Karthika Deepam 2 May 20th: పారిజాతానికి చివాట్లు పెట్టిన కాంచన.. దీప విషయంలో కార్తీక్ ఏం చేయబోతున్నాడు!
శౌర్య ని పెద్ద స్కూల్లో జాయిన్ చేయడానికి వెళుతుంది దీప. వాళ్ళు శౌర్య అడ్మిషన్ రిజెక్ట్ చేస్తారు. పాపని వేరే స్కూల్లో జాయిన్ చేస్తుంది దీప. అది తెలిసిన కార్తీక్ దీప ని తిట్టుకుంటాడు. దీపకే చెప్పకుండా పాపని పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 20వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 49వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
పాపని స్కూల్లో జాయిన్ చేసి బుక్స్ యూనిఫామ్ తీసుకొని బయటికి వస్తాడు కార్తీక్. అది చూసిన జ్యోత్స్న, పారిజాతం కోపంతో రగిలిపోతారు. శౌర్య ని జాగ్రత్తగా కార్ ఎక్కిస్తున్న కార్తీక్ ని చూసి సొంత కూతురికి చేస్తున్నట్లు ఎలా సేవలు చేస్తున్నాడో అంటుంది పారిజాతం. కార్ లో కూర్చున్న శౌర్య త్వరగా ఇంటికి పదా అన్నీ అమ్మకి చూపించాలి అంటుంది. దారిలో చిన్న పని ఉంది చూసుకుని వెళ్దాం అంటూ అక్కడినుంచి బయలుదేరుతాడు కార్తీక్. బావ తనకు నచ్చిన పని చేసుకుంటూ పోతుంటే నేను ఇలా చూస్తూ ఊరుకోవాల్సిందేనా అంటుంది జ్యోత్స్న.

చెయ్యాలి కానీ మనం కాదు, ఎవరు చెప్తే వింటారో వారి చేత చేయించాలి పద అంటూ ఆమెని కాంచన ఇంటికి తీసుకు వెళుతుంది పారిజాతం.అత్తకి బావ మీద కంప్లైంట్ ఇస్తుంది జ్యోత్స్న. కోడలిపై కోప్పడుతుంది కాంచన బయట వాళ్ళు ఏదో అనుకున్నారంటే అర్థం ఉంది కానీ చిన్నప్పటినుంచి చూసిన నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి, అయినా తను ఏదో చిన్నతనంతో అపార్థం చేసుకుంటే నువ్వు సర్ది చెప్పాలి కానీ ఇలా రెచ్చగొట్టి తీసుకు వస్తావా అంటూ పారిజాతం పై కోప్పడుతుంది.
నా కొడుకు నాకు అన్ని చెప్పాడు అంటుంది కాంచన. నువ్వేమీ అనలేదా అంటుంది పారిజాతం. మంచి పని చేస్తుంటే ఎందుకు ఆపాలి అంటుంది కాంచన. కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. జ్యోత్స్న ని రెచ్చగొట్టవద్దు అని పారిజాతానికి గట్టిగా చెప్తుంది కాంచన. కోప్పడవలసిన వాళ్ళని కోప్పడకుండా నన్ను అంటావేంటి, అనటానికి మీ అందరికీ నేనొక దాన్ని బాగా దొరికాను అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. అపార్ధాలు పెద్దవి కాకముందే వీరిద్దరికీ పెళ్లి చేసేయాలి అనుకుంటుంది కాంచన.

మరోవైపు ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి వచ్చిన దీప ఇంట్లో కూతురు లేకపోవడంతో సుమిత్ర దగ్గర ఉందేమో అని అటువైపు వెళుతుంది. అప్పుడే ఇంట్లోకి వెళ్తున్న పారిజాతం వాళ్లు దీప ని చూసి ఎక్కడికి వెళ్తున్నావ్ అంటారు. పాప కోసం అంటుంది దీప. పాప ఇంట్లో లేదని నీకు తెలుసు మాకు తెలుసు కానీ భలే నటిస్తున్నావ్ అంటుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నారు నాకు ఏమీ తెలియదు, పాప ఇంట్లో లేదా అంటుంది దీప.
అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు మాట్లాడే వాళ్ళతో మనకేంటి మాటలు పదా గ్రానీ అంటుంది జ్యోత్స్న. నువ్వు వెళ్ళు నేను వస్తాను అని పారిజాతం అనటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం దీపతో మాట్లాడుతూ నీకు అన్ని విషయాలు తెలుసు కానీ ఏమీ తెలియనట్లు ఉంటావు అంటుంది. పాపని కార్తీక్ బాబు స్కూల్లో జాయిన్ చేయడం మీరు చూసారా అంటుంది దీప. నేను చూడటం ఏమిటి కాసేపట్లో నువ్వు కూడా చూస్తావు.

కారు దిగిన నీ కూతురు పెద్ద స్కూల్లో జాయిన్ అయ్యాను అని చెప్తుంది, నువ్వు ఏమీ తెలియనట్లు అవునా అంటావు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. అదే సమయానికి పారిజాతం చెప్పినట్లు కార్తీక్ అక్కడికి రావడం, కారు దిగిన శౌర్య తల్లి దగ్గరికి వచ్చి పారిజాతం ఎలా చెప్పిందో అలాగే చెప్పటంతో షాక్ అయిపోతుంది దీప. మీకు మీకు బోలెడన్ని మాటలు ఉంటాయి మధ్యలో నేనెందుకు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం.
కార్తీక్ బుక్స్ యూనిఫామ్ తీసుకొని దీప దగ్గరికి వస్తాడు. ఎవరిని అడిగి తీసుకుని వెళ్లారు అంటుంది దీప. కార్తీక్ నేమి అనవద్దు అని తల్లికి చెప్పి బుక్స్, యూనిఫాం సుమిత్ర కి చూపించడానికి లోపలికి వెళుతుంది శౌర్య. మీరు ఎందుకు స్కూల్లో జాయిన్ చేశారు, నేను నలుగురి చేత మాటలు పడుతున్నాను అంటుంది దీప. ఎందుకు మాటలు పడాలి సమాధానం చెప్పటానికి మీ దగ్గర నోరు లేదా, ఎందుకు తలదించుకోవాలి అంటాడు కార్తీక్.

నా కూతురి ని నేనే చదివించుకుంటాను ఫీజు ఎంతో చెప్పండి అంటు తన దగ్గర ఉన్న 1900 ఇచ్చి మిగిలినది మెల్లగా కట్టుకుంటాను అంటుంది దీప. ఇది సరిపోతుంది అంటాడు కార్తీక్. నిజం చెప్పమంటుంది దీప. 80,000 అంటాడు కార్తీక్. అంత ఫీజు నేను కట్టుకోలేను అంటుంది దీప. కట్టగలరు నాతో రండి అంటూ ఆమె చేతిలో ఉన్న డబ్బు తీసుకొని పక్కకు వెళ్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











