Karthika Deepam 2 May 27th: నిజం చెప్పాలని ఫీక్స్ అయిన కార్తీక్.. భయంతో వణికిపోతున్న శ్రీధర్!

పాప తండ్రి స్థానంలో కార్తీక్ సంతకం పెట్టాడని తెలుసుకొని దీపతో గొడవపడతాడు నర్సింహ. నర్సింని జైల్లో పెట్టిస్తాడు కార్తీక్. కానీ ఫోర్స్ చేయడం వలన అతడిని విడిపిస్తాడు. ఇదంతా అవమానంగా భావించిన నర్సింహ దీపపై పగ పెంచుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 27వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 55వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తండ్రికి పిండం పెట్టి కాకులని పిలుస్తుంది దీప. కాకులు ఎంతకీ రావు. అప్పుడే అటుగా వచ్చిన ఒక స్వామీజీ బ్రతికున్న వారికి పిండం పెడితే కాకులు ముట్టుకోవు అంటాడు. నా తల్లిదండ్రులు చనిపోయారు అంటుంది దీప. బ్రతికే ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్వామీజీ. ఈయన ఇలా అంటున్నారు ఏమిటి? నిన్న అత్త కూడా అలాగే అంది, వీళ్ళ ఇద్దరి మాటలకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచనలో పడుతుంది దీప.

Karthika Deepam May 28th 2024 Episode Number 55 Here is full story

మళ్ళీ లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకూడదు అనుకుంటుంది. మరోవైపు పిన్ని మాటలు పట్టుకొని కార్తీక్ ని నిలదీయవద్దు అని భర్తకి చెప్తుంది కాంచన. అడిగితేనే కదా నిజమో, అబద్దమో తెలుస్తుంది అంటూ అప్పుడే వచ్చిన కార్తీక్ ని దీప నీకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసా లేదంటే ఇంతకుముందే పరిచయమా అని అడుగుతాడు శ్రీధర్. పారు ఊర్లో జరిగింది తెలుసుకొని వీళ్ళకి చెప్పినట్లుగా ఉంది అనుకుంటాడు కార్తీక్.

ముందే పరిచయం వాళ్ల ఊర్లో జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ దీపావళి సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చాను అంటాడు. ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది కాంచన. చెప్పుకునే అంతగా ఇందులో ఏముంది అంటాడు కార్తీక్. అది వినేవాళ్ళని బట్టి ఉంటుంది, అయినా దీప గురించి అంత లోతుగా ఆలోచించవలసిన అవసరం ఏముంది అంటాడు శ్రీధర్. అది సాయమో, ప్రాయశ్చిత్తమో అవసరం అయినప్పుడు నేనే చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.

Karthika Deepam May 28th 2024 Episode Number 55 Here is full story

సాయం అంటే ఓకే కానీ ప్రాయశ్చిత్తం అంటున్నాడు ఏమిటి అని ఆలోచనలో పడతాడు శ్రీధర్. మరోవైపు హోటల్లో ఉప్మా బిర్యానీ చేస్తుంది దీప. దీప, బాబాయి తండ్రి శ్రాద్ధకర్మల గురించి ఉప్మా బిర్యానీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ముగ్గురు ఆడవాళ్లు వస్తారు. ఇక్కడ ఉప్మా ఫేమస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఉప్మా టేస్ట్ చేద్దాం అంటారు. వాళ్ళని ఆహ్వానించి కూర్చోమంటాడు బాబాయి అలాంటి డర్టీ కుర్చీల మీద కూర్చోను చీరలు పాడైపోతాయి అయినా ఈరోజు ఇక్కడ స్పెషల్ ఏంటి అని అడుగుతుంది ముగ్గురిలో ఒకరైన కావేరి.

ఉప్మా బిర్యానీ అని బయట రాసి ఉంది కదా అంటుంది మరొక ఆమె. ఉప్మాతో బిర్యానీ ఏమిటి అసహ్యంగా అంటుంది కావేరి. తిని చూడండమ్మ బాగుంటుంది అంటాడు బాబాయ్. ఉప్మా బాగోకపోతే బిల్ పే చెయ్యను ఓకేనా అంటుంది కావేరి, మీరు కావాలనే బాగోలేదు అంటే ఏం చేయగలం అంటాడు బాబాయ్. అందుకు అతని మీద కోప్పడుతుంది కావేరి. ఉప్మా తిని డబ్బులు ఇవ్వడానికి నేనేమైనా చీప్ అనుకుంటున్నావా అంటూ గొడవకి దిగుతుంది.

Karthika Deepam May 28th 2024 Episode Number 55 Here is full story

ఆయన మాటలు పట్టించుకోకండి, ఉప్మా బాగోకపోతే డబ్బులు ఇవ్వద్దులెండి అంటుంది దీప. అంటే మాకు ముష్టి వేద్దాం అనుకుంటున్నావా అంటూ దీపతో గొడవ పడుతుంది కావేరి. మీకు నచ్చితే టిఫిన్ తినండి లేదంటే వెళ్లిపోండి అని చెప్తారు బాబాయి దీప ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది కావేరి మా బేబీని ఇప్పుడే రమ్మంటాను అంటూ శ్రీధర్ కి కాల్ చేస్తుంది. అక్కడికి వచ్చిన శ్రీధర్ దీప ని చూసి కంగారు పడతాడు.

కావేరి జరిగింది చెప్పి వాళ్ళతో నాకు సారీ చెప్పించు అంటుంది. కంగారుపడిన శ్రీధర్ నేను వాళ్లకు సంగతి చూస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు ఆ తర్వాత దీప దగ్గరికి వస్తాడు శ్రీధర్. మీరు చేస్తున్నది తప్పు బాబు, ఇంట్లో తెలుసా అంటుంది దీప. లేదు, మీ అమ్మగారి ఆరోగ్యం సరిగా లేదు, పాత పరిచయం ఇలా ఇక్కడికి దారి తీసింది కానీ ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు అంటాడు శ్రీధర్.

Karthika Deepam May 28th 2024 Episode Number 55 Here is full story

నాలాంటి ఆడవాళ్లు చాలామంది ఉన్నారని ఇప్పుడే తెలిసింది ఆమెకి నిజం తెలిస్తే బాధపడుతుంది ఆమెని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది దీప. ఆ తర్వాత ఇంటికి వచ్చిన శ్రీధర్ దీప ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయపడతాడు. దీప ఆ ఇంటి నుంచి వెళ్లే వరకు అత్తగారి ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటాడు కానీ అప్పుడే దశరథ్ ఫోన్ చేసి రేపు మీ అందరూ బ్రేక్ ఫాస్ట్ కి రండి బావగారితో మాట్లాడాలి అంటాడు. అదే విషయం భర్తకి చెప్తుంది కాంచన. దీపకి ఎదురుపడాల్సి వస్తుందని రావటం కుదరదు అంటాడు శ్రీధర్.

అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ కి విషయం చెప్పి మీ నాన్నగారు రానంటున్నారు చూడు ఆయన మీ పెళ్లి గురించి మాట్లాడటానికి పిలుస్తున్నారేమో అంటుంది. రేపు పొద్దున్న ఇదే టాపిక్ గాని మాట్లాడితే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదనే విషయం చెప్పేయాలి అనుకుంటాడు కార్తీక్. అక్కడికి వస్తే దీప ని ఫేస్ చేయాలి అని భయంతో వణికి పోతాడు శ్రీధర్ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X