Karthika Deepam 2 May 16th: మరీ మొండిగా ప్రవర్తిస్తున్న శౌర్య..నర్సింహా కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్

నర్సింహ సుమిత్ర ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తాడు. ఆ తర్వాత సుమిత్ర ఇంట్లో కూడా గొడవ జరుగుతుంది. నాకు అన్యాయం జరిగిందంటూ ఏడుస్తుంది జ్యోత్స్న. దీప ఒక హోటల్లో పనికి కుదురుకుంటుంది. శౌర్యని కార్తీక్ చదివిస్తానంటే దీప అభ్యంతరం చెప్తుంది.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే16 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 46వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకు వెళుతుంది దీప. అక్కడ నర్సింహని చూసి షాక్ అవుతుంది. నా మీద పంతంతో అయినా శౌర్యకి తనే తండ్రి అని చెప్పేస్తాడు, అతనికి కనిపించకుండా వెళ్లాలి అనుకొని కామ్ గా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. స్కూల్ లోకి వెళ్లిన దీప ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ అని అటెండర్ ని అడుగుతుంది. అటెండర్ రూమ్ చూపిస్తాడు. దీప ని చూసిన ప్రిన్సిపల్ మాకు ఇప్పుడు ఆయాలు అవసరం లేదు నెంబర్ ఇచ్చి వెళ్లిపో అంటాడు. నేను ఉద్యోగం కోసం రాలేదండి.

Karthika Deepam May 16th Episode

మా పాపని స్కూల్లో జాయిన్ చేయడం కోసం వచ్చాను అంటుంది దీప. శౌర్య ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. ప్రిన్సిపల్ మీరు ఎంతవరకు చదువుకున్నారు అని దీపని అడుగుతాడు. నేను ఐదు వరకు చదువుకున్నాను అంటుంది. మా స్కూల్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి, పిల్లల పేరెంట్స్ కూడా బాగా చదువుకుని ఉండాలి లేకపోతే పిల్లల చేత హోంవర్క్ ఎలా చేయిస్తారు అంటూ అడ్మిషన్ ఇవ్వటానికి నిరాకరిస్తాడు ప్రిన్సిపల్.

అతనికి నచ్చచెప్పాలని చూస్తుంది కానీ ప్రిన్సిపల్ వినిపించుకోడు. చేసేదిలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు కార్తీక్, నర్సింహ ఇద్దరి కార్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. నా కార్ కి అడ్డగా వచ్చింది ఎవరు అని కారు దిగుతాడు నర్సింహ, కార్తీక్ కూడా కారు దిగడంతో నువ్వా అంటూ అతని కారు చెక్ చేస్తాడు నర్సింహ. ఏం వెతుకుతున్నావు అంటాడు కార్తీక్.నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతున్నాను అంటాడు నర్సింహ.

Karthika Deepam May 16th 2024 Episode Number 46 Here is full story

మాటలు మర్యాదగారానీ అసలు మా ఇంట్లో గొడవ జరిగినప్పుడే నీకు నాలుగు తగిలించాల్సింది కానీ దీప అడ్డువచ్చింది అందుకే ఊరుకున్నాను అంటాడు కార్తీక్. దీపకి కార్తీక్ కి సంబంధం అంటగట్టి అసహ్యంగా మాట్లాడుతాడు నర్సింహ. అతనిని కొట్టడానికి కాలర్ పట్టుకుంటాడు కార్తీక్. గొడవ పెట్టుకోవడానికి నేను కూడా రెడీ, అప్పుడు ఇక్కడ వాళ్ళందరూ వచ్చి గొడవ ఎందుకు అని మన గొడవని ఆపుతారు, అప్పుడు నేను జరిగింది చెప్తాను.

నీ పరువే పోతుంది నాకు ఎలాగూ పరువు లేదు అంటాడు నర్సింహ. నువ్వు దీపని బాధ పెట్టనంతవరకు ఏం చేసినా ఊరుకుంటాను కానీ దీప బాధపడే పని ఏం చేసినా ఊరుకోను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తీక్. నువ్వు ఇంత గట్టిగా వార్నింగ్ ఇస్తున్నావంటే మీ సంబంధం ఎంత గట్టిగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నా ప్రతాపం చూపిస్తాను అనుకుంటాడు నర్సింహ.

మరోవైపు స్కూల్ బయటకు వచ్చిన దీప తో ఈ స్కూల్లో జాయిన్ చేసేసావా, నాకు ఈ స్కూల్ బాగా నచ్చింది అని అంటుంది శౌర్య. నిన్ను స్కూల్లో జాయిన్ చేసుకోరంట అని జరిగిందంతా చెప్పి నిన్ను వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను అంటుంది దీప. నాకు ఈ స్కూల్ బాగా నచ్చింది, నేను ఈ స్కూల్లోనే చదువుతాను కార్తీక్ ని తీసుకువస్తే అతను బాగా చదువుకున్నాడు కదా, అతను మాట్లాడితే నన్ను స్కూల్లో జాయిన్ చేసుకుంటారు అంటుంది శౌర్య.

Karthika Deepam May 16th 2024 Episode Number 46 Here is full story

అతను ఎందుకు మన పనులు చేయాలి, నేను చెప్పింది విను నిన్ను వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను అంటుంది దీప. ఇదే స్కూల్లో చదువుతాను అని మొండికేస్తుంది శౌర్య. ఆమెని బ్రతిమాలి వేరే స్కూల్ కి తీసుకు వెళుతుంది దీప. ఆ తరువాత హోటల్ కి వచ్చి లేట్ అయిపోయింది బాబాయ్ అని జరిగిందంతా బాబాయ్ కి చెప్తుంది దీప. దీప భర్త గురించి అడుగుతాడు బాబాయ్. అతని విషయం కూడా దీప బాబాయ్ కి చెప్తుంది.

దీప పరిస్థితికి బాధపడతాడు బాబాయ్, దీపమ్మ చాలా మంచిది అనుకుంటాడు. మరోవైపు పారిజాతం మాటలు తలుచుకుంటూ పరధ్యానంలో ఉన్న జ్యోత్స్న గ్లాసు టీపాయ్ మీద పెట్టబోతే అది కింద పడిపోబోతుంది. దాన్ని ఒడుపుగా పట్టుకుంటాడు కార్తీక్. ఏం ఆలోచిస్తున్నావు ఎలెర్ట్గా ఉండాలి కదా అంటాడు. ఎలర్ట్ గా లేను కాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X