Karthika Deepam 2 May 24th: దీప మీద పగతో రగిలిపోతున్న నర్సింహ.. ఆలోచనలో పడ్డ కార్తీక్!

దీపకి చెప్పకుండా పాపని పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాడు. అది జోత్స్న, పారిజాతం చూస్తారు.దీపతో గొడవ పడుతుంది పారిజాతం. పాప తండ్రి స్థానంలో కార్తీక్ సంతకం పెట్టాడని తెలుసుకొని దీపతో గొడవపడతాడు నర్సింహ. నర్సింని జైల్లో పెట్టిస్తాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 24వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 53వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

పోలీస్ కేసు బావే పెట్టాడని తెలిసింది కదా ఇప్పుడేమంటావు అయినా deep విషయంలో అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటుంది జ్యోత్స్న. అసలు ఆ పోలీస్ కేసు నేనే పెట్టాలనుకున్నాను అంటుంది సుమిత్ర. నువ్వు వేరు, ఎందుకంటే నువ్వు దీప రెస్పాన్స్బిలిటీ తీసుకున్నావు కాబట్టి అలా చేసినా తప్పులేదు. కానీ బావ ఎందుకు అలా చేయాలి బావ పూర్తిగా మారిపోయాడు మమ్మీ,నాతో మాట్లాడటం కూడా తగ్గించేసాడు అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దశరద్ నీకు ఇలాంటి ఆలోచన వచ్చేలా ఎవరు చేశారో నాకు తెలియదు కానీ నువ్వు ఆలోచిస్తున్న విధానం తప్పు.

Karthika Deepam May 24th 2024 Episode Number 53 Here is full story

కార్తీక్ నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఒక విషయాన్ని దూరం నుంచి చూస్తే ఒకలా ఉంటుంది దగ్గరనుంచి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యు అని కూతురికి నచ్చచెప్తాడు. మరోవైపు పోలీస్ స్టేషన్ బయట ఉన్న శోభ గుట్టు గా ఉన్న కాపురాన్ని పోలీస్ స్టేషన్ వరకు లాక్కొచ్చారు అని అత్తపై కోప్పడుతుంది.

నా కొడుకుకి ఏమైనా జరిగితే ఊరుకుంటానా గంటలో రమ్మని చెప్పి వచ్చాను అంటుంది అనసూయ. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్తీక్ వాళ్ళు అక్కడికి వస్తారు. నీతో తర్వాత మాట్లాడుతాను ఇప్పుడు కేసుని విత్ డ్రా చేసుకుంటున్నాను అని ఎస్ఐకి చెప్తాడు కార్తీక్. అయితే అక్కడ సంతకం పెట్టు అంటాడు ఎస్సై. సంతకం పెట్టేముందు మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు ఒకసారి ఆలోచించుకోండి అని దీపతో చెప్తాడు కార్తీక్. సంతకం పెట్టమంటుంది దీప.

మోసం ముందు నిజాయితీ తలవంచుకోవడం మంచిది కాదు అంటూనే సంతకం పెడతాడు కార్తీక్. ఇదంతా చూస్తున్న నర్సింహ కోపంతో రగిలిపోతాడు నన్నే జైల్లో పెట్టిస్తావు కదా నీ సంగతి తేలుస్తాను అనుకుంటాడు. స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇప్పటికైనా కేసు నేను పెట్టించలేదని అర్థం చేసుకో అని అనసూయతో అంటుంది దీప. నువ్వు ఇంకేమీ మాట్లాడకు మా తమ్ముడు చాలా పెద్ద తప్పు చేశాడు అంటూనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనసూయ.

ఆ తర్వాత కార్తీక్ తో మాట్లాడుతూ మీరు నాకు మంచి చేస్తున్నాను అనుకొని అగ్గిలో ఆద్యం పోస్తున్నారు. మీరు నాకు సాయం చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళు దాన్ని మరోలా అనుకుంటున్నారు. నిజానికి నేను అందరికన్నా మీ వల్లే ఎక్కువగా బాధపడుతున్నాను ఎవరికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులలో నన్ను ఉంచకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప.

ఆ తర్వాత ఇంట్లో పని చేసుకుంటూ నా తమ్ముడు తప్పు చేశాడు అని అత్త ఎందుకంది నా విషయంలో నాన్న ఏమైనా తప్పు చేశాడా అని ఆలోచిస్తూ ఉంటుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర కార్తీక్ జరిగినదంతా చెప్పాడు అందుకే నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు నీ భర్తకి విడాకులు ఇచ్చేయ్ అంటుంది. అలా చేయలేనమ్మ అంటుంది దీప.

వాడు కట్టిన తాళి నీ మెడలో ఉంది కాబట్టి వాడు నీ మీద అధికారం చెలాఇస్తున్నాడు. విడాకులు ఇచ్చి ఆ తాళి వాడి మొహాన కొట్టు అంటుంది సుమిత్ర. మెడలో తాళి ఉంది కాబట్టి నాన్న ఎప్పుడు వస్తాడు అని నా కూతురు అడుగుతుంది అదే మెడలో తాళి లేకపోతే నాన్న ఎవరు అని అడుగుతుంది. ఆ ప్రశ్న నన్ను చంపేసే ప్రశ్న. అందుకే తాళి నా మెడలోనే ఉండాలి అంటుంది దీప. మరోవైపు దీప అన్న మాటలకి ఆలోచనలో పడతాడు కార్తీక్.

మా గురించి వేరే వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు, ఇకమీదట నేను ఇన్వాల్వ్ అవ్వకుండానే ఆమెకి సాయం చేయాలి అనుకుంటాడు. మరోవైపు దీప కార్తీక్ తో పోలీస్ స్టేషన్ కి రావటాన్ని భరించలేక పోతాడు నర్సింహా. అదే విషయాన్ని తల్లితో చెప్తాడు. నీకు ఒంటి మీద దెబ్బల కన్నా ఆ విషయమే ఎక్కువగా మండుతున్నట్లు ఉంది అంటుంది శోభ. ఆమెపై తల్లి కొడుకులిద్దరూ కోప్పడతారు.

దీప అంత పని చేస్తుందంటే అసలు ఊరే దాటనిచ్చే దాన్ని కాదు అంటుంది అనసూయ. దీప ఊరు దాటాక సంబంధం పెట్టుకోలేదు, సంబంధం పెట్టుకున్నాకే ఊరు దాటింది అంటాడు నర్సింహ. ఏమంటున్నావ్ రా అంటుంది అనసూయ. నిజం నాకు తెలియదమ్మా కానీ దాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది అంటాడు నర్సింహ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X