Karthika Deepam May 25th Episode: ఆ నరకం వద్దు.. భర్త కార్తీక్‌ను చివరి కోరిక కోరిన దీప!

బుల్లితెర ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్న కార్తీకదీపం సీరియల్‌లో ఎమోషనల్ డ్రామా మరోసారి ఆకట్టుకొన్నది. చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న దీపను చూసి కుటుంబ సభ్యులు ఆందోళన, డాక్టర్ బాబు పశ్చాత్తాపం లాంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశాయి. కార్తీక దీపం సీరియల్‌లో 1048 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

నేను చనిపోతే మోనితను పెళ్లి చేసుకొంటాడా?

నేను చనిపోతే మోనితను పెళ్లి చేసుకొంటాడా?

అత్తయ్యా.. నేను చనిపోతే ఆయన మోనితను పెళ్లి చేసుకొంటాడా? నా పసితనం అంతా సవతి తల్లి పెంపకంలోనే గడిచింది. ఆ నరకం నా పిల్లలకు ఉండకూడదు. నా పిల్లలకు వద్దు అంటూ దీప ఆవేదనకు గురైంది. అయితే దీప ఆవేదనను తగ్గించే ప్రయత్నం చేస్తూ.. అలాంటిదేమీ జరగదు. నీకు ఏం కాదు అంటూ సౌందర్య సర్దిచెప్పబోయింది. కానీ దీప ఆరోగ్యం మరింత క్షీణించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం కనిపించింది.

నీకు ఏమీ కాదంటూ ధైర్యం చెప్పిన సౌందర్య

నీకు ఏమీ కాదంటూ ధైర్యం చెప్పిన సౌందర్య

అయితే తన పిల్లలను దగ్గరగా తీసుకోని ఆప్యాయంగా ప్రేమను కురిపించబోయింది. కానీ ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో మెల్లమెల్లగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయేలా కనిపించింది. దాంతో నీకు ఏమీ కాదంటూ సౌందర్య సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అంతలోనే కార్తీక్, మురళీ కృష్ణ శ్రీరాంనగర్ బస్తీలోని దీప ఇంటికి చేరుకొన్నారు.

దీపకు నరకం చూపించా... కార్తీక్ బాబు..

దీపకు నరకం చూపించా... కార్తీక్ బాబు..

దీప వద్దకు వెళ్తూ.. కార్తీక్ తన మనసులో మదనపడటం ప్రారంభించాడు. దీపకు నరకం చూపించాను. నా తప్పును ఎలా ఒప్పుకోవాలి. ఇప్పుడు దీపను ఎలా ఫేస్ చేయాలి. చాలా అవమానించాను అంటూ ఇంట్లోకి అడుగుపెట్టబోయే సమయంలో దీప.. దీప.. అమ్మా అమ్మా అంటూ ఇంట్లోని పిల్లలు, సౌందర్య కేకలు వినిపించాయి.

దీప పరిస్థితి విషమంగా మారడంతో

దీప పరిస్థితి విషమంగా మారడంతో

ఇంట్లో కేకలు వినిపించడంతో పరుగున వచ్చి దీపను కార్తీక్ ఒడిలోకి తీసుకొన్నారు. నిన్ను క్షమించమని అడిగే అవకాశాన్ని కూడా దేవుడు ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. ఎందుకు వాయిదా వేస్తున్నాడో.. నాకు నిజం తెలిసిందనే విషయం తెలిస్తే అదే.. నిన్ను సంజీవనిలా బతికిస్తుంది అంటూ కార్తీక్ తనలో తాను మదనపడిపోయాడు. అయితే దీప పరిస్థితి విషమంగా మారే పరిస్థితి కనిపించడంతో ఆమెను గోవర్దన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

నాకు ఆఖరి క్షణాలు ఇవే డాక్టర్ బాబు..

నాకు ఆఖరి క్షణాలు ఇవే డాక్టర్ బాబు..

హాస్పిటల్‌లో మెల్లగా కళ్లు తెరిచిన దీపను చూసి అందరూ ఆందోళనపడిపోయారు. దీప నీకు ఏం కాదు.. ధైర్యంగా ఉండు.. దేవుడు నీతోపాటు ఉన్నారు.. నీకేం కాదు అంటూ దీపకు తండ్రి, అత్త ధైర్యం చెప్పారు. ఆ సమయంలో కార్తీక్‌ను ఉద్దేశించి..నేను వెళ్లిపోతున్నాను.. డాక్టర్ బాబు.. ఆఖరి క్షణంలోకి వచ్చానని తెలిసిపోతున్నది. పిల్లలు జాగ్రత్త అంటూ దీప భర్తతో అన్నారు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
నా చివరి కోరిక అంటూ..

నా చివరి కోరిక అంటూ..

భర్త కార్తీక్‌తో చివరి కోరిక అంటూ ఓ విషయాన్ని అడిగింది. నన్ను నమ్ముతున్నారా? నమ్మానని చెబితే ఆనందంగా ప్రాణాలు వదిలేస్తాను అంటూ దీప కంటతడి పెట్టుకొన్నది. దీప ప్రశ్నకు సమాధానం చెప్పబోతుండగానే.. డాక్టర్ గోవర్ధన్ అక్కడికి వచ్చి.. పేషెంట్ కండిషన్ తెలియదా? అక్కడే ఆపేశారు.. అంటూ దీప స్ట్రెచ్చర్ ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X