Karthika Deepam 2 May 17th: శ్రీధర్ జీవితంలో ఎవరికీ తెలియని చీకటి కోణం.. అసలు నిజం పారిజాతానికి చెప్పేసిన శౌర్
ఆ తర్వాత సుమిత్ర ఇంట్లో కూడా గొడవ జరుగుతుంది. నాకు అన్యాయం జరిగిందంటూ ఏడుస్తుంది జ్యోత్స్న. దీప ఒక హోటల్లో పనికి కుదురుకుంటుంది. శౌర్యని కార్తీక్ చదివిస్తానంటే దీప అభ్యంతరం చెప్తుంది. సౌర్యనే పెద్ద స్కూల్లో జాయిన్ చేయడానికి వెళుతుంది దీప. వాళ్ళు శౌర్య అడ్మిషన్ రిజెక్ట్ చేస్తారు.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే17 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 47వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
రాత్రి జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నట్లుగా ఉంది అనుకుంటుంది సుమిత్ర. అలర్ట్ గా ఉండి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అంటుంది జ్యోత్స్న. మనం బయటికి వెళ్దామా అని కార్తీక్ ని అడుగుతుంది. జ్యోత్స్న ఇప్పుడున్న పరిస్థితి నుంచి కార్తీక్ మాత్రమే బయటికి తీసుకు రాగలడు అని మనసులో అనుకొని అలా మీ బావని రిక్వెస్ట్ చేస్తావ్ ఏంటి కాబోయే పెళ్ళానివి ఎంత డిమాండ్ చేయాలి అంటుంది సుమిత్ర. మీరందరూ ఇలా ఎంకరేజ్ చేయబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది, పెళ్లి ఇష్టం లేదు అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని మనసులో అనుకొని కారు దగ్గర వెయిట్ చేస్తుంటాను వచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అమ్మ అని సుమిత్రతో అంటుంది జ్యోత్స్న. నీకు రాత్రే చెప్పాను ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దని, నువ్వు సంతోషంగా ఉండటం కంటే మాకు కావలసింది ఏమీ లేదు అంటుంది సుమిత్ర.

తల్లికి మరొకసారి థాంక్స్ చెప్పి బయటికి వచ్చేస్తుంది జ్యోత్స్న. కార్ లో వెళ్తున్న కార్తీక్, జ్యోత్స్నలకి ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్న శౌర్య కనిపిస్తుంది. కార్తీక్ కారు ఆపి శౌర్య దగ్గరికి వెళ్లి ఇక్కడున్నావేంటి స్కూల్లో జాయిన్ అవ్వలేదా అని అడుగుతాడు. అప్పుడు జరిగిందంతా చెప్తుంది శౌర్య. కార్తీక్ ప్రవర్తనకి కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఎందుకోసం వచ్చాడో కూడా మరిచిపోయి తనతో కబుర్లు లో పడ్డాడు అనుకుంటుంది.
శౌర్య అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కార్తీక్ కారు డ్రైవ్ చేస్తూ దీపపై కోప్పడతాడు, నేను జాయిన్ చేస్తానంటే వద్దు అని ఈ స్కూల్లో జాయిన్ చేసింది, శౌర్య కి ఈ స్కూలే నచ్చలేదంట ఇంకేం చదువుతుంది అంటాడు. ఆ మాటలకి మరింత కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. గ్రానీ అన్నట్టు కార్తీక్ ది జాలి లాగా కనిపించడం లేదు బాధ్యత లాగా కనిపిస్తుంది అనుకుంటుంది. కార్తీక్ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు. ఇంటికి వెళ్దాం అంటుంది జ్యోత్స్న.
సరే అని యూటర్న్ తీసుకుంటాడు కార్తీక్. మరోవైపు భర్త శ్రీరామచంద్రుడని వదినతో మాట్లాడుతూ ఉంటుంది కాంచన.అదే సమయంలో వేరే మహిళతో మాట్లాడుతున్న అది అలా అనుకోబట్టే మన వ్యవహారం ఇంకా బయటపడలేదు అంటాడు శ్రీధర్. అలా మాట్లాడుతూనే వేడిపాలు కాళ్ళ మీద పోసుకుంటాడు. అది చూసిన కాంచన కంగారు పడి భర్త దగ్గరికి వస్తుంది. శ్రీధర్ కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్లో ఆవిడ కూడా కంగారుపడి మళ్లీ ఫోన్ చేస్తుంది.

కాంచనని హల్లో కూర్చోబెట్టి మళ్లీ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శ్రీధర్. వంట మనిషిని పెట్టుకుంటే సరిపోయేది కదా ఎందుకు ఇలా చేతులు,కాళ్లు కాల్చుకోవటం అంటుంది సుమిత్ర. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్తీక్ వస్తాడు. వంట మనిషిని పెట్టమని కాంచన అంటుంది, కోడల్ని తీసుకురమ్మని శ్రీధర్ అంటాడు. ముహూర్తం పెట్టించేయమంటావా అంటుంది కాంచన.
పెట్టండి కానీ పెళ్లికి కాదు రెస్టారెంట్ ఓపెనింగ్ కి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. రెస్టారెంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత పెళ్ళే అన్నమాట అని ఆనంద పడిపోతారు కార్తీక్ పేరెంట్స్. మరోవైపు జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది. ఈ విషయం నేను దీపతో మాట్లాడతాను అంతకన్నా ముందు ఆ చిన్నదానితో మాట్లాడుతాను అంటుంది పారిజాతం. దానికి ఏం తెలుస్తుంది అంటుంది జ్యోత్స్న.

తనని మాటల్లో పెట్టి తెలియని విషయాలు తెలుసుకుంటాను అంటుంది పారిజాతం. అదే సమయంలో సైకిల్ గురించి తల్లితో పేచి పెడుతూ ఉంటుంది శౌర్య. అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం నీకు సైకిల్ అంటే అంత ఇష్టమా అంటుంది. అవును, నాకు ఊర్లో సైకిల్ ఉండేది, దానిని అమ్మ జాతరలో పోటీలో గెలుచుకుంది, దానిని కార్తికే ఇచ్చాడు అని చెప్తుంది శౌర్య.ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











