Karthika Deepam June 9th Episode: ఆ రోజు మోనిత ఇంట్లో.. నన్ను క్షమించవా.. దీపతో ప్రాధేయపడిన కార్తీక్

అత్యధిక ప్రజాదరణను సొంతం చేసుకొన్న కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి కార్తీక్, దీప, తమ ఇంటి సభ్యుల మధ్య భావోద్వేగాలు ఉప్పొంగాయి. తాను ప్రెగ్నెంట్ అని మోనిత బాంబు పేల్చిన తర్వాత కార్తీక్ ఇంటి నుంచి దీప బయటకు వచ్చి తన పాత ఇంటికి చేరుకొన్నది. ఆ క్రమంలో దీపను వెతుక్కుంటూ కార్తీక్ వచ్చి ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో 1061 ఎపిసోడ్‌లో కార్తీక్, దీప మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉందంటే..

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu

నాగిని 'మౌని రాయ్' లేటెస్ట్ ఫోటో షూట్.. బ్యాక్ అందాలతో అభిమానులు ఫిదా

అంతా నిర్ణయించేది ఆ పైవాడే

అంతా నిర్ణయించేది ఆ పైవాడే

ఇంటిని శుభ్రం చేస్తున్న ఆటో డ్రైవర్ వారణాసిని కార్తీక్ వారించాడు. ఇంటిని క్లీన్ చేయవద్దు. దీప నాతో ఇంటికి వస్తుంది అంటూ కార్తీక్ అనడంతో.. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ఆ పైవాడు అంటూ దీప గట్టిగా సమాధానం ఇచ్చి.. వారణాసి.. నీ పని నువ్వు చేసుకో అనే విధంగా మాట్లాడింది.

 నా మనసులో ఏముంది దీప..

నా మనసులో ఏముంది దీప..

కోపంగా ఉన్న దీపతో కార్తీక్ మాట్లాడుతూ.. నేను కూడా అదే అనుకొంటున్నాను దీప.. ఆ పై వాడు నాకు ఇలా ఎందుకు చేశాడో అర్ధం కావడం లేదు. అదే విషయాన్ని నేను చెప్పాలని ఇక్కడి వచ్చాను. అసలు నీ మనసులో ఏముంది దీప. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. దీప నాకు అసలు తెలియదు. అసలు తప్పు జరుగుతుందని అనుకోలేదు అంటూ కార్తీక్ అన్నాడు.

దీప తనదైన శైలిలో స్పందిస్తూ...

దీప తనదైన శైలిలో స్పందిస్తూ...

అయితే కార్తీక్ మాటలను పట్టించుకోకుండా దీప తనదైన శైలిలో... కిటికి తలపులు తెరిచి ఉంచడంతో పావురాలు ఇళ్లంతా పాడు చేశాయి. నేను కడుగుతానని అంటే కూడా వాడే ఇంటిని శుభ్రం చేస్తున్నాయి. మొన్న ఎలుకలు దిండు చాపను కూడా కొరికేశాయి. భోజనం చేశారా? మీ వాలకం చూస్తే భోజనం చేసినట్టు లేదు. కాస్త ఆగండి భోజనం చేసి పెడుతాను అంటూ అతడి మాటలను అవాయిడ్ చేసింది.

 మోనిత ఇంట్లో ఆ రోజు అంటూ

మోనిత ఇంట్లో ఆ రోజు అంటూ

దీప ముందు నిలబడే మాట్లాడుతున్న కార్తీక్‌ను చూసి కూర్చీ వేయమంటారా? అని అడిగింది. అయితే కార్తీక్ తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించాడు.. నీకు అన్యాయం చేస్తానాని, చేయగలనని కలలో అనుకోలేదు అని అంటే.. కూర ఏం చేయమంటారు? పప్పుచారు చేసి అప్పడాలు వేయమంటారా? రెడీమేడ్ దోశ పిండి తీసుకొచ్చి దోశలు వేయమంటారా అంటూ కార్తీక్ మాటలను పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగా దీప మాట్లాడింది. కార్తీక్ తన బాధను చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తూ.. అసలు ఆ రోజు మోనిత ఇంట్లో అంటూ చెప్పబోగా.. దీప మధ్యలో ఆ మాటలను తుంచేస్తూ.. దోశలోకి కొబ్బరి చెట్నీ చేయమంటారా అంటూ తన మాటలను వినిపించుకోవడం ఇష్టం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది.

 నన్ను క్షమిస్తామనే విషయం..

నన్ను క్షమిస్తామనే విషయం..

నాపై నాకే అసహ్యం వేస్తున్నది అని కార్తీక్ అంటే ఆ మాటలను మధ్యలోనే తుంచి వేసింది. దాంతో నా మాటలను వినిపించుకోవడం ఇష్టం లేదని తెలుస్తుంది. నా మాటలను అర్థం చేసుకోవడం, నన్ను క్షమించే ప్రసక్తి లేదని క్లియర్‌గా తెలుస్తున్నది. కాబట్టి నేను వస్తాను అంటూ దీప ఇంటి నుంచి బయలుదేరాడు. అలా బయలు దేరిన కార్తీక్‌ను చూసి.. ఆ ఇంట్లోనైనా, ఈ ఇంట్లోనైనా.. మరెక్కడైనా (మోనిత) భోజనం చేయడం మానకండి అంటూ దీప సలహా ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X