Karthika Deepam latest Episode:మృత్యువు అంచున దీప.. చేతులు కాలాక ఆకులు పట్టుకొంటున్న డాక్టర్ బాబు

గత పదేళ్లుగా దీప శీలాన్ని అనుమానిస్తూ వచ్చిన డాక్టర్ కార్తీక్‌కు అసలు విషయం తెలిసింది. విహారితో లింకు పెట్టి దీపను పతితగా భావించిన కార్తీక్ అసలు విషయం తెలుసుకొన్నాడు. దీప నిప్పు అంటూ తల్లి సౌందర్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొన్నారు. అలాంటి సంఘటనలన్నీ గుర్తుకు రాగా డాక్టర్ కార్తీక్ కుమిలి కుమిలి ఏడ్చాడు. తాను చేసిన తప్పులను గుర్తు చూసుకొంటూ..

నరకం చూపించా.. చిత్రవధ చేశా

నరకం చూపించా.. చిత్రవధ చేశా

అమ్మా నేను తప్పు చేశాను. నీవు ఎంత చెప్పినా నేను నరకం చూపించాను, చిత్ర వధ చేశాను. గాయపడిన మనసును మళ్లీ మళ్లీ ఎన్నోసారు గాయం చేశాను. నిజంగా దీప భూదేవి లాంటిందే. అది దీప కాబట్టి ఇంకా ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉంది. నేను మారతానన్న నమ్మకంతోనే ఉంది అంటూ కార్తీక్ మనోవేదనకు గురవుతూ చెంపలు వాయించుకొన్నాడు.

పదేళ్లుగా అగ్ని ప్రవేశం చేస్తూనే ఉన్నా

పదేళ్లుగా అగ్ని ప్రవేశం చేస్తూనే ఉన్నా

చరిత్రలో శీల పరీక్ష కోసం ఎంతో మంది అగ్నిప్రవేశం చేశారు. కానీ నా శీల పరీక్షకు నేను పదేళ్లుగా అగ్ని ప్రవేశం చేస్తూనే ఉన్నాను అంటూ దీప చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కార్తీక్ కుమిలిపోయాడు. నీకు ఎప్పటికైనా నిజం తెలుస్తుంది. ఆ తర్వాత నా కంటే ఎక్కువగా నీవే బాధపడుతావు అని దీప చెప్పిన మాటలను గుర్తు చేసుకొని భోరున విలపించాడు.

దీప.. అమానుషంగా ప్రవర్తించా

దీప.. అమానుషంగా ప్రవర్తించా

దీప నీవు చెప్పింది నిజం. ఆ నిజం నా అహంకారాన్ని బూడిద చేస్తున్నది. నేను తప్పు చేశాను. పొరపాటు చేశాను. నేరం చేశాను. అమానుషంగా ప్రవర్తించాను. నిన్నే కాదు మన బిడ్డల్ని పరాయివాళ్లుగా చూశాను. ఏం చేస్తే పాపానికి ప్రాయశ్చితం దొరుకుతుంది. ఏం చేయలేను.. ఏది చెప్పలేను. నాకు ఎలాంటి అర్హత లేదు.

నా చదువు, సంస్కారం ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఉత్త చేతుతో నిలడుతాను. నీ వద్దకు వస్తున్నాను దీప అంటూ కార్తీక్ కుమిలిపోయాడు. ఇక కార్తీక్ పరిస్థితి చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందంగా తయారైందనే ఫీలింగ్ కలుగుతున్నది.

తీవ్ర అస్వస్థతకు గురైన దీప

తీవ్ర అస్వస్థతకు గురైన దీప

అత్త సౌందర్యతో మాట్లాడుతున్న క్రమంలో ఉన్నట్టుండి దీప తీవ్ర అస్వస్థతకు సోఫాలో పడిపోయింది. దాంతో సౌందర్య ఆందోళనకు గురై దీప.. దీప అంటూ కంగారుపడిపోయింది. నేను పోతే కార్తీక్ మోనితను పెళ్లి చేసుకొంటాడా.. నా పిల్లల జీవితం అంతా తండ్రికి దూరంగానే జరిగింది. అలాంటి నరకం నా పిల్లలకు వద్దు అంటూ దీప సోఫాలో కుప్పకూలిపోయింది.

చేజారుతున్న దీప అరోగ్యం

చేజారుతున్న దీప అరోగ్యం

దీప పరిస్థితి విషమిస్తున్న సమయంలో కార్తీక్ అక్కడికి వచ్చాడు. దీపను చూసి ఆవేదన చెందుతూ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పిల్లలు శౌర్య, హిమ కూడా ఏడుస్తూ తల్లి వద్ద కూర్చుండిపోయారు. దీప నోట్లో నీరు పోయడానికి కార్తీక్ ప్రయత్నిస్తే.. ఆ ప్రయత్నం సఫలం కాలేదు. సోమవారం మే 24 తేదీన ఏం జరుగబోతుందనే విషయం అత్యంత ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X