Karthika Deepam May 26th Episode: మోనిత విషప్రయోగం కుట్ర బట్టబయలు.. కపట నాటకానికి తెర!

తెలుగు బుల్లితెరపై రోజు రోజుకు అత్యంత ప్రేక్షకదారణను సొంతం చేసుకొంటున్న కార్తీకదీపం సీరియల్‌లో దీప దుర్మార్గాలు బయట పడే పరిస్థితి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన దీప ఆపరేషన్ థియేటర్‌లో ఉండగా డాక్టర్ మోనిత హాస్పిటల్‌కు చేరుకొన్నది. ఆమెను చూడగానే దీప తండ్రి మురళీకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయి చెడామడా తిట్టేశాడు. ఈ సందర్భంగా 1049 ఎపిసోడ్‌లో చోటుచేసుకొన్న సంఘటనలు ఏమిటంటే..

నేను కూడా డాక్టర్‌నే అంటూ మోనిత

నేను కూడా డాక్టర్‌నే అంటూ మోనిత

మురళీకృష్ణ కోపగించుకోవడంతో అక్కడి నుంచి తప్పుకొన్న డాక్టర్ మోనిత.. డాక్టర్ గోవర్ధన్, భారతీ, కార్తీక్ ఏదో తీవ్రంగా చర్చించుకొంటున్న సమయంలో వారివద్దకు చేరుకొన్నది. ఏం జరుగుతున్నదంటూ జోక్యం కలిగించుకోబోయింది. అయితే మోనితను పెద్దగా పట్టించుకోకుండా తమలో తాము మాట్లాడుకొంటుంటే.. హాలో భారతీ.. నేను కూడా డాక్టర్‌నే. కాస్త గుర్తించండి అంటూ వారి చర్చల్లోకి దూరింది.

దీపకు స్లో పాయిజన్ ఇంజెక్షన్

దీపకు స్లో పాయిజన్ ఇంజెక్షన్

అయితే డాక్టర్ మోనిత జోక్యాన్ని గుర్తించిన డాక్టర్ భారతీ.. అంతా మొదటి నుంచి చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. పదేళ్ల క్రితం దీపకు ఎవరో ఒకరు స్లో పాయిజన్ ఇంజెక్షన్ చేశారు అని చెప్పగానే.. గతంలో తాను చేసిన దుర్మార్గాన్ని గుర్తు చేసుకొన్నారు. కనుగుడ్లు తేలేస్తూ ముఖంలోని హావభావాలు కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నించారు.

దీపకు డయాలిసిస్ తప్పనిసరి

దీపకు డయాలిసిస్ తప్పనిసరి

దీపకు ఇచ్చిన ఇంజెక్షన్ స్లోపాయిజన్ కాబట్టి అది మెల్లమెల్లగా.. శరీరంలోకి చేరి ప్రతీ టిష్యూని డామేజ్ చేసుకొంటూ వస్తున్నది. ఒక్కో అవయవాన్ని పనిచేయకుండా చేస్తున్నది. ఆ విషయం దేహం నుంచి బయటకు వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. అందుకే రక్తాన్ని మార్చాల్సి వస్తున్నది అంటూ భారతీ చెప్పుకొంటూ వెళ్లింది. బ్లడ్‌ను ప్యూరిఫై చేయాలంటే డయాలిసిస్ తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రీట్‌మెంట్ పూర్తయిన తర్వాత చికిత్స ఏమిటనేది ఆలోచించాలి అంటూ డాక్టర్ భారతీ పేషెంట్ కండిషన్‌ను చెప్పింది.

దీప కండిషన్ క్రిటికల్‌గా

దీప కండిషన్ క్రిటికల్‌గా

డాక్టర్ భారతీ చెప్పుకొంటూ వెళ్లుండగా డాక్టర్ గోవర్థన్ మధ్యలో కల్పించుకొంటూ.. దీప కండిషన్ క్రిటికల్‌గా ఉంది అని అన్నాడు. దాంతో థ్యాంక్స్ గాడ్ అని మనసులో అనుకొని.. ఓ మై గాడ్ అంటూ మోనిత బయటకు అంటూ నాటకాలు చేసింది. ఇక కార్తీక్‌తో మాట్లాడుతూ.. దీప కండిషన్ చూసి బెదిరిపోయావా? నీవు డాక్టర్ అనే విషయాన్ని మరిచిపోతున్నావు. నథింగ్ టూ వర్రీ.. గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ సర్దిచెప్పింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
దీప కండిషన్ చూద్దాం పద అంటూ...

దీప కండిషన్ చూద్దాం పద అంటూ...

ఇక దీప అంటే ఎనలేని ప్రేమ అనే విధంగా కపట నాటకాలకు తెరతీస్తూ.. డాక్టర్ భారతీ మనం దీప కండిషన్‌ను చూసి వద్దామా అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్లారు. దీప ఉన్న బెడ్ వద్దకు చేరుకొని తనదైన శైలిలో నవ్వుతూ.. ఇక నీవు మటాష్ అనే విధంగా మోనిత చూసింది. అయితే మోనిత దుర్మార్గాన్ని పసిగట్టిన దీప లైట్‌గా తీసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X