Karthika Deepam May 15th Episode: అలా చేస్తే కార్తీక్‌తో పెళ్లి.. జ్యోత్స్నను ట్రాప్‌లో పడేసిన పారిజాతం!
పారిజాతం దీప మీద దొంగతనం అంటగడితే శౌర్య నిజం చెప్పి ఆ నిందని చెరిపేస్తుంది. నర్సింహ సుమిత్ర ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తాడు. ఆ తర్వాత సుమిత్ర ఇంట్లో కూడా గొడవ జరుగుతుంది. నాకు అన్యాయం జరిగిందంటూ ఏడుస్తుంది జ్యోత్స్న. దీప ఒక హోటల్లో పనికి కుదురుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే15 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 45వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
టిఫిన్ తినేసి డబ్బులు ఇవ్వాలనుకుంటాడు కార్తీక్. మీ డబ్బులే ఇంకా మా దగ్గర ఉన్నాయి అంటాడు బాబాయ్. దీప కూడా డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోదు. అక్కడినుంచి వెళ్ళిపోతూ రేపు కూడా టిఫిన్ కి ఇక్కడికే వస్తాను అంటాడు కార్తీక్. బయటికి వచ్చిన తర్వాత నీకు ఇష్టం లేకపోయినా నేను నీకు శ్రేయోభిలాషిని దీప, ఏదో ఒక విధంగా నీకు సాయం చేస్తాను అని అనుకుంటాడు. మరోవైపు కూతురి కోసం పాలు తీసుకొని వస్తుంది సుమిత్ర.

అప్పటికే ఆలోచనలో ఉన్న జ్యోత్స్న తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని దీప విషయం మాట్లాడుతుంది. ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది.కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో దీప నాకు ఇష్టమే కానీ కన్న కూతురు కాలేదు, నీ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు, దీపని ఇక్కడికి తీసుకువచ్చి తప్పు చేశానా అనుకుంటుంది జోత్స్న. మరోవైపు రోబిక్స్ క్యూబ్ సెట్ చేస్తూ ఉంటాడు దశరధ్. అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య ఏం చేస్తున్నావ్ తాత అని అడుగుతుంది.
క్యూబ్ సెట్ అవటం లేదు అని చెప్తాడు దశరథ్. నేను సెట్ చేయనా అంటుంది శౌర్య. నాకే సెట్ అవ్వటం లేదు నీకేం సెట్ అవుతుంది అంటాడు దశరథ్. ట్రై చేస్తాను అని చెప్పి తక్కువ టైంలోనే సెట్ చేస్తుంది శౌర్య. ఆమె తెలివితేటలు కి ఆశ్చర్యపోతాడు దశరథ్. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ కి ఆమె టాలెంట్ ని చూపిస్తాడు దశరథ్. కార్తీక్ శౌర్యని మెచ్చుకొని నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయా అంటాడు. శౌర్య తెలివితేటలకి తనని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అంటాడు దశరథ్.
మనకి దగ్గరలోనే మంచి స్కూల్ ఉంది అంటాడు కార్తీక్. అయితే వెళ్లి జాయిన్ చెయ్యు అంటాడు దశరథ్. అమ్మకు చెప్పకుండానా అంటుంది శౌర్య. అమ్మకి చెప్తే మీ సాయం నాకు అక్కర్లేదు నా బిడ్డని నేనే చదివించుకుంటాను అని మన సాయాన్ని అంగీకరించదు అంటూ దీప ని ఇమిటేట్ చేస్తాడు కార్తీక్. మరి ఎలా అంటాడు దశరథ్. అత్త చెప్పింది అని చెప్తే తను ఏమి అనలేదు, అందుకే అత్త పేరు చెప్పి దీన్ని స్కూల్లో జాయిన్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు కార్తీక్.
కారు దగ్గరికి వచ్చిన తర్వాత శౌర్య అమ్మకి చెప్పి వెళదాం అంటుంది. కార్తీక్ ఏదో మాట్లాడుతూ ఉండగానే శౌర్య దీప దగ్గర ఉంటుంది. దీపని అక్కడ చూసి షాక్ అవుతాడు కార్తీక్. శౌర్య ని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని అడుగుతుంది దీప. అత్త పాపని స్కూల్లో జాయిన్ చేయమని చెప్పింది అని అబద్ధం చెప్తాడు కార్తీక్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే పైనుంచి పారిజాతం, జ్యోత్స్న వాళ్ళని చూస్తూ ఉంటారు.
ఇంత జరిగాక కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఏమనాలి, వాడు దానికి సాయం చేస్తున్నట్లుగా లేదు బాధ్యత నెరవేరుస్తున్నట్లుగా ఉంది అంటూ మనవరాలిని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది పారిజాతం. కింద దీప నా కూతుర్ని నేను జాయిన్ చేసుకుంటాను మీ సాయం నాకు వద్దు అంటుంది. సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.దీప అంత ఫీజు కట్టుకోలేదు తనకి ఎలాగైనా సాయం చేయాలి అనుకుంటాడు. ఇది చూసిన జోత్స్న పిల్లని స్కూల్లో జాయిన్ చేసినట్లయితే ముగ్గురూ వెళ్లాలి కదా దీప మాత్రమే కూతుర్ని తీసుకొని వెళుతుంది అంటుంది.
అన్నీ మనకళ్ల ముందే చేస్తారేంటి, ముందు వాళ్ళిద్దర్నీ పంపించి తర్వాత వీడు ఫీజు కడతాడేమో కావాలంటే చూస్తూ ఉండు తను మన స్థాయి వాళ్ళు చదివే స్కూల్లోనే కూతుర్ని జాయిన్ చేస్తుంది, ఇప్పుడు పిల్లని చదివిస్తాను అంటాడు రేపు తల్లిని ఆదరిస్తాను అంటాడు ఆ తర్వాత నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి అంటుంది పారిజాతం. ఆ మాటలకి భయపడుతుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











