Karthika Deepam 2 May 13th: జోత్స్న సుమిత్ర కూతురు కాదన్న పారిజాతం.. రౌడీ కి దూరంగా ఉండనంటున్న కార్తీక్!

బయటికి వెళ్లిన తల్లి గురించి భయపడుతూ ఉంటుంది శౌర్య. కార్తీక్, దీప మాట్లాడుకోవడం చూసి భరించలేక ఒక్కర్తె ఇంటికి వచ్చేస్తుంది జ్యోత్స్న. పారిజాతం దీప మీద దొంగతనం అంటగడితే శౌర్య నిజం చెప్పి ఆ నిందని చెరిపేస్తుంది. నర్సింహ సుమిత్ర ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే13 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 43వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నర్సింహ నీకు ముందే తెలుసా అని కార్తీక్ ని అడుగుతుంది సుమిత్ర. తెలుసు కానీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు అని మాత్రం రాత్రే తెలిసింది అంటాడు కార్తీక్. ఈ ఇంట్లో నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి అనుకుంటుంది పారిజాతం. నర్సింహ ఇంటికి వచ్చి ఇంత హడావిడి చేస్తాడు అనుకోలేదు అంటుంది సుమిత్ర. నువ్వు ఏమి అనుకోవు కానీ అన్ని జరిగిపోతూ ఉంటాయి అసలు ఆ దీప ఈ ఇంట్లో అడుగుపెట్టిన అప్పటినుంచి మన ఇంటికి శని పట్టుకుంది.

Karthika Deepam May 13th 2024 Episode Number 43 Here is full story

ఏరోజైనా మన ఇంట్లో ఇలాంటి గొడవలు జరిగాయా,ఎవరో బయటవాళ్ల కోసం ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. మన స్టేటస్ ఏమిటి మన ఇంటి ముందుకు వచ్చి వాడు అలా మాట్లాడటం ఏమిటి అంటూ కోడల్ని మందలిస్తుంది పారిజాతం. పారిజాతాన్ని మందలిస్తాడు శివ నారాయణ. గ్రానీని ఎందుకు తప్పు పడుతున్నారు తాతయ్య, అసలు ఇదంతా ఆ దీప వల్లే, అయినా మీరు ఆ దీప ని ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావటం లేదు.

అసలు వాడెవడు బావ గురించి అలా మాట్లాడటానికి బావని ఏమైనా అంటే నేను అత్తతోనే గొడవ పడతాను అలాంటిది వాడెవడో బావని అనటం ఏమిటి, అలాంటి మాటలు అనిపించుకునే పరిస్థితిలో బావ ఉండటం ఏమిటి ఆ దీప ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నేను చాలా పోగొట్టుకున్నాను ఇప్పుడు నా బావని పోగొట్టుకోవటానికి సిద్ధంగా లేను అంటుంది. దీప ఇంట్లో సమస్యలు ఉన్నాయి కానీ మన సమస్యలకి దీపని కారణం చేయొద్దు. తను ఏమైనా నిన్ను తాగి కార్ డ్రైవింగ్ చేయమని చెప్పిందా అని మనవరాల్ని మందలిస్తాడు శివ నారాయణ.

Karthika Deepam May 13th 2024 Episode Number 43 Here is full story

నువ్వు ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకోకు అని కూతుర్ని బుజ్జగిస్తుంది సుమిత్ర. అయినా నువ్వేంటి మమ్మీ, తను నీ కూతురు అని తనని వెనకేసుకొస్తున్నావు తను నీ కూతురు అయితే మరి నేనేంటి అని తల్లిని నిలదీస్తుంది జోత్స్న. ఇక్కడ దీపకి అన్యాయం జరిగింది అందుకే అలా మాట్లాడాను అంటుంది సుమిత్ర. కానీ ఇప్పుడు ఈ విషయంలో నాకు అన్యాయం జరిగింది అని బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఈ విషయంలో సుమిత్ర ని మందలిస్తుంది పారిజాతం. ఆమె మీకు మనవరాలు అయితే నాకు కూతురు నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నారా అంటుంది సుమిత్ర.

ఆమె నీ కూతురు కాదు అంటుంది పారిజాతం. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.అప్పుడు పారిజాతం తమాయించుకొని తను నీ కూతురైతే తనని బాధపెట్టేలాగా ప్రవర్తించవు అంటుంది. నా కోడలి మీద నా మనవరాలు మీద నీ పెత్తనం ఏంటి అని శివ నారాయణ పారిజాతాన్ని మందలిస్తాడు. ఎప్పుడూ నా నోరు మూయించాలని చూస్తారు, ఆ దీప వల్ల మనవరాలి పరువు ఎప్పుడో పోయింది.

Karthika Deepam May 13th 2024 Episode Number 43 Here is full story

ఇప్పుడు ఆ నర్సింహ మాటలకి మనవడి పరువు పోయేలాగా ఉంది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. కార్తీక్ సుమిత్ర దగ్గరికి వచ్చి చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పావు అత్త, ఏదైనా తప్పు చేస్తే నా దగ్గరకు వచ్చి సారీ చెప్పి ఏం జరిగిందో చెప్పు నేను అర్థం చేసుకుంటాను అన్నావు కానీ నీకు సారీ చెప్పే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు అనుకున్నాను ఇప్పుడు కూడా నీకు సారీ చెప్పడం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అదే సమయంలో దీప బయట బాధపడుతూ కూర్చుంటుంది. ఆమె దగ్గరికి వచ్చి ఆమెని ఓదార్చాలి అనుకుంటాడు కార్తీక్. కానీ దీప తన గురించి పట్టించుకోవద్దని తన సంగతి తన కూతురు సంగతి తాను చూసుకుంటానని చెప్తుంది, అసలు మీరు నర్సింహ ని కొట్టకపోయి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అంటుంది. నేను కొట్టిన కొట్టకపోయినా మీ పరిస్థితుల్లో పెద్దగా తేడా ఉండేది కాదు.

Karthika Deepam May 13th 2024 Episode Number 43 Here is full story

నేను చేసిన పనికి నీకు క్షమాపణ చెప్తే సరిపోతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు మీ బాధ్యత తీసుకోవాలి అనుకుంటున్నాను ఇకమీదట మీ దగ్గరికి ఎవరైనా రావాలి అంటే నన్ను దాటి రావాలి, అలాగే ఎప్పటికీ నేను రౌడీ కి దూరం కాను మీకు ఇష్టం లేకపోయినా కూడా నేను మీ శ్రేయోభిలాషిని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. ఈ మనిషి ఎప్పటికీ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోలేడా అనుకుంటుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X