Big Twist in Karthika Deepam today's episode:ఆమెతో మీ నాన్న ఇద్దర్ని కన్నాడు. భయంకర నిజాన్ని బయటపెట్టిన స్వప్న
నానమ్మ అంటూ శౌర్య అలియాస్ జ్వాలా ఫోన్ చేసి నేను మీ మనవరాలిని అని చెప్పడంతో సౌందర్య షాక్ తిన్నది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న క్షణం రావడంతో ఆనందంలో మునిగిపోయింది. నా బంగారం ఎక్కడున్నావే.. నా రౌడీ.. ఎక్కడున్నావే.. శౌర్య ఇన్నాళ్లు ఏమైపోయావే.. ఎక్కడున్నావో చెప్పు.. నేను వెంటనే వచ్చేస్తాను అంటూ సౌందర్య ఆనందపడిపోతుంటే.. శౌర్య ఫోన్ కట్ చేసింది. దాంతో మళ్లీ శౌర్యకు సౌందర్య ఫోన్ చేస్తే మళ్లీ కట్ చేసింది. దాంతో హిమ వద్దకు వెళ్లి శౌర్య నాకు ఫోన్ చేసిందని చెప్పింది. కార్తీకదీపం సీరియల్ 1357 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

నానమ్మకు శౌర్య ఫోన్
నాన్నమ్మకు శౌర్య ఫోన్ చేసిందంటే.. నానమ్మ చెప్పిన ప్లేస్‌లో శౌర్య ఎందుకుంది? నానమ్మను శౌర్య కలుస్తుందా? హిమను నేనే అనే విషయం తెలిస్తే నా పరిస్థితి ఏమిటి? నిజంగా శౌర్య ఫోన్ చేసిందా? అంటూ పలు రకాల ప్రశ్నలతో హిమ ఉక్కిరిబిక్కిరి అయింది. అంతలోనే స్వప్న అక్కడికి రావడంతో శౌర్య ఆచూకీ తెలిసింది. నాకు ఫోన్ చేసింది అని చెప్పి ఆనందంలో పొంగిపోయింది. శౌర్య.. నా మనవరాలు నాకు ఫోన్ చేసిందని చెప్పి ఆనందపడిపోయింది.

నష్టజాతకురాలిపైనే ప్రేమ
సౌందర్యతో స్వప్న మాట్లాడుతూ.. ఇన్నాళ్లు శౌర్యను పట్టించుకోలేదు. ఈ హిమ.. నష్ట జాతకురాలిపైనే ప్రేమంతా చూపించారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఆ శౌర్యను వెతికి తీసుకురండి. ఆమెపై ఉన్న ప్రేమను చెప్పండి. ఒకరిని అల్లం.. బెల్లం లా చూడకండి.. ఒకవేళ శౌర్య తీసుకొచ్చి నాకొడుకుకు ఇచ్చి పెళ్లి చేస్తానని డ్రామా ఆడకండి. నెల రోజుల్లోనే నా కొడుకు పెళ్లి అంగరంగవైభవంగా చేస్తాను అని స్వప్న సవాల్ విసిరింది.

సిమ్ తీసి పడేసిన శౌర్య
శౌర్య మమ్మల్ని వెంటాడుతున్నదా? అంటూ నానమ్మ నుంచి ఫోన్ తీసుకొని శౌర్యకు ఫోన్ కలిపింది. అయితే అప్పటికే శౌర్య తన ఫోన్ నుంచి కాల్ చేసింది. అయితే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి నెట్‌వర్క్ పరిధిలో లేదు అని చెప్పింది. నంబర్ కలువకపోతే ఏంటి? నేను ఆ రౌడీని వెతికి పట్టుకొంటాను అని సౌందర్య చెప్పింది. నానమ్మ ప్రేమగా మాట్లాడటం గురించి ఆలోచిస్తూ.. నేను ఫోన్ చేస్తే ఆనంద పడిందా? నానమ్మ ఫీలింగ్ ఏమిటి? నాపై ఎందుకు ప్రేమ ఉంటుంది? ఆ ఇంట్లో నా శత్రువు ఉంది. వారికి నాపై ప్రేమ ఉందా? నన్ను వెతుకుతారా? అని శౌర్య మనసులో అనుకొన్నది.

పోలీసులతో సౌందర్య ఎంక్వైరీ
నానమ్మ ఇంట్లో పరిస్థితి ఏమిటి అని వెళ్లి చేస్తే.. అక్కడ పోలీసులు ఉండటంపై ఆశ్చర్యపోయింది. మీ ఇచ్చిన నంబర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం అని పోలీసులు చెప్పారు. అయితే నా అడ్రస్ కనుక్కొంటారా? షాపుకు వెళ్లి నా అడ్రస్ గురించి ఎంక్వైరీ చేస్తారా? అనే ప్రశ్నలతో కంగారు పడిపోయింది. వెళ్లి నానమ్మతో ఏం చేస్తున్నారు? అంటే.. ఓ పని గురించి వచ్చాను. అది త్వరలోనే పూర్తి అవుతుంది అని సౌందర్య చెప్పింది. జ్వాలాపై అనుమానం వ్యక్తం చేస్తూ.. నీవు ఎవరు.. ప్రతీచోట నన్ను వెంబడిస్తున్నావు. నా వెంట పడమని ఎవరైనా చెప్పారా అంటూ నిలదీసింది. పోలీసులు పిలవడంతో సౌందర్య పక్కగా వెళ్లడంతో శౌర్య అక్కడి నుంచి వెళ్లింది.

ఆమెతో మీ నాన్న ఇద్దరు పిలల్ని కన్నాడు
ఎంగేజ్‌మెంట్‌ను హిమ రిజెక్ట్ చేయడంతో బాధపడుతున్న నిరుపమ్‌ను ఊరడించింది. నిన్ను వదులుకోవడం హిమ చేసుకొన్న దురదృష్టం. దాని గురించి బాధపడకు. నేను మీ నాన్న ఎందుకు విడిపోయామంటే.. మేము పెళ్లి చేసుకోక ముందు మీ నాన్న మరొకరిని ప్రేమించాడు. ఆ విషయం తెలిసి సత్యంను పెళ్లి చేసుకోకపోతే పిల్లల్ని కనను. అసలు పెళ్లే చేసుకొను అని శపథం చేసిందంట. ఆ తర్వాత పెళ్లి చేసుకొన్నది. కానీ ఇద్దరు పిల్లల్ని మీ డాడితో కన్నది అని నిరుపమ్‌కు భయంకరమైన నిజం చెప్పింది.

19వ వారం కార్తీకదీపం సీరియల్ రేటింగ్
కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. 19వారంలో 11.60 రేటింగ్‌ను నమోదు చేసింది. గతంలో అంటే 18వ వారంలో 11.48 రేటింగ్‌తో సరిపెట్టుకొన్నది. అయితే ఐపీఎల్ కారణంగా బుల్లితెరపై అన్ని సీరియల్స్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఐపీఎల్ తర్వాత సీరియల్స్ రేటింగ్స్ పుంజుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











