Karthika Deepam May 25 Episode: దీపమ్మను చంపకండమ్మా.. డాక్టర్ మోనిత పైశాచికత్వానికి ప్రియమణి షాక్!

కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ మోనిత ఆమె వంట మనిషి మధ్య ఎప్పటిలానే మరోసారి వాగ్వాదం జరిగింది. మోనిత పైత్యాన్ని కడిగిపడేసే పనిమనిషి మరోసారి ఆమెలోని పైశాచికత్వాన్ని చూసింది. దీప హాస్పిటల్‌లో ఉందనే విషయం తెలుసుకొని ఆనందంలో మునిగిన మోనితను చూసి ప్రియమణి భయపడిపోయింది. 1048 ఎపిసోడ్‌లో మోనిత ఎలాంటి కుట్రలకు తెరలేపే ప్రయత్నం చేసిందంటే..

ప్రియమణికి మోనిత వార్నింగ్

ప్రియమణికి మోనిత వార్నింగ్

అరగంట క్రితం కాఫీ చెబితే ఇప్పుడా తెచ్చేది.. నీకు బద్దకం ఎక్కువైందే అంటూ మోనిత వార్నింగ్ ఇస్తే.. బద్దకం కాదమ్మా.. పని ఎక్కువైంది. ఒక్కదాన్నే కదా.. అన్నీ చూసుకోవాలి కదా.. ముందు కాఫీ తాగండి.. మళ్లీ చల్లారింది ఇచ్చారు అంటారు అని ప్రియమణి సమాధానం ఇచ్చింది.

నేను నీతోపాటు హాస్పిటల్‌కు వస్తా..

నేను నీతోపాటు హాస్పిటల్‌కు వస్తా..

కాఫీ తాగిన మోనిత.. ఇక నేను హాస్పిటల్‌కు వెళ్తున్నాను. ఎప్పుడు వస్తానో ఫోన్ చేసి చెబుతాను అంటూ మోనిత చెప్పింది. అయితే అమ్మా అంటూ ప్రియమణి నసుగుతూ.. నేను నీతోపాటు హాస్పిటల్‌కు వస్తాను అంటూ చెప్పింది. అయితే హాస్పిటల్‌లో నీతో నాకు పని ఏమిలేదు. నీవు ఇక్కడే ఉండూ అంటూ మోనిత అంటే.. కానీ నీతో నాకు పని ఉందమ్మా అంటూ ప్రియమణి సమాధానం చెప్పింది.

తిండి తగ్గిస్తే.. నలత ఉండదంటూ..

తిండి తగ్గిస్తే.. నలత ఉండదంటూ..

అయితే ప్రియమణి నసను భరించలేననే విధంగా ముఖం పెట్టిన మోనిత.. సరే ఏంటో చెప్పు అంటూ సైగ చేసింది. అదేనమ్మా.. ఈ మధ్య ఒంట్లో నాకు నలతగా ఉంటుంది. ఒకసారి మీతో హాస్పిటల్‌కు వచ్చి చెక్ చేపించుకొందామని అనుకొంటున్నా అంటూ ప్రియమణి చెప్పింది. దాంతో నిన్ను చూస్తే దుక్కలా ఉన్నావు.. నీకు నలతగా ఉండటం ఏమిటే. పని పేరుతో మూడు పూటల తింటున్నావు.. అది తగ్గించు అని మోనిత సెటైర్ వేసింది. మోనిత మాటలకు స్పందిస్తూ.. మీకు అలా అర్ధమైందా అంటూ మూతి తిప్పింది.

డాక్టర్ భారతీ కాల్‌తో మోనిత ముఖంలో ఆనందం

డాక్టర్ భారతీ కాల్‌తో మోనిత ముఖంలో ఆనందం

ఇంతలోనే డాక్టర్ భారతీ నుంచి మోనితకు కాల్ వచ్చింది. ఈవిడ గారు నాకెందుకు ఫోన్ చేసింది. నన్ను ప్రేమోన్మాది.. గొంగుర కట్ట అంటూ తిట్టిన భారతీ ఎందుకు కాల్ చేసిందో.. కనుక్కొందాం అంటూ మోనిత్ ఫోన్ కాల్ అటెండ్ చేసింది. ఫోన్ మాట్లాడుతూ.. అవునా.. అరేరే అంటూ తెగ సంతోషపడిపోయింది. అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ ఆనందంలో మునిగిపోయింది.

నిన్ను చూస్తే నాకు ఎదో భయం అమ్మా..

నిన్ను చూస్తే నాకు ఎదో భయం అమ్మా..

డాక్టర్ మోనిత తట్టుకోలేని ఆనందాన్ని చూసి ఏమైందమ్మా అంటూ ప్రియమణి అడిగితే.. దీపను హాస్పిటల్‌లో చేర్పించారట. నేను వెంటనే వెళ్లాలి అంటూ పరుగెత్తబోతే.. ప్రియమణి ఆపింది.. ఏంటే అని మోనిత అనగానే.. దీపమ్మ హాస్పిటల్‌ చేరిందనగానే మీ ముఖంలో ఆనందం కనిపిస్తున్నది. నాకు ఎందుకో భయంగా ఉంది..దయచేసి దీపమ్మను చంపకండమ్మా.. అంటూ ప్రియమణి ప్రాధేయపడింది.

మంచి ప్లాన్ నీవే ఇచ్చావు అంటూ

మంచి ప్లాన్ నీవే ఇచ్చావు అంటూ

ప్రియమణి మాటలకు మళ్లీ విషపు నవ్వు నవ్వుతూ.. ప్రియమణి నాకు ఇప్పటి వరకు ఆ ఆలోచన రాలేదు. కానీ నీవే ఇచ్చావు అంటూ తెగ ఆనంద పడిపోయింది. దాంతో తాను ఎందుకు అలా అన్నాను అని మనసులో అనుకొంటూ ప్రియమణి తలబాదుకొన్నది. మోనిత ఏలాంటి కుట్ర చేస్తుందనే భయం ప్రియమణిలో కనిపించింది.

Recommended Video

Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Filmibeat Telugu
మోనితను రఫాడిన మురళీకృష్ణ

మోనితను రఫాడిన మురళీకృష్ణ

అయితే ఆనందంలో హాస్పిటల్‌కు చేరుకొన్న డాక్టర్ మోనితను చూడగానే సౌందర్య, మురళీకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారు. కార్తీక్ ఎక్కడంటూ అడిగితే.. నా కూతురు చూడటానికి వచ్చావా? కార్తీక్‌ను చూడటానికి వచ్చావా అంటూ మోనితను చూసి మురళీకృష్ణ ఇష్టం వచ్చినట్టు అరిచేశారు. దాంతో ఏం చేయాలో తెలియక.. కూల్ బాబాయ్ అంటూ సమాధానం ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X