Karthika Deepam 2 May 25th: ఇంట్లో చిచ్చు పెట్టిన పక్కింటి చిలక.. నర్సింహ సహనానికి పరీక్ష పెడుతున్న శోభ!
దీపతో గొడవ పడుతుంది పారిజాతం. పాప తండ్రి స్థానంలో కార్తీక్ సంతకం పెట్టాడని తెలుసుకొని దీపతో గొడవపడతాడు నర్సింహ. నర్సింని జైల్లో పెట్టిస్తాడు కార్తీక్. కానీ ఫోర్స్ చేయడం వలన అతడిని విడిపిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 25వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 54వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కార్తీక్ దీప ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి రావడాన్ని భరించలేక పోతాడు నర్సింహ. అదే విషయాన్ని తల్లితో చెప్తాడు. నీకు తగిలిన దెబ్బలు కంటే ఆ విషయమే నీకు ఎక్కువగా మండుతున్నట్లుంది అంటుంది శోభ. ఆమెపై కోప్పడతాడు నర్సింహా. కొడుకుని రెచ్చ రెచ్చగొట్టొద్దు అంటుంది అనసూయ. ఆ దీప గురించి నేను ముందే చెప్పాను కానీ మీరే దాని జోలికి వెళ్లొద్దు అని చెప్పారు, ఇప్పుడు అది మన జోలికి రావటం కాదు ఏకంగా జైలుకి పంపించే వరకు వెళ్ళింది.

వీధిలో వాళ్ళందరూ చూస్తుండగా తీసుకువెళ్లి నిన్ను జీపులో కూర్చోబెట్టారు అయినా నీకు పౌరుషం లేదా అంటూ మొగుడిని రెచ్చగొడుతుంది. కోపంతో శోభ మీద చెయ్యి ఎత్తుతాడు నర్సింహా. నీ ప్రతాపం అంతా నా మీదే ఆ దీప ని మాత్రం ఏమీ చేయలేవు అది ఈరోజు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టింది రేపు నన్ను పెడుతుంది, ఈ ఆపద నుంచి నన్ను మా అమ్మ మాత్రమే కాపాడగలదు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శోభ. ఇదంతా ఆ దీప వల్లే అని కోపంతో రగిలిపోతాడు నర్సింహ.
అదంతా పక్కన పెట్టు రేపు మీ మామయ్య సంవత్సరికం నువ్వే పెట్టాలి అంటుంది అనసూయ. కన్న కూతురు ఉంది కదా అది పెట్టుకుంటుందిలే అంటాడు నర్సింహా. కన్న కూతురు కాదు అని నిజం చెప్పాలనుకుంటుంది కానీ తమ్ముడికి ఇచ్చిన మాట గుర్తు వచ్చి ఆగిపోతుంది అనసూయ. దానికి గుర్తుందో లేదో అనుకుంటుంది. మరోవైపు తండ్రి ఫోటో శుభ్రం చేస్తూ ఈరోజు తాతయ్యకి సంవత్సరీకం నేను గుడికి వెళ్తాను నువ్వు ఇంట్లోనే ఉండు అని కూతురుకి చెప్తుంది దీప.
తాతయ్య చచ్చిపోయాడా మళ్లీ మన దగ్గరికి రాడా అంటుంది శౌర్య. తాతయ్య చనిపోలేదు ఒక వ్యక్తి నిర్లక్ష్యం గా కారు డ్రైవ్ చేసి తాతయ్యని చంపేశారు అంటుంది దీప. చంపేశారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శౌర్య. లేదు ఏదో ఆలోచనలో ఉండి అలా అనేసాను అదేమీ పట్టించుకోకు అనే కూతురికి చెప్తుంది దీప కానీ మనసులో మాత్రం నీ ఫ్రెండే మీ తాతయ్యని చంపేశాడు అనుకుంటుంది. కూతురికి చెప్పి గుడికి బయలుదేరుతుంది దీప. ఆ తర్వాత ఒక్కర్తే ఉన్న శౌర్య సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళుతుంది.

అక్కడ బంటు ని చూసి నిన్ను పంపించేసామన్నారు మళ్ళీ ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. ఎప్పుడో వచ్చాను గాని అమ్మగారు కనిపించడం లేదు నువ్వు చూసావా అని అడుగుతాడు బంటు. తన రూమ్ లోనే ఉంటుంది ఉండు చూస్తాను అంటూ ఆ గదికి వెళ్లి చూసేసరికి అక్కడ ఫేస్ మాస్క్ పెట్టుకున్న పారిజాతాన్ని చూసి జడుచుకుంటుంది శౌర్య. పరిగెత్తుకొని బంటు దగ్గరికి వచ్చి అక్కడ దెయ్యం ఉంది చూపిస్తాను రా అంటూ బంటును కూడా తీసుకెళ్తుంది.
బంటు కూడా భయపడి వెనక్కి వచ్చేస్తాడు. వాళ్ళ కంగారు చూసి విషయం తెలుసుకున్న శివ నారాయణ ఆ గదిలోకి వెళ్తాడు. భార్యని ఆ వేషంలో చూసి నిన్ను చూసి వాళ్ళు నిజంగా దెయ్యం అనుకున్నారు అని భార్యని ఆటపట్టించి శౌర్య ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ నారాయణ. తర్వాత పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటారు బంటు, పారిజాతం.
మరోవైపు దెబ్బలతో ఉన్న కొడుకుని పనిలోకి వెళ్లొద్దు అంటుంది అనసూయ. వెళ్లకపోతే డబ్బులు ఎలా వస్తాయి అంటూ శోభ గొడవకి దిగుతుంది అంతలోనే పక్కింటి చిలక కాఫీ పొడి కోసం వచ్చి జాగ్రత్తగా ఉండు నువ్వు రెండో పెళ్ళానివంట కదా, అసలు కొందరైతే మీకు పెళ్లి కాలేదు అనుకుంటున్నారు అంటుంది. చిలక అక్క నువ్వు కాఫీ కి వచ్చావా లేదంటే కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చావా అని కోప్పడతాడు నర్సింహ.

నిజం మాట్లాడితే అలాగే ఉంటుంది అని నర్సింహ తో చెప్పి జాగ్రత్తగా ఉండు మొదటి పెళ్ళాం స్టీల్ పెళ్ళాం లాంటిది నువ్వు అరిటాకు లాంటి దానివి అని శోభకి మళ్ళీ జాగ్రత్త చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చిలక. ఆ మాటలకి కోపంతో పగిలిపోయిన శోభ భర్తని రెచ్చగొట్టేలాగా మాట్లాడి భర్తని చేతకాని వాడివి అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కోపంతో రగిలిపోయిన నర్సింహ ఆ దీప ని వదిలిపెట్టేది లేదు నన్ను వదిలేయ్ అని నాకు కాళ్ళు పట్టుకునే లాగా చేస్తాను అని శపధం చేస్తాడు.
మా ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసావు నా ఉసురు తగిలి పోతావు అని దీపకి శాపం పెడుతుంది అనసూయ. మరోవైపు తండ్రి కి శ్రాద్ధ కర్మలు నిర్వహించి ఆ పిండాన్ని కాకులకు పెడుతుంది దీప. కాకులు ఎంతకీ రాకపోవటంతో అక్కడికి వచ్చిన ఒక స్వామీజీ బతికున్న వాళ్ళకి పిండం పెడితే కాకులు ఎలా ముట్టుకుంటాయి అని అడుగుతాడు.ఒకసారిగా షాక్ అవుతుంది దీప.తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











