Karthika Deepam 2 May 18th: బంటు చెంప పగలగొట్టిన పారిజాతం.. శౌర్యని పెద్ద స్కూల్లో జాయిన్ చేసిన కార్తీక్!
దీప ఒక హోటల్లో పనికి కుదురుకుంటుంది. శౌర్యని కార్తీక్ చదివిస్తానంటే దీప అభ్యంతరం చెప్తుంది. శౌర్య ని పెద్ద స్కూల్లో జాయిన్ చేయడానికి వెళుతుంది దీప. వాళ్ళు శౌర్య అడ్మిషన్ రిజెక్ట్ చేస్తారు. పాపని వేరే స్కూల్లో జాయిన్ చేస్తుంది దీప. అది తెలిసిన కార్తీక్ దీప ని తిట్టుకుంటాడు.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే18 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 48వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కార్తీక్ సైకిల్ ఇచ్చాడని తెలుసుకున్న పారిజాతంషాక్ అవుతుంది. కార్తీక్ మీ ఇంటికి కూడా వచ్చాడా అని శౌర్య ని అడుగుతుంది. ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది దీప. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వెళ్లి ఇచ్చిన వాళ్ళని అడగండి అంటుంది. నువ్వు నిజాలు చెప్పొచ్చు కానీ నీ కూతురు నిజాలు చెప్తే తప్పా అంటుంది పారిజాతం అంత దాచుకోవాల్సిన నిజాలు మా దగ్గర లేవు, నా కూతురు ముందు మిమ్మల్ని మర్యాద చేస్తే బాగోదు.

మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరండి అంటుంది దీప. ఆ తర్వాత రోడ్డుమీద పారిజాతం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బంటు. అమ్మగారు ఊరు వెళ్ళమన్నారు వెళ్ళలేదు, వెళ్లాను అని అబద్ధం చెప్పవచ్చు అని అనుకుంటాడు. తర్వాత పారిజాతం అక్కడికి వస్తుంది వెళ్లిన పని ఏమైంది అని అడుగుతుంది. దీప వాళ్ల ఊరు వెళ్ళాను, వాళ్ళ అత్త అనసూయ.
అక్కడ వాళ్లకి ఒక ఇల్లు ఉంది అని చెప్తాడు బంటు. అతని చెంప పగలగొట్టి ఇవి అందరికీ తెలిసిన విషయాలే నువ్వు కొత్తగా తెలుసుకున్నది ఏమిటి అని అడుగుతుంది పారిజాతం.నీళ్లు నములుతాడు బంటు. ఇంతకుముందుకార్తీక్ దీప వాళ్ళ ఊరు వెళ్ళాడంట దీపకి సైకిల్ బహుమతిగా ఇచ్చాడంట అని చెప్తుంది పారిజాతం. నీకు ఎలా తెలుసు మీరు ఊరు వెళ్ళారా అంటాడు బంటు. అంటే నువ్వు వెళ్లలేదా అంటుంది పారిజాతం మళ్లీ నీళ్లు నములుతాడు బంటు.
అతని చెంప పగలగొట్టి నువ్వు మళ్ళీ దీప వాళ్ల ఊరు వెళ్లి ఇంకేమైనా విషయాలు తెలుస్తాయేమో కనుక్కొని రా అని పంపిస్తుంది. మరోవైపు దీపని తీసుకుని శౌర్య ని రిజెక్ట్ చేసిన స్కూల్ కి వెళ్తాడు కార్తీక్. అక్కడ ప్రిన్సిపల్ తో పేరెంట్స్ చదువుకుంటే నే సీటు ఇస్తాను అన్నారట అంటాడు. అవును మా స్కూల్ కి రూల్స్ ఉన్నాయి అంటాడు ప్రిన్సిపల్. అప్పుడు బయట నుంచి ఒక వ్యక్తిని తీసుకువస్తాడు కార్తీక్. ప్రిన్సిపల్ అతనిని చూసి నువ్వెందుకు వచ్చావు నాన్న అంటాడు.

నేనే తీసుకువచ్చాను, అతను ఏం చదువుకున్నారు అంటాడు కార్తీక్. తను ఆయన ఏమి చదువుకోలేదు అంటాడు ప్రిన్సిపల్. అప్పుడు ఈ స్కూల్ ప్రిన్సిపల్ గా ఉండే అర్హత మీకు లేదు అంటాడు కార్తీక్. మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది పాపకి నేను సీట్ ఇస్తాను అంటాడు ప్రిన్సిపల్. జాలిపడి ఇవ్వద్దు టెస్ట్ పెట్టి పాస్ అయితేనే సీట్ ఇవ్వండి అని చెప్తాడు కార్తీక్. ప్రిన్సిపల్ శ్రీవాణి అనే టీచర్ని పిలిచి శౌర్య కి టెస్ట్ పెట్టమని చెప్తాడు. శ్రీవాణి కార్తీక్ ని చూసి ఇతను జోత్స్న వాళ్ళ బావ కదా ఇక్కడికి వచ్చాడేంటి అనుకుంటుంది.
శౌర్య ని అక్కడ నుంచి తీసుకొని వెళ్లి తనకి టెస్ట్ పెట్టి ఈ సమయంలో జోత్స్న కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. కోపంతో రగిలిపోయిన జోత్స్న విషయం పారిజాతానికి చెప్తుంది. ఇద్దరూ కలిసి స్కూల్ కి బయలుదేరుతారు. మరోవైపు షాపు లెక్కలు జాగ్రత్తగా బాబాయ్ కి అప్పచెప్తుంది దీప. పాపని స్కూల్లో జాయిన్ చేసావా అని అడుగుతాడు బాబాయ్. చేశాను కానీ ఈరోజు స్కూల్ కి వెళ్ళనని పేచీ పెట్టింది. ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంట్లోనే ఉంచేసాను అంటుంది.
కాసేపు మాట్లాడిన తర్వాత కొంచెం డబ్బు అవసరం ఉంది ఒక 500 ఇస్తావా అని బాబాయ్ ని అడుగుతుంది దీప. 2000 చేతిలో పెట్టి లెక్కలు తర్వాత చూసుకుందాంలే అంటాడు బాబాయ్. కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు సంతోషం బాబాయ్ అంటుంది దీప.నీ వల్లే కదమ్మ ఈరోజు కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అంటాడు బాబాయ్. మరోవైపు పారిజాతం వాళ్లు స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి నర్సింహ కూడా ఎవరినో డ్రాప్ చేయడానికి అక్కడికి వస్తాడు.

ప్రిన్సిపల్ కార్తీక్ తో శౌర్య నిజంగా చాలా తెలివైనది ఎగ్జామ్ బాగా రాసింది అంటాడు. ఆమెకి కంగ్రాట్స్ చెప్పి ముద్దు పెట్టుకుంటాడు కార్తీక్. ఇదంతా బయట నుంచి చూస్తున్న జ్యోత్స్న కోపంతో రగలిపోతూ లోపలికి వెళ్దాం అంటుంది. అక్కడికి వెళ్ళినా మనం చూసేది ఇదే ఏం జరుగుతుందో ఇక్కడి నుంచే చూద్దాం అని ఆమెని ఆపుతుంది పారిజాతం. కార్తీక్ కూతురిని ముద్దు పెట్టుకోవడం చూసి కోపంతో రగిలిపోతాడు నర్సింహ ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళాలి అనుకుంటాడు.
అప్పుడే అక్కడికి అటెండర్ వచ్చి నువ్వు డ్రైవర్ వి నీకు లోపల ఏం పని అని అడుగుతాడు. అతని చేతిలో కొంత డబ్బు పెట్టి లోపల ఏం జరుగుతుందో నాకు చెప్పు అంటాడు నర్సింహ. వాళ్ళకి పాత పరిచయాలు ఉండటం వల్ల ఒప్పుకుంటాడు అటెండర్. కార్తీక్ ఫీజు కట్టి దీపకి యూనిఫామ్ బుక్స్ తీసుకొని బయటికి వస్తాడు. ఆనందంతో కార్తీక్ ని హగ్ చేసుకుంటుంది శౌర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











