Karthika Deepam May 21st Episode: కళ్లల్లో నిప్పులు పోసుకొంటా.. కార్తీక్ కోసం ఎంతకైనా తెగిస్తా.. మోనిత ఫైర్
కార్తీక్ బాబు దీపను ఇంట్లోకి తీసుకొచ్చి చిన్నపాపల చూసుకొంటూ మందులు ఇస్తూ జాగ్రత్తలు తీసుకొంటుంటే.... నీ 16 ఏళ్ల ప్రేమకు 116 ఏళ్లు వచ్చినా నీ పెళ్లి మాత్రం జరగదు అంటూ డాక్టర్ మోనితకు పనిమనిషి ప్రియమణి షాకిచ్చింది. మోనిత అంతరంగాన్ని కుట్రలు ఉప్పెనలా తాకి ఉక్కిరిబిక్కిరి చేసిన విషయాల్లోకి వెళితే...

విషపు ఇంజెక్షన్ ఇచ్చి..
తాను ఇచ్చిన విషపు ఇంజెక్షన్‌తో దీప చనిపోతుంది. ఇక ఎప్పటికైనా కార్తీక్ నావాడు అవుతాడు. కాపురం మొదలుపెట్టిన తర్వాత నేను ఉదయమే లేచి ఇంటి పనులు, వంటపనులు చూసుకోవాలిగా. అందుకే నేను ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టాననే డాక్టర్ మోనిత మాటలను ప్రియమణి చాలా తేలికగా తీసుకోవడంతో మోనిత కోపంతో ఊగిపోయింది.

మోనితను రెచ్చ గొట్టిన ప్రియమణి
ఆ తర్వాత డాక్టర్ మోనిత ప్రేమను చులకన చేస్తూ ప్రియమణి.. నా ఆయుష్పు అంతా తీరిపోయి.. నేను పుటుక్కున చచ్చే దాకా నీ పెళ్లి జరగదు అంటూ ప్రియమణి చెప్పిన మాటలు మోనితను ఉక్కిరిబిక్కిరి చేయడమే కాకుండా మరింత రెచ్చగొట్టేలా చేశాయి. దాంతో మోనిత మనసులోని కుట్రలు మరోసారి భగ్గుమన్నాయి.

దీపకు విహారికి సంబంధం అంటగట్టి
ప్రియమణి అన్నట్టు దీపను కార్తీక్ పసిపాపలా? కనుపాపలా చూసుకొంటున్నాడా? చంటిపాపలా? కంటిపాపలా చూసుకొంటూ నన్ను అవాయిడ్ చేస్తున్నాడా? దీపకు విహారికి సంబంధం అంటగట్టి నేను సక్సెస్ అయ్యాననుకొంటే.. ఇప్పుడు ఆ సంగతే మరిచిపోయి.. దీప చచ్చిపోతుందని తెలియగానే.. దీపకు కార్తీక్ సేవ చేస్తున్నాడా?
Recommended Video

ప్రేమ నిజం.. అలా పుట్టింది నిజం
భార్య దీపకు కార్తీక్ దగ్గరైతే సహించాలా అని మోనిత అంటూ... ఇదంతా చూస్తూ నేనెందుకు ఊరుకొంటాను కార్తీక్. నా కళ్లల్లో నిప్పులు పోసుకొంటాను. నిన్ను నావాడిని చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను. నేను ప్రేమించింది నిజం.. నిన్ను పెళ్లి చేసుకోవడానికి పుట్టింది నిజం. ఎలా రాకుండా ఉంటావో చూస్తా.. ఎంతకాలం దీప వద్దే ఉంటావో చూస్తా అంటూ మోనిత ఆగ్రహంతో ఊగిపోయింది.


Click it and Unblock the Notifications











