Karthika Deepam నీలాంటి మహమ్మారి నన్ను ఏం చేయలేకపోయింది.. గెట్ అవుట్.. మోనితకు దీప మాస్టర్ స్ట్రోక్!

కార్తీక దీపం సీరియల్‌లో దీపను చంపేందుకు కంకణం కట్టుకొన్న డాక్టర్ మోనిత మరోసారి కుట్రలకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది. తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరిన దీప వద్దకు డాక్టర్ భారతితో కలిసి వెళ్లింది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న దీపను మరింత కుంగదీసేందుకు ప్రయత్నించిన మోనితకు గట్టి షాక్ ఇచ్చింది. 1049 ఎపిసోడ్‌లో జరిగిన విషయాలు మీ కోసం..

దీప ధైర్యంగా ఉన్నావంటూ..

దీప ధైర్యంగా ఉన్నావంటూ..

బెడ్‌పై మగత నిద్రలో ఉన్న దీపను డాక్టర్ భారతీ లేపగా ఆమె నిద్రలేచింది. చూడగానే ఎదురుగా ఉన్న మోనితను చూసి కాస్త నవ్వింది. ఎలా ఉందని డాక్టర్ భారతీ అడిగితే.. ఇంటికి ఎప్పుడు వెళ్లవచ్చు.. రేపా? ఎల్లుండా? అని దీప అడిగింది. దాంతో గుడ్ చాలా ధైర్యంగా ఉన్నావు అంటూ డాక్టర్ భారతీ కామెంట్ చేసింది.

మోనితకు దీప షాక్

మోనితకు దీప షాక్

ఇక పక్కనే ఉన్న మోనితను చూస్తూ.. డాక్టర్ భారతీ గారు.. డాక్టర్ బాబు అదే మా ఆయనను కాస్త పిలుస్తారా? చూడాలనిపిస్తుంది అని దీప అడిగింది. దాంతో సరే అంటూ భారతీ అక్కడి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో మోనిత కల్పించుకొంటూ.. దీప ఎలా ఉన్నావు.. భయం వేయడం లేదా అని అడిగింది. ఇలాంటివి నన్ను ఏం చేస్తాయి.. నీలాంటి మహమ్మారి నన్ను ఏమి చేయలేకపోయింది అంటూ గట్టిగా మాటలతో స్ట్రోక్ ఇచ్చింది.

నేను బతికి ఉండగా నీకు ఆ ధైర్యం..

నేను బతికి ఉండగా నీకు ఆ ధైర్యం..

దీప మాటలకు కంగారు పడిపోయిన మోనిత గుడ్ అని అనింది. నేను చనిపోతే ఓ క్షణం ఆలస్యం చేయకుండా మా ఆయనతో తాళి కట్టించుకొంటావు. అందుకే నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. నేను బతికి ఉండగా నీకు అంత ధైర్యం రాలేదు కదా?? అంటూ దీప మళ్లీ క్లాస్ పీకింది.

నిండు నూరేళ్లు బతకాలి అంటూ ఓవరాక్షన్

నిండు నూరేళ్లు బతకాలి అంటూ ఓవరాక్షన్

ఇక కార్తీక్ ఆ గదిలోకి వస్తున్నట్టు గమనించిన మోనిత.. నాటకం మొదలుపెట్టింది. నీవు బతకాలి దీప.. నిండు నూరేళ్లు బతకాలి. నా కోసం కాకపోయినా నీ భర్త కోసమైన బతకాలి. మీ ఇద్దరు ఆదర్శ దంపతుల మాదిరిగా కలకాలం వర్ధిల్లాలి అని మోనిత ఓవరాక్షన్ మొదలుపెట్టింది. దానికి థ్యాంక్స్ అంటూ దీప చెప్పింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మోనిత గెట్ అవుట్ అంటూ దీప..

మోనిత గెట్ అవుట్ అంటూ దీప..

మోనిత దొంగ నాటకాన్ని గమనించిన దీప.. నీ నోట ఆ మాటలు వింటే దెయ్యాలు ఆశీర్వదించినట్టు ఉంది అంటూ మళ్లీ స్ట్రోక్ ఇచ్చింది. అంతలోనే కార్తీక్ గదిలోకి రావడంతో.. మోనిత గెట్ అవుట్.. మా ఆయనతో మాట్లాడాలి అంటూ దీప షాకిచ్చింది. దాంతో దీప ధైర్యంగా ఉంది.. త్వరలోనే కోలుకొని తిరిగి వస్తున్నది అంటూ మోనిత అనేసి అక్కడి నుంచి బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X