Karthika Deepam June 8th Episode: నేను అప్పుడే చచ్చిపోయాను.. చలించని దీప.. సౌందర్య కంటతడి

అత్యధిక టీఆర్పీ కలిగిన డైలీ సీరియల్ కార్తీక దీపంలో మరో ట్విస్టుకు తెరలేపారు. తాను ప్రెగ్నెంట్ అంటూ మోనిత బాంబు పేల్చడంతో కార్తీక్ ఇంటిలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తన జీవితంలో ఊహించిన సంఘటన ఎదురు కావడంతో ఇంటి నుంచి దీప వెళ్లేందుకు నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో సౌందర్య, దీప మధ్య సన్నివేశాలు చాలా ఉద్వేగంగా కనిపించాయి. 1060 ఎపిసోడ్‌లో జరిగిన విషయాలు ఏమిటంటే..

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
సౌందర్య కంటతడితో

సౌందర్య కంటతడితో

దీపకు ఎదురైన సమస్యతో సౌందర్య ఆవేదన గురై కంటతడి పెట్టుకొన్నది. దీప కష్టాలను ఏకరువు పెడుతూ.. బిడ్డను కని ఎనిమిదేళ్లు పెంచావు. ఆ తర్వాతే నీకు పుట్టింది కవలలని తెలుసుకొన్నావు. కూతురు అని తెలిసినా అమ్మ అని చెప్పుకోలేని పరిస్థితి. నాన్న అని తెలిసినా ఆ పసిపిల్ల పిలువలేక కొంతకాలం బాధపడింది. ఇన్ని కష్టాలు అనుభవించింది ఈ రోజు కోసమే కదా.. వాడు నిజం తెలుసుకొనే రోజు ఒకటి వస్తుందనే కదా. ఈ రోజు కోసమే కదా.. కానీ ఇలాంటి పరిస్థితి ఈ రకంగానా మనకు.. నా వల్ల కావడం లేదు అంటూ దీపతో సౌందర్య తన బాధను పంచుకొన్నారు.

నా జన్మ అందుకే అంటూ దీప ఎమోషనల్

నా జన్మ అందుకే అంటూ దీప ఎమోషనల్

అత్త సౌందర్యను ఓదార్చుతూ.. బాధపడకండి అత్తయ్యా.. భగవంతుడు కొంత మందిని పరోపకారం కోసం పుట్టిస్తాడు. కొంతమందిని మాధవసేవ కోసం పుట్టిస్తాడు. మరికొంత మందిని మానవ సేవ కోసం పుట్టిస్తాడు. కొంత మందిని మంచి చేయడం కోసం పుట్టిస్తాడు. కొంత మందిని చెడు చేయడం కోసం... కొంతమందిని సుఖ:పడటం కోసం పుట్టిస్తాడు. మరి కొంత మందిన బాధపడటం కోసం పుట్టిస్తాడు. అలాంటిదే నా జన్మ అంటూ దీప చెప్పింది.

తప్పు చేయలేదని తెలుసుకొన్నందుకు

తప్పు చేయలేదని తెలుసుకొన్నందుకు

ఇలాంటి బాధలు, కష్టాలు నాకు కొత్తేమీ కాదు. ముఖంలో నవ్వు వికసించే రోజు పుష్కరానికి ఓసారి వస్తుందని రాసినట్టు ఉన్నాడు ఆ దేవుడు. నీ అబ్బాయి ఎలాంటి ఆధారాలు లేకుండా అభాండాలు వేసి అవమానించాడు. ఆనాడే నేను చచ్చిపోయాను. కానీ నాపై ఆరోపణలు రుజువు కాకుండా చచ్చిపోవద్దని ప్రాణాలు నిలబెట్టుకొన్నాను. దీప తప్పు చేయలేదని మీ అబ్బాయి తెలుసుకొన్నందుకు నాకు ఆనందంగా ఉంది అత్తయ్యా అంటూ సౌందర్యను దీప ఓదార్చే ప్రయత్నం చేసింది.

నా భ్రమలను తొలగించారు

నా భ్రమలను తొలగించారు

దీప అన్ని రకాల సమస్యలను జయించింది. ఇప్పుడు చనిపోయినా అది వీరమరణమే అవుతుంది. దగ్గరుండి వైద్యం చేయిస్తే ప్రేమ అని భ్రమ పడ్డాను. కొద్ది రోజులు గడవకముందే అది జాలితో చేసిన పని తేల్చేసి నా భ్రమలను తొలగించారు. కానీ ఒక్కరు జాలి పడే జీవితం నాకు వద్దు అత్తయ్యా. ఇక్కడ నేను ఉండలేను. నేను వెళ్లిపోతాను అంటూ దీప తేల్చేసింది.

ఇంటి నుంచి నిష్క్రమించిన దీప

ఇంటి నుంచి నిష్క్రమించిన దీప

ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమైన దీపను ఆపేందుకు సౌందర్య ప్రయత్నించింది. దాంతో నన్ను ఆపకు అత్తయ్య అంటూ తన దారి తాను చూసుకొనేందుకు సిద్ధమైంది. నిజంగా నాపై సానుభూతి ఉంటే నన్ను ఆపే ప్రయత్నం చేయకండి అంటూ లేచిన దీపను బతిమాలే ప్రయత్నం చేసింది. అయినా నన్ను క్షమించండి అంటూ దీప అక్కడి నుంచి నిష్క్రమించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X