Karthika Deepam May 24th Episode: మామ చేతులు పట్టుకొన్న డాక్టర్ బాబు.. అలా తల వంచిన డాక్టర్ బాబు!
టాప్ రేటింగ్ డైలీ సీరియల్ కార్తీకదీపం సీరియల్‌లో అనూహ్యమైన సంఘటనలు ప్రేక్షకులకు భావోద్వేగాలను పంచుతున్నాయి. దీప విషయంలో పలుమార్లు వాగ్వాదాలకు దిగిన కార్తీక్ బాబు, మామ మురళీకృష్ణ అప్యాయంగా పలకరించుకొనే సన్నివేశాలు ఎమోషనల్‌గా మారాయి. అయితే మురళీకృష్ణను ఎప్పుడూ కోపగించుకొనే కార్తీక్ బాబు.. తన మామ చేతులు ఎందుకు పట్టుకొన్నారు.. మే 24 తేదీన ప్రసారమయ్యే 1047వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
Recommended Video

దీపపై అనుమానాలన్ని
విహారితో దీపకు అక్రమ సంబంధం అట్టగట్టి.. రకరకాల ఆరోపణలు చేస్తూ పదేళ్లు దూరం చేసుకొన్న కార్తీక్‌కు అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరిపిస్తున్నాయి. తన స్నేహితుడు గోవర్దన్ హాస్పిటల్‌లో తులసి భర్తకు సంతానం కలుగదని తెలిసిన విషయంతో దీపపై ఉన్న అనుమానాలన్ని కార్తీక్‌కు తొలిగిపోయాయి.

కార్తీక్ ప్రవర్తనను చూసి...
దీపను పదేళ్లుగా నరకం చూపించానంటూ తనకు తాను పశ్చత్తాపం చెందుతూ కార్తీక్ ఆవేదన గురయ్యాడు. దీప వద్దకు చేరుకొని తన తప్పును సరిదిద్దుకోవడానికి కారులో శ్రీరాంనగర్ బస్తీకి వెళ్తుండగా మధ్యలో మామ మురళీకృష్ణ టూవీలర్‌ను తోసుకొంటూ కనిపించాడు. మురళీకృష్ణ పడుతున్న కష్టాలను చూసి తన కారును ఆపి కార్తీక్ ఆయనకు సహాయం చేశాడు. కార్తీక్ ప్రవర్తనను చూసి మురళీ కృష్ణ షాక్ గురయ్యాడు.

స్వయంగా బండిని తోసుకొంటూ..
కార్తీక్‌తో మురళీ కృష్ణ మాట్లాడుతూ.. దీప వద్దకు వెళ్దామనే తొందరలో పెట్రోల్ కొట్టించుకోలేదు. పంపు దగ్గరే నేను పెట్రోల్ పోయించుకొని వస్తాను అంటూ చెప్పాడు. అయితే కార్తీక్ స్పందిస్తూ.. బండిని పక్కన పెడుదాం అంటూ వెహికిల్‌ను స్వయంగా తోసుకంటూ ముందుకెళ్లాడు. వారణాసి పెట్రోల్ పోయించుకొని టూ వీలర్‌ను ఇంటికి తీసుకొస్తాడు అంటూ కార్తీక్ అన్నాడు.

చేతులు జోడించి క్షమించమంటూ...
దాంతో మరి నేను అంటూ మురళీ కృష్ణ అనగానే.. మన కారులో వెళ్దామని కార్తీక్ చెప్పాడు. దాంతో మురళీకృష్ణ మరోసారి షాక్ గురికావడం జరిగింది. బాబూ.. అంటూ ఓ రకమైన ఫీలింగ్‌తో ఉండగానే.. ఉన్నట్టుండి మురళీకృష్ణ చేతులను కార్తీక్ పట్టుకొని క్షమించమని అడిగాడు. దాంతో ఒక్కసారిగా ఏమిటిది బాబు అంటూ మురళీ ఆశ్చర్యపోయాడు.

మీ పెద్దల్లుడిని అంటూ
కార్తీక్ తీరును చూసి.. ఆశ్చర్యపోయిన మురళీ కృష్ణ ఏం చేస్తున్నారు బాబు అనే లోపే.. డాక్టర్ బాబు తన చేతులను తీసుకొని తలకు పెట్టుకొని నమస్కరించారు. ఇదేంటి బాబు అనగానే... మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచింది కార్తీక్ ఎమోషనల్‌గా కనిపించారు. రండి మామయ్య ఇంటికి వెళ్ధామని చెప్పారు. మీరు నన్ను మామయ్య అని.. నేను మీ పెద్దల్లుడిని మామయ్య.. రండి.. అంటూ వాటర్ బాటిల్ ఇచ్చి నీళ్లు తాగించాడు. కారులో ఎక్కించుకొని శ్రీరాంనగర్ బస్తీకి వెళ్లబోయారు.

దీపకు ఎలాంటి ప్రమాదం రానివ్వను...
ఇలాంటి సన్నివేశాల మధ్య దీప బాగానే ఉందా? అంటూ మురళీ కృష్ణ అడిగితే.. నేను ఉండగా దీపకు ఏమీ కానివ్వను అని కార్తీక్ అన్నాడు. మళ్లీ దీప ఆరోగ్యం ప్రమాదంలో ఉందా అంటే.. ప్రమాదం గురించి ఆలోచించకు.. ఆ సంగతి మరిచిపో. దీప సుఖంగా సంతోషంగా ఉంటుంది అని కార్తీక్ సమాధానం ఇచ్చాడు. దాంతో ఏంటిది? ఆ డాక్టర్ బాబేనా? నా కూతురు సుఖంగా సంతోషంగా ఉంటుందని అంటున్నాడంటూ ఆలోచనలో పడిపోయాడు. అప్పుడే కారు ఎక్కండి మామయ్య అంటూ కార్తీక్ అంటూ దీప వద్దకు వెళ్లేందుకు కారులో ప్రయాణమయ్యారు.


Click it and Unblock the Notifications











