Karthika Deepam 2 May 22nd: దీప అడిగిన ప్రశ్నకి షాకైన కార్తీక్.. పోలీసుల చెర లో నర్సింహ!
పాపని వేరే స్కూల్లో జాయిన్ చేస్తుంది దీప. అది తెలిసిన కార్తీక్ దీప ని తిట్టుకుంటాడు. దీపకి చెప్పకుండా పాపని పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాడు. అది జోత్స్న, పారిజాతం చూస్తారు.దీపతో గొడవ పడుతుంది పారిజాతం. పాప తండ్రి స్థానంలో కార్తీక్ సంతకం పెట్టాడని తెలుసుకొని దీపతో గొడవపడతాడు నర్సింహ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 22వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 51వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీప మెడకి మందు రాస్తూ జాగ్రత్తగా ఉండాలని నాకు చెప్తావు కదా మరి నువ్వు ఎందుకు జాగ్రత్తగా లేవు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అంటుంది శౌర్య. నేను స్కూల్ కి వెళ్ళను నీకు సహాయంగా ఉంటూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది. తన చిన్నతనం గుర్తుకు వస్తుంది దీపకి. కష్టపడే వాళ్ళకి ఇలాంటి దెబ్బలు తగలడం సహజం అందుకని చదువు మానేయకూడదు, నాకు కలెక్టర్ అవుతానని మాట ఇచ్చావు అంటుంది దీప.

చదువు మానేయను స్కూల్ కి వెళ్తాను అంటుంది శౌర్య. శౌర్య ని దగ్గరికి తీసుకొని ముద్దులాడుతుంది దీప. తర్వాత అసలు ఆ మనిషి సంతకం ఎందుకు పెట్టారో కనుక్కోవాలి, ఎంత చెప్పినా వినిపించుకోరు అని కార్తీక్ ని తిట్టుకుంటుంది. నెక్స్ట్ సీన్లో బయట పని చేసుకుంటున్న దీప మెడమీద గాయాన్ని చూసి ఆమెని పలకరించడానికి వస్తాడు కార్తీక్.
పొద్దున జరిగిందంతా చూసాను, అసలు మీకు ఆ కష్టాలన్నీ మీ భర్త వలనే అంటాడు. మీరు జరిగిన గొడవ మాత్రమే చూశారు కానీ దానికి కారణం మీరే అంటూ స్కూల్లో కార్తీక్ పెట్టిన సంతకం గురించి నిలదీస్తుంది దీప. మీకు నచ్చిన పని మీరు చేస్తున్నారు, అతనికి నచ్చిన పని అతను చేస్తున్నాడు మధ్యలో గాయాలు నాకు తగులుతున్నాయి అంటుంది దీప. తను పెట్టిన సంతకానికి ఎక్స్ప్లనేషన్ ఇస్తాడు కార్తీక్. నేను జాయిన్ చేయడానికి వెళ్ళాను కాబట్టి నేను పెట్టాను.

అదే మా మామయ్య వెళ్ళినా, మా నాన్న వెళ్ళినా ఎవరు వెళ్లినా కూడా ఆ ప్లేస్లో ఆ సంతకం పెడతారు. అప్పుడు వాళ్ళని కూడా ఇలాగే అనుమానిస్తారా అంటాడు కార్తీక్. అతని చేత మాటలు అనిపించుకునే పని మీరు ఎందుకు చేయాలి, దయచేసి మా జోలికి రాకండి అని రిక్వెస్ట్ చేస్తుంది దీప. మీరు ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితికి కారణం మీ భర్త మీరు క్షమించినా నేను క్షమించను అనుకొని అక్కడ నుంచే వెళ్ళిపోతాడు కార్తీక్.
ఆ తర్వాత దీపతో జరిగిన గొడవ గురించి గర్వంగా భార్యతో చెబుతూ భోజనం చేస్తుంటాడు నర్సింహ. అప్పుడే పోలీసులు వచ్చి భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకున్నావు అలాగే మొదటి భార్య మీద చేయి చేసుకున్నందుకు నిన్ను అరెస్టు చేస్తున్నాము అని అతనిని అరెస్టు చేసి తీసుకువెళ్తారు పోలీసులు. శోభ,అనసూయ ఎంత చెప్పినా వినిపించుకోరు.

వాడి షర్టు తీసుకొని రా మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులనే బ్రతిమాలుకుందాం అంటుంది అనసూయ. మీ తల్లి కొడుకులు కలిపి నా బ్రతుకు పోలీస్ స్టేషన్ పాలు చేశారు అని కోప్పడుతూ షర్ట్ తీసుకొస్తుంది శోభ. ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. మరోవైపు ఊర్లో జరిగిన సంగతి అంతా పారిజాతానికి చెప్తాడు బంటు. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటుంది పారిజాతం. అలా కావాలి అంటే నేను మీ ఇంట్లో ఉండాలి అంటాడు బంటు.
ఇప్పుడున్న పరిస్థితులలో కష్టం అంటుంది పారిజాతం. ఆలోచించండి మీకే ఐడియా వస్తుంది అంటాడు బంటు. పారిజాతానికి సడన్గా ఒక ఐడియా వస్తుంది, నేను ఒక దెబ్బ వేస్తాను గట్టిగా అరవకు అంటుంది. సరే అంటాడు బంటు. కర్రతో అతని నెత్తి మీద రక్తం వచ్చేలా కొడుతుంది పారిజాతం. తర్వాత అతనిని తీసుకొని ఏడుస్తూ ఇంట్లోకి వెళుతుంది. వాడిని ఎందుకు ఇంట్లోకి తీసుకువచ్చావ్ అంటాడు శివ నారాయణ.

చల్లగాలికి బయట తిరుగుతుంటే నా మెడలో బంగారం కోసం ఎవరో నన్ను కొట్టబోతే సుమిత్ర దీపని కాపాడినట్లు వీడు నన్ను కాపాడాడు అంటూనే బంటు కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది పారిజాతం. సరే కట్టు కట్టావు కదా ఇక పంపించేయ్ అంటాడు శివ నారాయణ. తను ఇక్కడే ఉంటాడు సుమిత్ర ని కాపాడిన దీప ఇక్కడ ఉన్నప్పుడు నన్ను కాపాడిన బంటు కూడా ఇక్కడే ఉండాలి అంటుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications










