For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam June 8th Episode: మోనితతో అక్రమ సంతానం.. కార్తీక్‌ను కడిగి పడేసిన సౌందర్య

  |

  కార్తీక్ కాపురంలో మోనిత పెట్టిన చిచ్చుతో ఇంటి సభ్యులు కంట్రోల్ తప్పిపోయారు. ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలను వెల్లడించడం మొదలుపెట్టారు. అందరూ కార్తీక్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సౌందర్య, శ్రావ్య, అందరూ దీపపై సానుభూతిని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో 1060 ఎపిసోడ్‌లో...

  మీ అన్నయ్య చేసిన తప్పుకు...

  మీ అన్నయ్య చేసిన తప్పుకు...

  సౌందర్య, తన భర్త ఆదిత్యతో వాదనకు దిగుతూ.. ఆనాడు ఏమీ తప్పు చేయకపోయినా మా అక్కయ్య దీప ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు ఎవరీ ఊహలకు అందనంత తప్పు చేశాడు. అయినా మా అక్కే ఇంటి నుంచి వెళ్లిపోయింది. మీ అన్నయ్య ఏం సమాధానం చెబుతాడు అంటూ శ్రావ్య నిలదీసింది. అప్పుడే అక్కడకు కార్తీక్ రావడం, చుట్టూ దీప కోసం వెతుకుతుంటే... వదిన లేదు. ఇంటి నుంచి వెళ్లిపోయింది అంటూ ఆదిత్య సమాధానం చెప్పాడు.

  కార్తీక్ నీవు ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్‌తో

  కార్తీక్ నీవు ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్‌తో

  దీప ఇంటి నుంచి వెళ్తుంటే మీరు ఆపలేదా? మొన్ననే కదా హాస్పిటల్ నుంచి వచ్చింది. ఆరోగ్యం ఏమౌపోతుంది.. ఎలా వెళ్లనిచ్చావు మమ్మీ అంటూ కార్తీక్ ప్రశ్నిస్తే... ఎలా ఉండమంటాం కార్తీక్. నీవు ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్ మేమే భరించలేకపోతున్నాం. చావు దావు దాకా వెళ్లి బతికి వచ్చింది. దాన్ని ఎలా ఉండమంటాం అంటూ సౌందర్య అంటే.. నేను ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాను. పూర్తిగా చంపకు మమ్మీ అంటూ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
  దేవత లాంటి వదినను ఇంటి నుంచి పంపించేసి మనం ఇంట్లో దయ్యాల మాదిరిగా తీరుగుతున్నాం అంటూ ఆదిత్య ఘాటుగా స్పందించాడు.

  ఎప్పుడు ఏం చెప్పాలనుకొంటున్నావు అంటూ

  ఎప్పుడు ఏం చెప్పాలనుకొంటున్నావు అంటూ

  తల్లి సౌందర్యకు తన తప్పు గురించి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ.. మమ్మీ నేను నిజం చెబుతున్నాను అంటూ కార్తీక్ ఏదో చెప్పబోగా.. ఇప్పుడేమి చెప్పదలచుకొంటున్నావు. ఇప్పుడు ఏ తప్పు చేయలేదని చెప్పాలనుకొంటున్నావా? మోనిత పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి.. నా గర్బానికి నీవే కారణమని ఎలా చెబుతుందిరా అంటూ కార్తీక్‌ను సౌందర్య కడిగిపోడేసింది. మోనితే కాదు. ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి విషయంలో అబద్దం చెప్పదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

  నీది ఆ దుస్థితి రా అంటూ సౌందర్య

  నీది ఆ దుస్థితి రా అంటూ సౌందర్య

  నీ భార్య కడుపును పుట్టిన పిల్లల్ని ఇంకా అక్రమ సంతానం అనే నమ్ముతున్నాం. నీ వల్ల పుట్టబోయే అక్రమ సంతానం ద్వారా నీ పిలల్లు నీ బిడ్డలే అని నమ్మాల్సిన దుస్థితిరా నీది అని కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆదిత్య, శ్రావ్య కూడా కార్తీక్‌ను తప్పుపట్టారు. దాంతో కార్తీక్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నీ తీరు వల్ల ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏ పని చేసుకొని పొట్ట నింపుకొంటుంది అంటూ శ్రావ్య ప్రశ్నించింది. దీపకు చేసిన అన్యాయాన్ని తలచుకొని మనసులోనే కార్తీక్ కుంగిపోయాడు. తన జీవితంలో చోటుచేసుకొన్న పరిణామం గురించి ఎలా చెప్పాలి అంటూ మనసులోనే మదనపడిపోయాడు.

  ఏదైనా ఉంటే దీపకు చెప్పుకో..

  ఏదైనా ఉంటే దీపకు చెప్పుకో..

  ఇంటి సభ్యుల నిలదీతతో మరింత కుంగిపోయిన కార్తీక్ తన తల్లి సౌందర్యకు ఏదో చెప్పబోయాడు. కానీ కార్తీక్‌కు ఆ ఛాన్స్ ఇవ్వకుండా.. నీవు ఏదైనా సమాధానం చెప్పుకోవాలనుకొంటే.. దీపకు చెప్పుకో. అలాగే నీ వల్ల తల్లి కాబోతున్న మోనితకు సమాధానం చెప్పుకో అంటూ సౌందర్య ఘాటుగా స్పందించింది.

  దేవుడు పటాల ముందు కార్తీక్ దీనంగా

  దేవుడు పటాల ముందు కార్తీక్ దీనంగా

  ఇంటి సభ్యుల ఈసడింపుతో.. దేవుడు పటాల ముందుకు వెళ్లిన కార్తీక్... ఏంటి సామీ ఇలా చేశావు.. దీపకు ఎలా దగ్గరవ్వాలి.. మా ఇంట్లో వాళ్లు కాదు.. ప్రపంచం కాదు.. దీపను ప్రసన్నం చేసుకోవాలి చాలూ.. నా మీద పడ్డది నింద అని చెప్పను. అది నిజం అని కూడా నమ్మలేకుండా ఉన్నాను. దీపకు ఎదురుపడాలి. దీపకు ఎలా సమాధానం చెప్పుకోనే ధైర్యం ఇవ్వు. ఈ గండం నుంచి గట్టెక్కించు అని వేడుకొన్నాడు.

  దీనంగా దీప ఇంటికి కార్తీక్

  దీనంగా దీప ఇంటికి కార్తీక్


  ఇంటి నుంచి నేరుగా దీప ఇంటికి కార్తీక్ చేరుకొన్నాడు. అక్కడే అంతా క్లీన్ చేస్తున్న పనిమనిషిని శుభ్రం చేయడం ఆపమన్నాడు. దీప నాతోపాటు ఇంటికి వచ్చేస్తుంది అంటూ కార్తీక్ అనగానే.. ఎవరు ఎక్కడ ఉండాలో.. తేల్చాల్సింది నీవు కాదు.. నేను కాదు.. ఆ పైవాడు అంటూ దీప తేల్చేసింది. అలా వారిద్దరి మధ్య మరింత వాదన జరిగినట్టు తదుపరి ఎపిసోడ్‌లో హింట్ ఇచ్చారు.

  English summary
  Karthika Deepam 8th June's Episode of 1060 goes with another big twist. After Monita's pregnancy revelations, situation become horrible in karthik's home. In this emotional situtaion, Deepa left home again amid Soundryas requests and pray.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X