twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam May 21st Episode: పాపం చేశా.. పిల్లల్ని పరాయివాళ్లుగా.. కుప్పకూలిన డాక్టర్ బాబు

    |

    భార్య దీప బతికించుకోవాలని డాక్టర్ కార్తీక్ విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. సరైన వైద్య చేయించుకొని దీప ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలని తగు నిర్ణయాలు తీసుకొంటున్నాడు. తన హాస్పిటల్‌లో కాకుండా మరో మంచి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయించాలని తన స్నేహితుడు డాక్టర్ గోవర్ధన్‌ను కలిశాడు. తన భార్య దీపకు ఏ సమయంలోనైనా సర్జరీ అవసరం అంటూ డాక్టర్‌తో కార్తీక్ చెబుతూ...

    ఏ క్షణంలోనైనా సర్జరీ అవసరం..

    ఏ క్షణంలోనైనా సర్జరీ అవసరం..

    ఏ క్షణమైనా నీ హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్ అవసరం రావొచ్చు గోవర్ధన్. థియేటర్ అందుబాటులో ఉంటుందా? అని కార్తీక్ అడిగాడు. కార్తీక్ సమాధానం చెబుతూ.. తప్పకుండా నీకు అందుబాటులో ఉంచుతాను. కానీ నీ హాస్పిటల్‌లోనే ఈక్విప్‌మెంట్, సదుపాయాలు బాగా ఉంటాయి కదా. నేను నా హాస్పిటల్‌లో మెరుగైన సదుపాయాలు కల్పించాను అంటూ డాక్టర్ గోవర్దన్ ప్రశ్నించాడు.

    దీప అంటే అందరికి అభిమానం

    దీప అంటే అందరికి అభిమానం

    డాక్టర్ గోవర్ధన్ ప్రశ్నకు కార్తీక్ సమాధానం చెబుతూ... మా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయిస్తే దీపకు ఉన్న జబ్బు గురించి తెలిసి పోతుంది. మా స్టాఫ్ అందరికి దీప అంటే చాలా అభిమానం. ఇప్పటి వరకు దీపకు ధైర్యం చెబుతూ వచ్చాను. ఎవరికైనా మా పరిస్థితి చెబితే.. ఆ ధైర్యం పోతుంది అంటూ కార్తీక్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

    దీప ఫ్రెండ్ ఏడుస్తూ..

    దీప ఫ్రెండ్ ఏడుస్తూ..

    కార్తీక్ పరిస్థితిని అర్ధం చేసుకొన్న డాక్టర్ గోవర్దన్.. సరే కార్తీక్.. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు థియేటర్‌ రెడీగా ఉంటుంది. అర్జెంట్ కేసులు ఏమీ లేవు. నీవు నా థియేటర్‌ను ఉఫయోగించుకోవచ్చు అంటూ గోవర్దన్ చెబుతుండగానే.. దీప ఫ్రెండ్ తులసి కొన్ని రిపోర్టులను నేలకేసి కొడుతూ.. భోరున ఏడుస్తూ కార్తీక్ ముందు నుంచి వెళ్లిపోయింది.

    Recommended Video

    Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
    దీప ఫ్రెండ్‌కు సంతానం కలగదని

    దీప ఫ్రెండ్‌కు సంతానం కలగదని

    దీప ఫ్రెండ్‌ అలా ఏడ్చుకొంటూ వెళ్లిపోవడం చూసి కార్తీక్.. ఎందుకలా ఏడుస్తూ వెళ్తున్నది.. ఏమిటి ప్రాబ్లెం అని గోవర్ధన్‌ను అడిగాడు. ఆమె ఒక ప్రాబ్లం. వారికి సంతానం కలుగదని చాలా తొమ్మిది ఏళ్ల క్రితమే చెప్పాను.

    కానీ వినకుండా చాలా చోట్ల తిరిగారు. అమెరికాలో కూడా పరీక్షలు చేయించుకొన్నారు. కొన్ని పసర్లు కూడా తాగారు. మళ్లీ ఇప్పుడు పరీక్షలు చేస్తే అదే ఫలితం. వారికి ఎప్పటికి పిల్లలు పుట్టరు. ప్రాబ్లెం ఆమెలో కాదు.. లోపం ఆమె భర్తలో ఉంది అంటూ డాక్టర్ గోవర్థన్ తెలిపారు.

    దీప ఫ్రెండ్‌ విషయం తెలిసి...

    దీప ఫ్రెండ్‌ విషయం తెలిసి...

    తన భార్య దీప ఫ్రెండ్ తులసిలో ఎలాంటి సమస్య లేదని తెలుసుకొన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఎందుకంటే ఒకప్పుడు దీపపై నింద మోపింది ఆ విషయంలోనే అనే విషయం దిగ్బ్రాంతికి గురిచేసింది. విహారి వల్లనే దీపకు పిల్లలు పుట్టారనే ఆరోపణ చేసిన విషయం గుర్తొచ్చి ఒక్కసారిగా కుప్పుకూలినట్టు కార్తీక్ అయిపోయాడు. కార్తీక్ పరిస్థితిని చూసి ఆర్ యూ ఆల్‌రైట్ అంటూ అడుగగా.. మళ్లీ కలుస్తా అంటూ వెళ్లిపోయాడు.

    ఘోరమైన తప్పిదం చేశానంటూ..

    ఘోరమైన తప్పిదం చేశానంటూ..

    డాక్టర్ గోవర్థన్ హాస్పిటల్ నుంచి కారులో బయలుదేరిన కార్తీక్ ఇంటి వరకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నేను తప్పు చేశాను. పొరపాటు చేశాను. ఘోరమైన తప్పిదం చేశాను. నా పిల్లల్ని కూడా పరాయివాళ్లను చూసినట్టు చూశాను. ఏం చేస్తే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం దక్కుతుంది అంటూ కార్తీక్ తనలో తాను కుమిలిపోయాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వివరాలు తదుపరి ఎపిసోడ్‌లో వెల్లడి కానున్నాయి.

    English summary
    Karthika Deepam May 21st Episode: Doctor Karthik emotional about deepa's surgery
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X