Karthika Deepam 2 May 14th: కార్తీక్ ని తప్పు పడుతున్న తల్లిదండ్రులు.. జ్యోత్స్న ని రెచ్చగొడుతున్న పారిజాతం!

కార్తీక్, దీప మాట్లాడుకోవడం చూసి భరించలేక ఒక్కర్తె ఇంటికి వచ్చేస్తుంది జ్యోత్స్న. పారిజాతం దీప మీద దొంగతనం అంటగడితే శౌర్య నిజం చెప్పి ఆ నిందని చెరిపేస్తుంది. నర్సింహ సుమిత్ర ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తాడు. ఆ తర్వాత సుమిత్ర ఇంట్లో కూడా గొడవ జరుగుతుంది. నాకు అన్యాయం జరిగిందంటూ ఏడుస్తుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే14 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 44వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

సుమిత్ర ఇంట్లో జరిగిన అవమానాన్ని తలుచుకొని పట్టపగలే మందు తాగుతూ ఉంటాడు నర్సింహ.నేను ముందే చెప్పాను దాని జోలికి వెళ్ళొద్దని అయినా వినలేదు అంటుంది అనసూయ. తన్నడానికి వెళ్లి తన్నించుకోవటం ఆయనకి అలవాటే అంటుంది శోభ. అసలు వాడిని నువ్వే రెచ్చగొట్టి పంపించావు, దాని బ్రతుకేదో అది బ్రతుకుతుంది కదా వదిలేయ్ అంటుంది అనసూయ. ఇంత జరిగాక కూడా దీపని వదిలేస్తే నాకన్నా చేతకాని వాడు ఉండడు అంటాడు నర్సింహా. అలాగని దాన్ని జోలికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్లు నీ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు, అవన్నీ నేను చూడలేను.

Karthika Deepam May 14th

కోడలు పిల్ల నువ్వేనా చెప్పు అంటుంది అనసూయ. బాగా తాగుతున్నాడు కదా, తాగింది దిగాక చెప్తాను అని కోపంగా మొగుణ్ణి చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శోభ. మరోవైపు దీప ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడే కాంచన అక్కడికి వస్తుంది. భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. నన్ను చెప్పమంటావా అంటాడు శ్రీధర్. పారు ఫోన్ చేసిందా అంటాడు కార్తీక్. లేదు జ్యోత్స్న ఫోన్ చేసింది చాలా బాధపడుతుంది.

నీకు మొన్నే చెప్పాను అనవసరమైన విషయాల్లో కలుగ చేసుకోవద్దని, అయినా వినటం లేదు అని కొడుకుని కోప్పడతాడు శ్రీధర్. మొదటిసారి నా కోడలు ఏడుపు ఫోన్లో విన్నాను, అమెరికాలో ఉన్నప్పుడే నీకోసం ఎదురు చూస్తూ తను హాయిగా ఉండేది కానీ నువ్వు వచ్చిన తర్వాత చాలా బాధపడుతుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని కొడుకుకి నచ్చ చెప్తుంది కాంచన. నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ కోడల్ని మాత్రం నెగ్లెట్ చేయకు, ఇక ఆలస్యం చెయ్యను, వెళ్లి బావగారితో పెళ్లి విషయం మాట్లాడుతాను అంటాడు శ్రీధర్.

Karthika Deepam May 14th 2024 Episode Number 44 Here is full story

ఇప్పుడు వద్దు నాన్న మీతో ఒక విషయం చెప్పాలి కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. వీడు లండన్ నుంచి వచ్చిన దగ్గరనుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నాడు అని బాధపడుతుంది కాంచన.మరోవైపు బాధపడుతున్న జ్యోత్స్న దగ్గరికి వచ్చిన పారిజాతం ఆమెని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది. ఆ దీప ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు అనుకున్నది జరగదు.

అందుకే ముందు ఆ దీప ని ఇంట్లోంచి పంపించేసి అప్పుడు కార్తీక్ తో పెళ్ళికి ముహూర్తాలు పెట్టించవచ్చు అంటుంది. నేను అనుకుంటే జరుగుతుందా అంటుంది జ్యోత్స్న. తప్పకుండా జరుగుతుంది ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ అమ్మే తీసుకుంటుంది. అందుకే మీ అమ్మకి నీ బాధని రెట్టింపుగా చేసి చూపించు, నేను ఎక్కువా ఆ దీప ఎక్కువ అన్న పరిస్థితికి తీసుకురా అప్పుడు తనే నీ గురించి ఆలోచిస్తుంది అంటుంది. పారిజాతం ఆ మాటలకి ఆలోచనలో పడుతుంది జోత్స్న.

Karthika Deepam May 14th 2024 Episode Number 44 Here is full story

మరోవైపు కూతుర్ని నిద్రపుచ్చుతూ నేను రేపటి నుంచి వంట పనికి వెళ్తున్నాను,నువ్వు ఇంట్లోనే ఆడుకో ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్తుంది దీప. జో, బామ్మ గారు నాతో మాట్లాడటం లేదు వాళ్లకి మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదా, అలా అయితే మనం కార్తీక్ ఇంటికి వెళ్లి పోదాం అంటుంది శౌర్య. నువ్వు అలా మాట్లాడకూడదు అని కోప్పడుతుంది దీప. ఎందుకు కార్తీక్ విషయం వచ్చేసరికి నువ్వు కోప్పడతావు, తను నువ్వు బాధపడేలా ఏమైనా చేశాడా అంటుంది శౌర్య.

మళ్లీ తనే కార్తీక్ చాలా మంచివాడు అమ్మ అంటుంది. శౌర్య కి నచ్చ చెప్పలేక కళ్ళు మూసుకొని పడుకో అంటుంది దీప. మరుసటి రోజు పొద్దున్నే హోటల్లో టిఫిన్స్ తో పాటు ఉప్మా ఫ్రీగా సర్వ్ చేస్తూ ఉంటుంది దీప. ఆమె ఉప్మాని అందరూ మెచ్చుకుంటారు అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. దీప ముఖం చిట్లించుకుంటుంది. కస్టమర్ గానే వచ్చాను అంటాడు కార్తీక్. అతనికి ఉప్మా పెడుతుంది దీప.

Karthika Deepam May 14th 2024 Episode Number 44 Here is full story

ఉప్మా చాలా బాగుంది, ఈ రెసిపీ ఏంటో చెప్తే మా రెస్టారెంట్ లో కూడా ట్రై చేస్తాము అంటాడు కార్తీక్. మీకు రెస్టారెంట్లు ఉన్నాయా అంటాడు బాబాయ్. అవును అంటాడు కార్తీక్.రెస్టారెంట్లు ఉన్న అతను ఈ హోటల్లో టిఫిన్ చేయడం ఏమిటో, అంత పెద్ద ఇంట్లో ఉన్న దీపమ్మ ఇక్కడ పనిచేయడం ఏమిటో అని కన్ఫ్యూజ్ అవుతాడు బాబాయ్. రేపు కూడా టిఫిన్ చేయడానికి ఇక్కడికి వస్తాను అని చెప్పి అక్కడినుంచి బయలుదేరుతాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X