Karthika Deepam May 19 Episode: శాడిస్టుకు ఎక్కువ.. సైకోకు తక్కువ.. దీపపై కుట్రలకు డాక్టర్ మోనితకు షాక్

కార్తీక దీపం సీరియల్‌లో దీపను ఎలాగైనా చంపేసి.. తన ప్రియుడు కార్తీక్‌కు చేరువ కావాలనే డాక్టర్ మోనిత ప్రయత్నాలకు పనిమనిషి ప్రియమణి బ్రేక్ వేసేందుకు ప్రయత్నించింది. మోనిత పన్నాగాలకు చెక్ పెడుతూ సెటైర్లు వేసింది. మోనిత నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆమెకు బుద్ది చెప్పేందుకు ప్రయత్నించింది. 1043 ఎపిసోడ్‌లో మోనిత, ప్రియమణి మధ్య ఏం జరిగిందంటే..

లేడిస్‌తో కారు తుడిపించడంపై

లేడిస్‌తో కారు తుడిపించడంపై

పనిమనిషి ప్రియమణి కారు తుడుస్తుండగా.. ఫస్ట్ టైమ్ లేడీస్ కారు తుడవడం చూస్తున్నా అంటూ మోనిత కామెంట్ చేసింది. అయితే లేడీస్‌తో కారు తడిపించడం కూడా ఫస్ట్ టైమ్ చూస్తున్నా అంటూ ప్రియమణి కౌంటర్ ఇచ్చింది. నా దగ్గర పనిచేసే వాళ్లకు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది అని మోనిత అంటే.. ప్రపంచంలో లేని పనులన్నీ మీ ఇంట్లోనే చేయిస్తారుగా అంటూ ప్రియమణి సమాధానం ఇచ్చింది.

నాకు పనివాళ్లు దొరకరా?

నాకు పనివాళ్లు దొరకరా?

ప్రియమణి మాటలకు మోనిత కొపగించుకొంటూ నచ్చితే పనిచేయి.. నచ్చకపోతే మానేయ్ అని గట్టిగా మందలించింది. నాకేమైనా పనివాళ్లు దొరకరా? అంటే నాలాంటి పనివాళ్లు మీకు దొరకరమ్మా అని ప్రియమణి అంటే నా మాదిరిగా ఫస్ట్ రోజునే జీతం ఇచ్చేవాళ్లు ఉండరు అంటూ మోనిత కామెంట్ చేసింది. అది కూడా చూస్తా.. నాకు పెళ్లై వెళ్లిపోయిన తర్వాత చూస్తా అంటూ కామెంట్ చేసింది. అయితే పెళ్లైన తర్వాత ఎలా చూస్తావే అంటూ మోనిత గొడవ పడింది.

నీవు పెళ్లి చేసుకొంటావా?

నీవు పెళ్లి చేసుకొంటావా?

అయితే ప్రియమణి పెళ్లి చేసుకొంటానని చెప్పడంపై మోనిత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అవును.. నీవు పెళ్లి చేసుకొంటావా? ఇంతకు ముందు పెళ్లి చేసుకోను.. పెళ్లి చేసుకొని ఎవరు సుఖ: పడ్డారని దీర్ఘాలు తీసావుగా అంటూ మోనిత ప్రశ్నించింది. అప్పుడు అలా అనిపించింది.. ఇప్పుడు ఇలా అనిపిస్తే అన్నాను అంటూ ప్రియమణి పేర్కొన్నది. నీ జీవితంపై నీకు క్లారిటీ లేదా? నీకంటూ సొంత అభిప్రాయం లేదా? ఊసరవెల్లి మాదిరిగా పూటకో మాట మాట్లాడుతావా? ఒక్క మాట మీద నిలబడవే.. ఒక్క మనిషి ఒక్క రకంగా మారిపోవడం ఏమిటే అంటూ మోనిత ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.

నాలికా? తాటి మట్టా? అంటూ మోనిత

నాలికా? తాటి మట్టా? అంటూ మోనిత

అంతటితో పనిమనిషి ప్రియమణిపై మోనిత ఆవేశ పడుతూ.. ఇప్పుడు ఉన్న మాట ఇంకో రోజు లేకపోవడం ఏమిటి? అది నాలికా? తాటి మట్టా? అని మోనిత ఆవేశపడింది. దాంతో ఏంటమ్మా అంత ఆవేశపడిపోతున్నావు అంటూ గట్టిగానే ప్రియమణి మందలించింది. మనిషి అంటే ఒకటే మాట మీద ఉండాలి? ఇప్పుడు నేను చూడు. నా ప్రేమకు 16 ఏళ్లు. నేను ఒక్క కార్తీక్ నమ్మకొని ఉన్నాను. పరాయి మొగాడిని తొంగి చూడకుండా జాగ్రత్త పడ్డాను అని మోనిత తన గురించి చెప్పుకొన్నది. దాంతో తొంగి చూస్తే.. నీ శాడిస్టిక్‌కు ఎక్కువ? సైకోకు తక్కువ అని ప్రియమణి సెటైర్ వేసింది.

నేను చచ్చినా నీ పెళ్లి జరగదు...

నేను చచ్చినా నీ పెళ్లి జరగదు...


నా కార్తీక్‌తో పెళ్లి జరిగేంత వరకు నీవు పెళ్లి చేసుకొని నా వద్ద పనిచేయాల్సిందే అంటూ మోనిత హుకుం జారీ చేసింది. దాంతో ఏంటేంటి? నీ పెళ్లి అయ్యే వరకు నేను ఉండాలా? నీ పెళ్లి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదా? మీ పెళ్లి ఎప్పుడమ్మా? రేపా? ఎల్లుండా? వచ్చే నెలా? రాబోయే సంవత్సరమా? నేను పండు ముసలిదాన్ని అయి.. నా ఆయుష్పు అంతా తీరిపోయి.. నేను పుటుక్కున చచ్చే దాకా నీ పెళ్లి జరగదు అంటూ పనిమనిషి ప్రియమణి వెల్లడించింది. ఇది శాపం కాదమ్మా.. నిజం అంటూ సర్దిచెప్పింది.

ఒసేయ్.. ఎంత మాట అన్నావు...

ఒసేయ్.. ఎంత మాట అన్నావు...

ప్రియమణి మాటలకు మండిపడిన మోనిత ఒసేయ్.. అంత మాట అనేశావు. అని ఆవేశంతో ఊగిపోయింది. కార్తీక్ బాబు దీపను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దీప.. పాప అంటూ మందులు పట్టుకొని తీరుగుతుంటే.. నీ 16 ఏళ్ల ప్రేమకు 116 ఏళ్లు వచ్చినా నీ పెళ్లి మాత్రం జరగదు అంటూ ప్రియమణి గట్టిగా అనేసింది. దాంతో దీపను ఆ కొంపలో నుంచి పంపిచేస్తాను అంటూ మోనిత ఏదో అనబోయింది.

మీ కోపమే కొంప ముంచిందంటూ...

మీ కోపమే కొంప ముంచిందంటూ...

దాంతో మళ్లీ ప్రియమణి మోనిత మాటలకు అడ్డుపడుతూ.. ఈ కోపమే మీ కొంప ముంచేది అంటూ ప్రియమణి హెచ్చరించింది. ఈ సమయంలో కోపం మానేసి ప్రశాంతంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలి. శాంతంగా ఉండి నీ ప్రయత్నమేదో మీరు చేసుకోండి అని సూచించింది. అవును నేను ప్రశాంతంగా ఉండి.. నా ప్రయత్నం నేను చేసుకోవాలి అంటూ మోనిత తన కోపాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X