దీప జీవితం ఆరిపోవడం ఖాయం.. డాక్టర్ మోనిత ఆశలపై నీళ్లు చల్లిన ప్రియమణి!
కార్తీకదీపం సీరియల్‌లో ఎప్పటి మాదిరిగానే డాక్టర్ మోనిత, పనిమనిషి ప్రియమణి మధ్య గమ్మత్తైన సంభాషణ జరిగింది. మోనిత మాటలకు కౌంటర్లు ఇవ్వడం అలవాటైన ప్రియమణి తాజా ఎపిసోడ్‌లో కౌంటర్ల మీద... కౌంటర్లు ఇస్తూ మోనితను అసహానానికి గురిచేసింది. తాజా 1043 ఎపిసోడ్‌లో వారిద్దరి సంభాషణ ఎలా సాగిందంటే..

డాక్టర్ మోనితపై పనిమనిషి సెటైర్లు
ఉదయాన్నే రెడీ అయిపోయి సెల్ఫీలు దిగుతున్న మోనితను చూసి అప్పుడే స్నానం కూడా చేశారా? అంటూ పనిమనిషి ప్రియమణి ప్రశ్నించింది. స్నానం కూడా కాదు దేవుడికి దీపం కూడా పెట్టాను తెలుసా? అని మోనిత అంటే.. ఎందుకమ్మ దేవుళ్లను గందరగోళానికి గురిచేస్తావు. మోనితమ్మ ఏంటి దీపం వెలిగించడం ఏమిటి అంటూ ప్రియదర్శి కామెంట్ చేసింది.

అత్తారింటికి వెళ్లిన తర్వాత
పనిమనిషి ప్రియమణి ప్రశ్నలకు మోనిత సమాధానం ఇస్తూ.. రేపు పెళ్లి అయి అత్తారింటికి వెళ్తే బారెడు పొద్దెక్కిన తర్వాత లేవొద్దు కదా.. పెందలాడే నిద్రలేచి దేవుడికి దీపం వెలిగించాలి. కాఫీ కప్పుతో కార్తీక్‌ను నిద్రలేపాలి అంటూ మోనిత చిట్టా చదవడంతో.. నేను నిద్రలో కలలు కంటే.. నీవు మెలుకువలోనే కలలు కంటున్నారు అని ప్రియమణి తెలిపింది.

కలలు కావు.. కాబోయే నిజాలు
దాంతో ప్రియమణికి తన కోరికలు వివరిస్తూ.. ఇవి కలలు కావు.. కాబోయే నిజాలు. రాబోయో కాలంలో జరగబోయే నిత్య సత్యాలు అంటూ మోనిత సర్దిచెప్పుకొన్నది. సాయంత్రం కార్తీక్ వచ్చే సమయానికి తలారా స్నానం చేసి.. కురులు దువ్వుకొని.. పువ్వులు పెట్టుకొని..గడప వద్ద ఎదురు చూస్తుంటాను అని మోనిత చెప్పింది.

దీపమ్మ చనిపోవడం ఖాయం..
మోనిత ఆశలకు ఆశ్చర్యపోయిన ప్రియమణి.. మరీ దీపమ్మ ఎక్కడ ఉంటుందమ్మా అంటే.. దీపం ఆరిపోతుంది కదా.. అంటూ సమాధానం ఇచ్చింది. ఈ రోజు అంటే పొద్దున్నే లేచారు.. రోజు లేస్తారని నమ్మకం ఏమిటి? మీరు ఒక్కసారైనా మాట మీద నిలబడ్డారా? అంటూ ప్రియమణి ప్రశ్నించింది.

కార్తీక్‌ను ప్రేమించడం తప్ప..
అంతేకాకుండా మోనితతో సంభాషణను కొనసాగిస్తూ.. మీరు ఏదైనా మాట మీద నిలబడ్డారంటే.. కార్తీక్ అయ్యను ప్రేమించడంపైనే నిలబడ్డారు. అంతే.. అంటూ ప్రియమణి ఘాటుగా సమాధానం ఇచ్చింది. అయితే ఈ రోజు చెప్పిందంతా కొన్ని రోజుల్లో నిజం అవుతుంది అంటూ మోనిత ఉడికిపోయింది.


Click it and Unblock the Notifications











