిపించింది.

తప్పులో ఇద్దరికి బాధ్యత

తప్పులో ఇద్దరికి బాధ్యత

హిమను వెతికి తెస్తే పెళ్లి చేసుకొంటానని నీవే చెప్పావు. కానీ హిమ వచ్చింది.. నన్ను పెళ్లి చేసుకొంటావని చెప్పావా? అలా కాకుండా నీ భార్య బిడ్డల్ని నీవే వెతికి తెచ్చుకొన్నావు. నన్ను పట్టించుకోవడమే మానేశావు. తప్పంతా నీలో పెట్టుకొని నన్ను అంటావు కార్తీక్. చూడు కార్తీక్.. ఈ తప్పులో ఇద్దరికి బాధ్యత ఉంది. ఈ తప్పులో నన్నే బాధ్యత చేసి కడుపులో పెరిగే బిడ్డకు అన్యాయం మాత్రం చేయకు. దీపను వదిలేసినట్టు నన్ను వదిలేయకు. ప్లీజ్ కార్తీక్ నీ కాళ్లు పట్టుకొంటాను అంటూ కార్తీక్ కాళ్లపై మోనిత పడింది.

అయోమయంలో కార్తీక్

అయోమయంలో కార్తీక్

మోనిత తన కాళ్లపై పడటంతో కార్తీక్ దూరంగా జరిగాడు. జరిగిన తప్పుకు చింతిస్తూ అయోమయంలో పడినట్టు కనిపించాడు. మోనిత వ్యవహారం ఓ వైపు, కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలనే విషయం కార్తీక్ అగ్నిపరీక్షగా మారింది. ఈ క్రమంలో మాట మాట్లాడకుండా మోనిత ఇంటి నుంచి కార్తీక్ మౌనంగా వెళ్లిపోయాడు. మోనిత తన కుట్ర వర్కవుట్ అయిందనే మిశ్రమ స్పందనలో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X