Karthika Deepam May 27th Episode: దీప చచ్చిపోవడానికి పుట్టిందా? తల్లి భుజంపై తలపెట్టి కార్తీక్ కంటతడి!

మోస్ట్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్తున్న కార్తీక దీపం సీరియల్‌లో సరికొత్త భావోద్వేగాలు పాత్రల మధ్య వ్యక్తమవుతున్నాయి. కార్తీక్ తన తల్లి ప్రేమలో తడిసి ముద్దయ్యాడు. అలాగే గతం కంటే భిన్నంగా కార్తీక్ వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్యానికి, సంతోషానికి గురిచేస్తున్నది. ఓ పక్క దీప చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. కుటుంబ సభ్యుల మధ్య భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 1050 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్ అలిసిపోయావా? అంటూ సౌందర్య

కార్తీక్ అలిసిపోయావా? అంటూ సౌందర్య

దీప ఆరోగ్యం విషయంలోను, రిలేషన్ విషయంలోను రకరకాల భావోద్వేగాలకు గురైన కార్తీక్.. అలిసి పోయి తల్లి సౌందర్య భుజంపై తలవాల్చి సేద తీర్చుకొనే ప్రయత్నం చేశాడు. దాంతో కార్తీక్.. అలిసి పోయావా? అంటూ అడిగితే లేదంటూ సమాధానం ఇచ్చాడు. బాధగా ఉందా అంటూ అవును అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. దీప బతుకుందా అంటే అవును అంటూ కార్తీక్ జవాబిచ్చాడు.

ఎందుకు రా మౌనంగా వదిలేశావు..

ఎందుకు రా మౌనంగా వదిలేశావు..

దీప చేయి పట్టుకొని.. ఆఖరి క్షణాలు అంటూ ఇప్పటికైనా నమ్మారా డాక్టర్ బాబూ అంటూ అడిగితే నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు. అప్పుడు ఎందుకు రా మౌనంగా చేయి వదిలేశావు.. ఆఖరి క్షణాలు అవ్వని.. అవ్వకపోని.. దీప అంత దీనంగా అడిగితే.. ఎప్పటి లానే ఊ అని ఉంటే.. అది మృత్యువుతో పోరాడి వచ్చేస్తుంది అంటూ కార్తీక్‌ను ప్రేమగా సముదాయించేందుకు సౌందర్య ప్రయత్నించింది.

నా గొంతుకు ఏదో అడ్డుపడుతున్నది..

నా గొంతుకు ఏదో అడ్డుపడుతున్నది..

దీప విషయంలో ఓ డాక్టర్ బాబుగా చెప్పకు. ఓ డాక్టర్‌గా చెప్పు. నిజమా కాదా చెప్పు. మరి నీ గొంతు పెగడం లేదు ఎందుకురా? అంటూ సౌందర్య ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో తల్లి మాటలకు జవాబిస్తూ.. గొంతుకు ఏదో అడ్డుపడినట్టు అవుతున్నది మమ్మీ.. అయినా అది దీప.. దీపకు ఏమౌతుంది మమ్మీ... సేఫ్‌గా వచ్చేస్తుంది అంటూ తనలో తానే కాకుండా తల్లిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నాన్ని కార్తీక్ చేశాడు.

రెండు యాపిల్స్‌ పట్టుకొని

రెండు యాపిల్స్‌ పట్టుకొని

దీప చచ్చిపోవడానికి పుట్టిందా ఆ పిచ్చిది. దీపకు ఏమీ కాదు. నీవు భలేదానివి మమ్మీ అంటూ చేతిలో చేయి వేసి ప్రేమగా ధైర్యం చెప్పేందుకు కార్తీక్ ప్రయత్నించాడు. అంతలో కార్తీక్ మామ మురళీకృష్ణ రెండు యాపిల్స్ తీసుకొని వారి వద్దకు వచ్చాడు. సౌందర్యతో మాట్లాడుతూ.. ఊరి నుంచి నేరుగా ఇంటికే వచ్చావు.. పొద్దున్నుంచి ఏమీ తినలేదు అంటూ యాపిల్స్ ఇచ్చాడు. యాపిల్స్‌ను కార్తీక్ తీసుకొని ఒకటి తల్లికి ఇచ్చి.. మరో యాపిల్‌ను మామయ్య మీరు తినండి అంటూ మురళీకృష్ణకు ఇచ్చాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
 మామయ్యా అంటూ నోరారా పిలిచాడు..

మామయ్యా అంటూ నోరారా పిలిచాడు..

ఎన్నడూ లేని విధంగా మురళీ కృష్ణను మామయ్యా అంటూ ప్రేమగా నోరారా పిలవడంతో సౌందర్య కంగుతిన్నది.. వాడు మిమల్ని ఏమన్నాడు అంటూ మురళీ కృష్ణను అడిగితే... నన్ను మామయ్యా అంటూ నోరారా పిలిచాడు అంటూ ఆనందభాష్పాలు రాల్చుతూ మురళీ కృష్ణ చెప్పడంతో సౌందర్య కూడా ఓ రకమైన ఫీలింగ్‌కు లోనయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X