Karthika Deepam 2 May 21st: దీపకి ఛాలెంజ్ విసిరిన కార్తీక్.. భార్యతో గొడవకి దిగిన నర్సింహ!
స్కూల్ వాళ్ళు శౌర్య అడ్మిషన్ రిజెక్ట్ చేస్తారు. పాపని వేరే స్కూల్లో జాయిన్ చేస్తుంది దీప. అది తెలిసిన కార్తీక్ దీప ని తిట్టుకుంటాడు. దీపకి చెప్పకుండా పాపని పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాడు. అది జోత్స్న, పారిజాతం చూస్తారు.దీపతో గొడవ పడుతుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 21వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 50వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
అంత ఫీజు నేను కట్టుకోలేను పాపని వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను అంటుంది దీప. మీరు కట్టగలరు ముందు ఆ డబ్బు నా చేతికి ఇవ్వండి అని చెప్పి 1900 దీప దగ్గర తీసుకొని తనతో పాటు రమ్మంటాడు కార్తీక్. కార్తీక్ నేరుగా దీప వంటగదిలోకి వెళ్లి ఒక డబ్బా తీస్తాడు. అదెందుకు అంటుంది దీప. మీరు నాకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు కదా మీరు ఇవ్వాలనుకున్న డబ్బుని ఈ డబ్బాలో దాయండి మొత్తం పూర్తయ్యాక నాకు ఇవ్వండి.

అప్పుడు రౌడీని నేను చదివిస్తున్నట్లుగా ఉండదు మీరే చదివినట్లుగా ఉంటుంది. మీరే చెప్పండి డబ్బుని ఎన్ని రోజుల్లో ఇస్తారు అంటాడు కార్తీక్. ఆరు నెలల్లో తీరుస్తాను అంటుంది దీప. ఆరు నెలలలో తీర్చకపోతే ఆ డబ్బు నేను తీసుకోను, ఈ చాలెంజ్ ని దృష్టిలో పెట్టుకొని మీ మీద నమ్మకంతో మీరు పని చేయండి. మొదటి వాయిదాగా వెయ్యి రూపాయలు డబ్బాలో వేస్తున్నాను, ఈ 900 ఖర్చులకి ఉంచండి. ఎవరు ఏమన్నా చెప్పుతో కొట్టి సమాధానం చెప్పండి. ఇదంతా మీరు నన్ను క్షమిస్తారని చేయటం లేదు కానీ ఎప్పటికైనా క్షమిస్తారనే నమ్మకంతోనే ఉన్నాను.
మీకు ఇష్టం లేకపోయినా నేను ఎప్పటికీ మీకు శ్రేయోభిలాషినే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పారిజాతం చూస్తుంది. మరోవైపు స్కూల్లో అటెండర్ నర్సింహా తో మాట్లాడుతూ వచ్చినవాడు పాప తండ్రే అంటాడు. పాప తండ్రి అతను కాదు పాప తండ్రి నాకు తెలుసు అంటాడు నర్సింహ. కానీ అప్లికేషన్ ఫామ్ లో తండ్రి స్థానంలో అతని పేరు రాశాడు కావాలంటే చూడు అని ఫోటో చూపిస్తాడు అటెండర్. తండ్రి అతను కాకపోయినా తండ్రి స్థానంలో అతని పేరు రాశాడు.

అంటే పాప తండ్రి ఎంత చేతకానివాడో అంటాడు అటెండర్. ఆ మాటలకి కోపంతో రగిలిపోతాడు నర్సింహ ఆ ఫోటో తనకి పంపించమంటాడు. మరోవైపు కూతురుకి అన్నం తినిపిస్తూ ఉంటుంది దీప. అమ్మమ్మ స్కూల్ కి కారులో పంపిస్తానంది అంటుంది శౌర్య. వద్దు ఆటోలో తీసుకువెళ్తాను అంటుంది దీప. పోనీ కార్తీక్ కార్లో వెళ్లేదా అంటుంది శౌర్య. ఆ మాటలకి కోప్పడుతుంది దీప. సైకిల్ కొనే వరకు ఆటోలో స్కూల్ లో దింపుతాను అంటుంది దీప.
కార్తీక్ అంటే చాలు కోపం వచ్చేస్తుంది అనుకుంటుంది శౌర్య. పాపని వాళ్లకు దూరంగా ఉంచడం జరగని పని నేనే పాపని ఆటోలో స్కూల్లో దింపాలి లేదంటే అతనే పాపని స్కూల్లో దింపుతాడు అనుకుంటుంది దీప. మరోవైపు హోటల్లో పని చేసుకుంటున్న దీప దగ్గరికి నర్సింహ వస్తాడు. బాబాయ్ తో నేనే ఆమె భర్తని అని చెప్తాడు. ఇక్కడ ఏ గొడవ జరిగినా ఏమీ మాట్లాడద్దు బాబాయ్ అంటుంది దీప.నీ బిడ్డకు తండ్రిని నేనా,వాడా? వాడెందుకు పాపని స్కూల్లో జాయిన్ చేయాలి?

తండ్రి స్థానంలో వాడి పేరు రాశాడు అంటూ ఫోటో చూపిస్తాడు. మాతో సంబంధం లేదని చెప్పావు కదా ఇప్పుడు మా సంగతి నీకెందుకు,అయినా ఆ వివరాలు నేను అతనిని కనుక్కుంటాను అంటుంది దీప. నాతో నీకు ఏ సంబంధం లేనప్పుడు నేను కట్టిన తాళి నీకెందుకు ఇచ్చేయ్ అంటాడు నర్సింహా. ఇవ్వటానికి ఒప్పుకోదు దీప. ఆమె మెడలో తాడు తెంపే ప్రయత్నం చేస్తాడు నర్సింహ. ఆ ప్రయత్నంలో అడ్డువచ్చిన బాబాయిని పక్కకి నెట్టేస్తాడు.
దీప మెడ కి గాయం కూడా అవుతుంది. అప్పుడు బాబాయి దీప ఇద్దరు కలిసి నర్సింహ మీద తిరగబడతారు. నీ సంగతి చూస్తాను అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు నర్సింహ. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ చూస్తాడు. వీడిని ఇలా వదిలేస్తే మళ్లీ మళ్లీ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అంటూ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఒకడికి బుద్ధి చెప్పాలి అంటూ దీప వాళ్ళ కి కనిపించకుండా అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

ఏడుస్తున్న దీప దగ్గరికి వచ్చిన బాబాయ్ భర్త గురించి అందుకేనా చెప్పలేదు దీపమ్మ అని బాధపడతాడు. నెక్స్ట్ సీన్ లో హోంవర్క్ కంప్లీట్ చేసిన శౌర్య అది చూపించడానికి తల్లి దగ్గరికి వెళుతుంది. తల్లి మెడ మీద గాయం చూసి ఏమైంది అంటుంది. ఏమీ లేదు అంటుంది దీప. ఏమీ లేదని చెప్పి అలా వదిలేస్తావా అంటూ ఆయింట్మెంట్ తెచ్చి గాయానికి పూస్తుంది శౌర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











