For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam May 19th Episode: ఈ క్షణమే మీ ఒడిలో ప్రాణం పోతే.. గుండెల్ని పిండేస్తున్న దీప...!

  |

  తెలుగు బుల్లితెరపై గత కొన్ని నెలలుగా టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకోంటూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న కార్తీక దీపం సీరియల్‌లో ప్రతీ రోజు భారీగా ఎమోషనల్ కంటెంట్ జోప్పిస్తున్నారు. దీప అనారోగ్యం నేపథ్యంలో కార్తీక్, దీప మధ్య మరింత భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. మే 19వ తేదీన ప్రసారమయ్యే 1043 ఎపిసోడ్‌లో ఇద్దరి మధ్య బయటకు వచ్చిన భావోద్వేగాలు ఇవే...

  బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

   మనిషి పోతుంటే చూస్తూ ఉంటామా?

  మనిషి పోతుంటే చూస్తూ ఉంటామా?

  శ్రీరాంనగర్ బస్తీలోని ఇంటిలో ఉన్న కార్తీక్, దీప తమ అభిప్రాయాలను పంచుకొంటూ.. డాక్టర్లు, మెడిసిన్స్ ఇవన్నీ ఓ మనిషి పోతుంటే చూస్తూ ఉండటానికేనా అంటూ దీపతో కార్తీక్ బాబు అన్నారు. నా మీద ప్రేమ ఉన్నట్టయితే బాగుండేది కార్తీక్. మిమ్మల్ని పేరు పిలువాలని చిన్న కోరిక. పదేళ్ల క్రితం ఆ కోరిక పుట్టింది. ఈ క్షణమే తీరిపోయింది అంటూ దీప చెప్పింది.

   పది రోజుల్లో పోయే ప్రాణం..

  పది రోజుల్లో పోయే ప్రాణం..

  కార్తీక్ బాబు ఎమోషనల్‌గా వెళ్లపోవడానికి లేవగానే.. డాక్టర్ బాబు ఇంకా కాసేపు ఇక్కడే కూర్చోవచ్చు కదా అంటూ చేయిపట్టి అడిగింది. దాంతో వెళ్లిపోబోయే కార్తీక్ మళ్లీ దీప పక్కన బెడ్‌పై కూర్చొన్నారు. ఇంకో వారం, పది రోజుల్లో పోయే ప్రాణం.. ఇప్పుడే, ఈ క్షణమే మీ ఒడిలో ప్రాణం పోతే ఎంత బాగుంటుందనిపిస్తుంది అని దీప అనగానే.. ఆమెను ఓదార్చుతూ.. నీకు ఏం కాదని చెప్పాను. ముందు లేచి ఫ్రెష్ అయి రా అంటూ కార్తీక్ కాఫీ గ్లాస్ తీసుకొని వంటగదిలోకి వెళ్లాడు.

  నాపై కనీసం జాలీ కూడా లేదా

  నాపై కనీసం జాలీ కూడా లేదా

  కార్తీక్ వ్యవహారంపై దీప స్పందిస్తూ.. ఇంత సేపు నా పక్కనే కూర్చొని నా చేయి కూడా తాకలేదంటే.. ఇది నా మీద చాలీ తప్ప ప్రేమ కాదు అంటూ దీప ఆవేదనకు గురైంది. ఫ్రెష్ కావడానికి రెడీ అవుతూ.. చనిపోతానని తెలిసి కూడా జాలీ లేదా? ఇప్పటికి నాపై అనుమానమేనా? అంటూ దీప పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది.

  నాతో అంటీ ముట్టనట్టు ఉంటారు..

  నాతో అంటీ ముట్టనట్టు ఉంటారు..

  భర్త కార్తీక్ గురించి ఆలోచిస్తూ.. నా కోసం అన్ని చేస్తారు.. సమయానికి మందులు ఇస్తారు? టైమ్‌కు తినమంటారు. ఆరోగ్యం చూసుకోమని జాగ్రత్తలు చెబుతారు. ఏమీ ఆలోచించవద్దు అంటారు. కానీ నాతో ఏమీ అంటీ ముట్టనట్టే ఉంటారు అంటూ దీప ఆలోచనల పడ్డారు.

  Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
  స్త్రీ నిప్పులాంటిదని.. వాళ్లకు తెలిస్తే చాలదు..

  స్త్రీ నిప్పులాంటిదని.. వాళ్లకు తెలిస్తే చాలదు..


  భర్త కార్తీక్ తనపై ప్రేమ చూపించకపోవడంపై ఆలోచిస్తూ.. నేను ఈ లోకం నుంచి పోయాకే మారుతారేమో.. అప్పటికీ నిజాన్ని నిరూపించి ... పోయిన దీప నిప్పు అని ఎవరైనా చెబితే తప్ప.. నా చితి చూసి కూడా చలించరేమో. స్త్రీ నిప్పులాంటిందని ఆ స్త్రీకి మాత్రమే తెలిస్తే చాలదు. ఆ నిప్పులాంటి నిజాన్ని భర్తకు తెలిసేలా లోకంతో మసలుకోవాలి. లేకపోతే భర్తలు కఠినంగా ఉంటారు. అందుకు నేనే ఉదాహరణ ఏమో అంటూ మనసులో తానకు తాను దీప ఆవేదనకు గురయ్యారు.

  English summary
  Karthika Deepam Serial May 18th Episode | Karthika Deepam Serial Today May 18th Episode | Karthika Deepam Episode 1043
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X