twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ఆ ఇద్దరికి పెళ్లి సెట్ చేసిన సౌందర్య.. పోలీసుల అదుపులో జ్వాలా.. ఏం జరిగిందంటే?

    |

    సౌందర్య కూతురు స్వప్న, సత్యం దంపతులు వీడిపోవడంతో వారిని కలిపే ప్రయత్నాలను కొడుకులు ప్రేమ్, నిరుపమ్, ఇతర కుటుంబ సభ్యులు చేస్తున్నారు. స్వప్న, సత్యం మ్యారేజ్ డే కోసం ఏర్పాట్లు చేశారు. అయితే ఒకేసారి కారు దిగిన వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. స్వప్నను చూసి హ్యాపీ మ్యారేజ్ డే అంటూ విషెస్ తెలియజేస్తే..కోపంగా చూసింది. జీవితంలో కలిసి నడువలేకపోయినా, స్టేజ్ వరకైనా కలిసి నడుద్దామని సత్యం అంటే.. అంత ఆశపడకు అంటూ లోపలికి వెళ్లిపోయింది. ఆమె వెనుకే లోపలికి ప్రవేశించిన సత్యం అందరూ వెల్‌కమ్ చెప్పారు.

    కూతురు స్వప్నను చూసి హ్యాపీ మ్యారేజ్ స్వప్న. నీవు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని సౌందర్య అంటే.. నేను రాలేదు. రప్పించేలా చేశారు. కానీ నేను వచ్చానంటే మనసు మార్చుకొన్నట్టు కాదు.. నన్ను తక్కువ అంచనా వేయకు మమ్మీ అంటూ స్వప్న మనసులో అనుకొన్నది. ఇంట్లోకి వచ్చిన తల్లిదండ్రులను చూసి నిరుపమ్, ప్రేమ్ హ్యాపీగా ఫీలయ్యారు. హ్యాపీ మ్యారేజ్ డే అంటూ ప్రేమ్, నిరుపమ్ చెప్పారు. హిమ కూడా హ్యాపీ మ్యారేజ్ డే అంటూ విషెస్ చెప్పడంతో ఆమెను కోపంగా స్వప్న చూసింది. కార్తీకదీపం సీరియల్ 1348 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    నీకు కట్ చేయడం బాగా తెలుసు

    నీకు కట్ చేయడం బాగా తెలుసు

    జ్వాలా వస్తే నా గురించి తెలిసిపోతుంది. నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతే బాగుండు అనుకొంటూ బయటకు వెళ్లిపోతుంటే.. ఏంటి? మమ్మీకి బయపడుతున్నావా? అని ప్రేమ్ అడిగాడు. దాంతో లేదు అంటూ సమాధానం చెప్పింది. ఫంక్షన్‌లో కేక్ కట్ చేయించడానికి సిద్ధమయ్యారు. స్వప్న, సత్యం కేక్ ముందు నిలచుకొని దానిని కట్ చేశారు.

    బంధాలను కలుపాలి కానీ.. కేక్‌ను కట్ చేసినట్టు చేయడం అర్ధం కాదు అని సత్యం అంటే.. నీకు కట్ చేయడం చేతకాకపోతే.. నాకు చెప్పండి అని స్వప్న అంటే.. నీకు కట్ చేయడం బాగా తెలుసు అంటూ ఆమె చేతిని బలవంతంగా లాగేసుకొని కేక్ కట్ చేశారు. వారిద్దరూ కేక్ కట్ చేస్తుంటే.. వీళ్లిద్దరూ కలిస్తే ఎంత బాగుంటుందో అనుకొంటూ మ్యారేజ్ డేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొన్నారు.

    మనవరాలు, మనవడి నిశ్చితార్థం

    మనవరాలు, మనవడి నిశ్చితార్థం

    నాకు కూతురు స్వప్న, అల్లుడు సత్యంకు 25వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. వీరిద్దరికి నేను ఏమీ గిఫ్ట్ తేలేదు. కానీ వారిద్దరికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకొంటున్నాను. ఈ రోజున నేను నా మనవరాలికి, నా మనవడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకొన్నాను అని సౌందర్య అనగానే.. మమ్మీ ఏంటిది? అంటూ స్వప్న అరిచింది. దాంతో ఇది నీకు మ్యారేజ్ డే గిఫ్ట్ అంటూ సౌందర్య సమాధానం ఇచ్చింది.

    నాతో ఒక మాట చెప్పకుండా అంటూ స్వప్న అనబోతుండగా.. ఇలాంటి వాటినే సర్‌ప్రైజ్ అంటారు అని సౌందర్య అంది. ఆ తర్వాత హిమను పిలిచి.. నా మనవరాలిని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొంటున్నాను. అందుకోసం నిశ్చితార్థం కూడా చేయబోతున్నాను. ఆ మనవడు ఎవరంటే.. నా మనవరాలిని పెళ్లి చేసుకోబోయే మనవడిని ఆహ్వానిస్తున్నాను.. డాక్టర్ హిమను పెళ్లి చేసుకోబోయే మనవడు డాక్టర్ నిరుపమ్‌ను ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పగానే ప్రేమ్, హిమ షాక్ తిన్నారు. నా మనవరాలు, మనవడి నిశ్చితార్థానికి అందరూ రావాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను అని సౌందర్య చెప్పింది. అయితే అమ్మమ్మ తీసుకొన్న నిర్ణయంతో ప్రేమ్ షాక్‌లో ఉండిపోయాడు.

    నీ సంసారం నాశనం చేసుకొన్నప్పుడే

    నీ సంసారం నాశనం చేసుకొన్నప్పుడే

    అతిథులందరూ వెళ్లిపోయిన తర్వాత ఏమనుకొంటున్నావు? అని స్వప్న ప్రశ్నిస్తే.. అందరి ముందు నా మనసులో ఉన్నది చెప్పేశానుగా అంటూ సౌందర్య సమాధానం ఇచ్చింది. నా నోరు మూయించావని నీవు అనుకొంటున్నావా? నీకు నీవు సంతోష పడుతున్నావా అని స్వప్న ప్రశ్నిస్తే.. నా మనవడి, మనవరాలి పెళ్లి కంటే ఇంకా ఏం సంతోషం ఉంటుంది అని సౌందర్య బదులిచ్చింది.

    తెలివితేటలు నీ ఒక్కదానికే కాదు అని స్వప్న అంటే.. నీ సంసారాన్ని నాశనం చేసుకొన్నప్పుడే నీ తెలివితేటలు అర్ధమయ్యాయి అని సౌందర్య కౌంటర్ ఇచ్చింది. దాంతో ఇక నేను ఏం చేయాలో నేను చూసి చూపిస్తాను అని స్వప్న సవాల్ విసిరింది. నిన్ను కన్నదాన్ని.. నాకు ఎన్ని తెలివితేటలు ఉంటాయో ఊహించుకో. ఒక్కమాటతో నేను నిరుపమ్, హిమను ఒప్పించాను అని సౌందర్య అంటే.. ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకు తెలుసు. ఈ ఎంగేజ్‌మెంట్ జరగదు అని స్వప్న అంటే.. ఈ ఎంగేజ్‌మెంట్‌ను ఈ ప్రపంచంలో ఎవరూ ఆపలేరు అని సౌందర్య ప్రతి సవాల్ విసిరింది.

    జ్వాలా కారును అడ్డుకొన్న పోలీసులు

    జ్వాలా కారును అడ్డుకొన్న పోలీసులు

    తన బాబాయ్ ఫ్రెండ్ కారులో జ్వాలా మ్యారేజ్ డేకు బయలు దేరింది. మీరు మా బాబాయి ఫ్రెండా? అంటే అవును అని డ్రైవర్ సమాధానం చెప్పాడు. అయితే ఎప్పుడు కనిపించలేదు అని జ్వాలా అడిగితే.. అవసరం ఉంటే తప్ప కలుసుకోమని మాట్లాడుకొంటుండగా.. మార్గమధ్యంలో పోలీసులు వాహనాన్ని తనిఖీల చేశారు.

    అయితే పోలీసుల తనిఖీ సాధారణమే అంటూ డ్రైవర్ సమాధానం చెబుతుండగా జ్వాలా కారు దిగి.. సార్ మేము ఫంక్షన్‌కు వెళ్తున్నాం. ఇప్పటికే లేట్ అయింది అని అనడంతో.. ఫంక్షన్‌కు వెళ్తున్నారా? అంటూ సెటైర్ వేశాడు. సార్ కారు నాదే సార్.. కష్టపడి సంపాదించుకొన్నాను అని డ్రైవర్ అంటే.. అయితే కారు డిక్కీ ఓపెన్ చేయమని పోలీసులు అనడంతో ఏముంటాయ్ సార్.. అందులో స్టెపినీ తప్పా అంటూ సమాధానం చెప్పారు. డిక్కి ఒపెన్ చేయడంతో అందులో డబ్బు ఒక బ్యాగ్ కనిపించింది. దాంతో జ్వాలా షాక్ అయింది. జ్వాలాను పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్లండి ఫంక్షన్‌కు అని పోలీసులు వేళాకోలం చేశాడు.

    నన్ను వదిలేయండి అంటూ జ్వాలా

    నన్ను వదిలేయండి అంటూ జ్వాలా

    జ్వాలాను స్టేషన్‌కు రమ్మని పోలీసులు చెప్పడంతో నేను ఫంక్షన్‌కు వెళ్లాలి. నన్ను వదలేయండి.. నాకు దీనితో ఏం సంబంధం లేదు అని జ్వాలా అంటే.. పోలీస్ స్టేషన్‌కు రండి.. మీ తప్పు లేదని తేలితే వదిలివేస్తాం అని పోలీసులు సమాధానం చెప్పారు. అలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన జ్వాలా ఫంక్షన్‌కు బయలుదేరింది. ఆటోలో కూర్చొని.. అతడు నా బాబాయ్ ఫ్రెండ్ అన్నప్పుడే ఆలోచించాలి. ఎంత పని జరిగింది? నా తప్పు లేదని నిరూపించుకొని రావడానికి ఇంత సమయం పట్టింది అంటూ జ్వాలా ఆవేదన చెందింది.

    నిరుపమ్, హిమ, జ్వాలా ట్రయాంగిల్ లవ్

    నిరుపమ్, హిమ, జ్వాలా ట్రయాంగిల్ లవ్

    తాజా ప్రోమోలో మరో ట్విస్టు ఇచ్చాడు. హిమ, నిరుపమ్, జ్వాలా మధ్య ముక్కోణపు ప్రేమ కథకు లీడ్ ఇచ్చారు. తాజా ప్రోమోలో తన అమ్మమ్మ హిమతో పెళ్లి కుదర్చడంతో నిరుపమ్, హిమ హ్యాపీగా ఫీలయ్యాడు. నా మనసులో ఉన్న మాటను చెప్పడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? అని హిమతో నిరుపమ్ అన్నాడు.

    నీకు ఐ లవ్ యూ చెప్పడానికి చాలా ప్రయత్నించాను అని నిరుపమ్ అన్నాడు. దాంతో నా మనసులో ఉన్న మాటలు కూడా అవే అని హిమ చెప్పింది. ఇదిలా ఉండగా.. నిరుపమ్ గిఫ్టుగా ఇచ్చిన కొత్త ఫోన్‌లో నిరుపమ్ ఫోటో చూసి.. మనల్ని ఎవరూ విడదీయలేరు అని జ్వాలా అనుకోవడం ప్రోమోలో కనిపించింది.

    కార్తీకదీపం 17వ రేటింగ్ ఇలా..

    కార్తీకదీపం 17వ రేటింగ్ ఇలా..

    బుల్లితెరపైన టాప్ రేంజ్‌లో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఇటీవల కాలంలో రేటింగ్‌ను దిగజార్చుకొన్నది. 16వ వారంలో కార్తీకదీపం రేటింగ్ 11.51 రేటింగ్ నమోదు కాగా, 17వ వారంలో 11.42 రేటింగ్‌ను నమోదు చేసింది. అంతేకాకుండా ఈ సీరియల్‌లో పెద్దగా ట్విస్టులు లేకుండా రొటీన్‌గా సాగడం కూడా రేటింగ్ పడిపోవడానికి కారణమని చెప్పుకొంటున్నారు. అయితే రేటింగ్ పడిపోయినా.. తెలుగు సీరియల్స్‌లో కార్తీకదీపం సీరియల్ టాప్‌గా ఉండటం గమనార్హం.

    English summary
    Bigg Twist in Karthika Deepam today's episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X