Karthika Deepam May 20th Episode: కుట్రల్లో ఫస్ట్.. డాక్టర్‌బాబును నా కాళ్ల కిందకు రప్పిస్తా.. మోనిత వీరంగం
పెళ్లి విషయంలో డాక్టర్ మోనిత, ఆమె పనిమనిషి ప్రియమణి మధ్య భారీగానే వాగ్వాదం జరిగింది. ఇద్దరు ఒకరికొకరు మాటలు రువ్వుకొన్నారు. ఓ దశలో వారి వాగ్వాదం తీవ్రస్థాయికి వెళ్లింది. కార్తీక్ బాబు దీపను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దీప.. పాప అంటూ మందులు పట్టుకొని తీరుగుతున్నాడు.. నీ 16 ఏళ్ల ప్రేమకు 116 ఏళ్లు వచ్చినా నీ పెళ్లి మాత్రం జరగదు అంటూ ప్రియమణి గట్టిగా అనేసింది. దాంతో దీపను ఆ కొంపలో నుంచి పంపిచేస్తాను అంటూ మోనిత శపథం చేసింది. ఈ క్రమంలో మరోసారి మోనిత తనలోని ఉక్రోషాన్ని బయటపెట్టుకొంటూ...

మోనిత అంటే ఏమిటో నీకు తెలియదు
మోనిత అంటే ఏమిటో నీకు తెలియదు ప్రియమణి. నువ్వు చూసింది నాణేనికి ఒకవైపే. రెండో వైపు నీకు తెలియదు. నేను చదువులో ఫస్ట్. గేమ్స్‌లో ఫస్ట్. కుట్రలు చేయడంలో ఫస్ట్. 16 ఏళ్లుగా కార్తీక్ ప్రేమిస్తున్న నేను లవ్‌లో ఎందుకు ఫెయిల్ అవుతాను. నా లెక్కలు నాకు ఉన్నాయి. నా అంచనాలు నాకు ఉన్నాయి. నేను ప్రయోగించే పద్దతులు నాకు ఉన్నాయి. కాబట్టి కార్తీక్‌తో నా పెళ్లి ఖాయం అంటూ డాక్టర్ మోనిత రెచ్చిపోయింది.

ఏదో ఒకటి చేయాల్సిందే
భార్య దీపకు కార్తీక్ బాబు దగ్గర కావడాన్ని మోనిత జీర్ణించుకోలేకపోతున్నట్టు కనిపించింది. ఆమె మనసు, ఆలోచనలు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తున్నాయనే విధంగా బాడీ లాంగ్వేజ్ కనిపించింది. ఏదైనా ఒకటి చేయాల్సిందే అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు. పక్కన ఎవరు ఉన్నారు? తన ఇంట్లో ఏం జరుగుతున్నదనే విషయాన్ని పట్టించుకోలేనంతగా ఆలోచనల్లో పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో పనిమనిషి ప్రియమణి వచ్చి పక్కనే కూర్చొన్నా పట్టించుకోలేదు.

దీర్ఘాలోచనల్లో మునిగిపోయిన మోనిత
డాక్టర్ మోనిత ఆలోచనల్లో మునిగిపోయిన క్రమంలో ప్రియమణి ఆమెను డిస్ట్రబ్ చేసింది. ఏంటమ్మా ఎదురుగా మనిషి వచ్చిన కూర్చొన్న పట్టించుకోకుండా ఉన్నారు. నాకు ఏదో జరుగుతున్నదని ఏదో కొడుతున్నది అంటూ ప్రియమణి ఆమెను కదలించింది. దాంతో ఆ ఆలోచనల నుంచి తేరుకొని ఏంటది అంటూ మోనిత ప్రశ్నించింది.

కళ్లలో నిప్పులు పోసుకొంటావని..
మోనిత ప్రశ్నకు ప్రియమణి స్పందిస్తూ.. దీపను కార్తీక్ బాబు ఇంట్లోకి తెచ్చుకొని చిన్నపాపల చూసుకొంటుంటే.. మీరు కళ్లలో నిప్పులు పోసుకొంటారని అనుకొన్నాను. మీ కడుపు భగ్గున మండిపోతుందని అనుకొన్నాను. మీ మనసు బాగా రగలిపోతుందని అనుకొన్నాను. అలాంటిదేమీ జరుగకుండా మీ మటుకు మీరు ఓ మూలన కృష్ణా రామా అని కూర్చొన్నారంటే.. నాకకు మాత్రం అరగడం లేదమ్మా. నాకు మింగుడు పడటం లేదమ్మా.. ఏం జరుగుతున్నదమ్మా అంటూ ప్రియమణి రెచ్చగొట్టింది.

కరెక్ట్‌గానే ఊహించావు ప్రియమణి
ప్రియమణి ప్రశ్నలకు మోనిత స్పందిస్తూ.. నీవు చెప్పిందంతా నిజమే. దీపను కార్తీక్ చేరదీసి.. పువ్వుల్లోపెట్టి చేరదీసుకొంటుంటే.. మోనిత గుండెల్లో ఎంత రగిలిపోతుందో నీవు కరెక్ట్‌గా ఊహించగలిగావు అని మోనిత అంటే.. ఇదైనా కరెక్ట్‌గా ఊహించావు అని ప్రియమణి చెప్పింది. నీవు మాట్లాడేవి అన్నీ నిజాలే ప్రియమణి అని మోనిత చెప్పింది. అన్ని అంటే ఏదో జరుగుతుంది అని ప్రియమణి అంటే.. నిజం. అంటూ కోపంతో మోనిత ఊగిపోయింది.

బెదిరిపోయిన ప్రియమణి
కార్తీక్‌ను నా కాళ్ల వద్దకు రప్పించుకొంటాననేది నిజం అంటూ మోనిత ఊగిపోయింది. మోనిత ముఖంలో హావభావాలు చూసిన తర్వాత ప్రియమణి బెదిరిపోయింది. నాకు మిమ్మల్ని చూస్తే ఏదోలా ఉంది.. నాకు భయంగా ఉంది అంటూ ప్రియమణి అదిరిపోయింది. దాంతో పెద్ద పెట్టున్న మోనిత నవ్వి.. నిన్ను భయపెట్టడానికి అలా చేశాను.. నీవు వెళ్లి వంటపని చూసుకో అని మోనిత చెప్పింది.
Recommended Video

కార్తీక్ అలా రప్పించుకొంటాను అంటూ..
ప్రియమణి వంటగదిలోకి వెళ్లిన తర్వాత పిచ్చి ప్రియమణి.. .నేనేంటో నీకు సరిగా తెలియదు. అది తెలిస్తే నా వద్ద పని చేయడానికే భయపడుతావు. ఇక కార్తీక్‌ను ఎలా రప్పించకుంటానో తెలిస్తే.. ఏ మాత్రం తట్టుకోలేవు. వణికిపోతావు అంటూ పెద్ద పెట్టున నవ్వుతూ తన అహంకారాన్ని, దుష్టబుద్దిని బయటపెట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











