Karthika Deepam May 24th Episode: మోనిత విషపు నవ్వుతో.. కార్తీక్, దీపలపై మళ్లీ కుట్రలు

డాక్టర్ కార్తీక్‌ను పదేళ్లుగా ప్రేమిస్తున్న డాక్టర్ మోనితకు ఆమె పని మనిషి ప్రియమణికి మధ్య మరోసారి గట్టిగానే వాగ్వాదం జరిగింది. ప్రియమణి సూటిపోటి మాటలతో మోనితను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇక కార్తీక్‌ను నీవు మరిచిపోవాల్సిందే అనే విధంగా తన చాతుర్యాన్ని బయటపెట్టుకొన్నది. ఈ సందర్భంగా 1047 ఎపిసోడ్‌లో వారిద్దరి మధ్య ఏమి జరిగిందంటే..

కావాలనే ఉప్పు వేయలేదని

కావాలనే ఉప్పు వేయలేదని

డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటున్న మోనిత.. ఏమిటి దేంట్లో కూడా ఉప్పులేదు అంటూ గట్టిగా అరిచింది. దాంతో ప్రియమణి స్పందిస్తూ. నేనే కావాలని ఉప్పు వేయలేదు అంటూ జవాబిచ్చింది. కావాలనే వేయలేదా అంటూ మోనిత ప్రశ్నిస్తే.. మీరు అడుగుతారో లేదోనని చూద్దామని వేయలేదు అంటూ ప్రియమణి ఏదో పట్టింపులేనట్టుగా జవాబిచ్చింది.

పిచ్చి పిచ్చిగా ఉందా?

పిచ్చి పిచ్చిగా ఉందా?

ప్రియమణిపై కోపం ప్రదర్శిస్తూ.. నీకు ఏమైంది అంటూ కామెంట్ చేసింది. నాకు కాదు.. మీకే ఏదో అయింది అంటూ ప్రియమణి బదులిచ్చింది. దాంతో మరింత కోపం పెంచుకొన్న మోనిత.. ఏమిటి. పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ వార్నింగ్ ఇచ్చింది. దాంతో నీకే కార్తీక్ అయ్యా అంటే పిచ్చి ప్రేమ ఉంది కదా.. ఆయన ప్రేమలో మునిగి టేస్ట్ ఉందా? లేదా అని చెబుతారో లేదో టెస్ట్ చేశాను అని ప్రియమణి పేర్కొన్నది.

ఇలాంటి ప్రయోగాలు చేస్తే

ఇలాంటి ప్రయోగాలు చేస్తే

ప్రియమణి మాటలకు మరింత రెచ్చిపోయిన మోనిత.. ఇలాంటి ప్రయోగాలు నాపై చేయకు. ఈ సారి ఇలాంటి ప్రయోగాలు చేస్తే నిన్ను అంటూ ఏదో అనడానికి ప్రయత్నించగా... వద్దులే అమ్మా.. అంటూ కామెంట్ చేసింది. మీరు ఏదైనా అంటారు కానీ.. ఏమీ చేయరు.. చేయలేరని నాకు తెలుసు అమ్మా అంటూ మోనితను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.

మోనిత మరోసారి సహనం

మోనిత మరోసారి సహనం

ఇక అంతటి వారిమధ్య వాగ్వాదం ఆగలేదు.. నన్ను ఇరిటేట్ చేయకు అంటూ మోనిత మరోసారి సహనం కోల్పోయింది. దాంతో ఉప్పు వేశాను.. పప్పు వేయాలా? అంటూ అడిగితే.. ఏదో ఒకటి ఏడువు అంటూ మోనిత అసహనాన్ని వ్యక్తం చేసింది. కూర వేయాలా అంటే... తగలెట్టు .. అని మోనిత సమాధానం చెప్పింది. మీరు ప్రదర్శించే కోపం నా మీద కాదంటూ ప్రియమణి తెలివిగా మాటలతో తప్పించుకొన్నది.

అసహనంతో ఉన్న మోనిత‌ను

అసహనంతో ఉన్న మోనిత‌ను

అసహనంతో ఉన్న మోనిత‌ను మరింత రెచ్చగొట్టే విధంగా.. కార్తీక్ అయ్యా ఈ మధ్య ఇటు రావడం లేదు కదా.. నేనొక మాట చెప్పానా? మనం సినిమాలు ఎప్పుడు వెళ్తాం. మనం అంటే మీలాంటి వాళ్లు బిజీగా ఉండేవాళ్లు.. సినిమా హిట్ అయినప్పుడు.. సినిమాకు టాక్ బాగా వచ్చినప్పుడు మాత్రమే వెళ్తారు. అలాగే.. ఏమీ తోచనప్పుడు.. మీతో సలహా తీసుకోవాలనుకొనప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తాడు అంటూ ప్రియమణి తన ప్రతాపం చూపించింది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
మోనిత తన విశ్వరూపం

మోనిత తన విశ్వరూపం

ఇంకా తన సంభాషణను పొడిగిస్తూ. కార్తీక్ వచ్చినప్పుడే మాట్లాడండి.. పోట్లాడండి.. రానప్పుడు ఇలా నీరసంగా కూర్చోకండి.. సరేనా అంటూ మోనితలో అసహనాన్ని రెచ్చగొట్టింది. ఇక నేను పెరుగు తెస్తానంటూ ప్రియమణి అక్కడి నుంచి వెళ్లిపోగానే మోనిత తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.

క్రూరపు నవ్వుతో.. కుట్రలు

క్రూరపు నవ్వుతో.. కుట్రలు

తనలో తానే మాట్లాడుకొంటూ పిచ్చి ప్రియమణి. నేను సైలెంట్‌గా ఉన్నది ఎందుకో తెలుసా? చెవులు పగిలిపోయేలా రీసౌండ్ వినిపించాలని అంటూ ఓ క్రూరపు నవ్వుతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇలా ప్రియమణి, మోనిత మధ్య వాగ్వాదం ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X