Karthika Deepam 2 May 28th: శ్రీధర్ ప్రవర్తనికి ఆశ్చర్యపోతున్న సుమిత్ర.. దీపని ఇబ్బంది పెట్టనంటున్న కార్తీక్!
నర్సింహ ని జైల్లో పెట్టిస్తాడు కార్తీక్. కానీ ఫోర్స్ చేయడం వలన అతడిని విడిపిస్తాడు. ఇదంతా అవమానంగా భావించిన నర్సింహ దీపపై పగ పెంచుకుంటాడు. శ్రీధర్ అతని రెండవ భార్యతో దీపకి దొరికిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 28వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 56వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శ్రీధర్ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చి సుమిత్ర పలకరిస్తుంది కానీ ఆలోచనలో ఉన్న దీప వినిపించుకోదు. దీపని గట్టిగా పిలిచి,పిలిచినా పట్టించుకోనంతగా ఏం ఆలోచిస్తున్నావు అంటుంది సుమిత్ర. క్షమించండమ్మా వినబడలేదు అంటుంది దీప. అదే అంతగా ఏమాలోచిస్తున్నావు అంటుంది సుమిత్ర. మనుషులు వాళ్ళ మనస్తత్వాల గురించి ఆలోచిస్తున్నాను అనే బయటికి అంటుంది కానీ మీ ఆడపడుచు భర్త గురించి మీతో ఎలా చెప్పను అని మనసులో అనుకుంటుంది.

ఈరోజు దీపకి ఏమైంది వేదాంతం మాట్లాడుతుంది అంటుంది సుమిత్ర. ఆ మాటలకి నవ్వుతుంది దీప ఎందుకు నవ్వుతున్నావు అంటుంది సుమిత్ర. గుడిలో స్వామి చెప్పింది సుమిత్ర కి చెప్తుంది దీప. నా తల్లిదండ్రులు చనిపోయారని నాకు తెలుసు కదమ్మా అందుకే ఆయన మాటలకు నవ్వొచ్చింది అంటుంది దీప. ఆయన మాటలని ఎందుకు తీసి పారేయాలి అందులో నిజం ఉందేమో దీని గురించి ఒకసారి ఆలోచించు అంటుంది సుమిత్ర. ఆలోచనలో పడుతుంది దీప.
నిన్న అత్త అన్న మాటలకి ఈరోజు స్వామీజీ అన్నమాట ఏమైనా సంబంధం ఉందా అనుకుంటుంది. మరుసటి రోజు పొద్దున్న సుమిత్ర ని కలిసిన దీప రమ్మన్నారంట ఎందుకమ్మా అని అడుగుతుంది. నువ్వు ఉప్మా బాగా చేస్తావంట కదా మీ టిఫిన్ సెంటర్లో కూడా అదే ఫేమస్ అటు కదా ఈరోజు వదిన వాళ్ళు టిఫిన్ కి వస్తారు నీకు టైం ఉంటే కాస్త టిఫిన్ చేసి పెట్టు అంటుంది సుమిత్ర. సరే అంటూ ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది దీప. అంతలోనే శ్రీధర్ ఫ్యామిలీ అక్కడికి వస్తారు. దీప కనిపిస్తుందేమో అని కంగారు పడతాడు శ్రీధర్.

ఇంట్లోకి వచ్చిన తర్వాత పలకరింపులు అయిపోయాక చెల్లెమ్మ ఏది అని అడుగుతాడు శ్రీధర్, వంట చేస్తుంది అంటాడు శివ నారాయణ. నేను వెళ్లి పలకరిస్తాను అని కిచెన్ లోకి వెళ్లిన శ్రీధర్ అక్కడ సుమిత్ర తో పాటు ఉన్న దీప ని చూసి షాక్ అవుతాడు, సుమిత్రని పలకరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆయన ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది సుమిత్ర. నేను ఎక్కడ నిజం చెప్పేస్తానో అని కంగారు పడుతున్నట్లు ఉన్నారు అనుకుంటుంది దీప. ఆ తర్వాత సుమిత్ర వచ్చిన వాళ్ళని పలకరించడానికి వెళ్తుంది.
కార్తీక్ గొంతు బాగోలేదని జీరా వాటర్ కోసం కిచెన్ లోకి వస్తాడు. అక్కడ దీప ని చూసి వెళ్ళిపోబోతుంటే మిమ్మల్ని నా పర్సనల్ విషయాల్లో మాత్రమే కలుగ చేసుకోవద్దు అన్నాను అంతేకానీ నన్ను చూసి ఇలా వెళ్ళిపో అక్కర్లేదు, అది నన్ను మరింత బాధ పెడుతుంది అంటుంది దీప. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నది మీరు నన్ను ఏమైనా అంటారేమో అని కాదు మిమ్మల్ని ఎవరూ ఏమీ అనకుండా ఉంటారని. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నావల్ల మీరు ఎవరితోనూ మాటలు పడకూడదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.

ఆ తర్వాత అందరూ టిఫిన్స్ చేస్తూ ఉండగా నాతో మాట్లాడాలన్నావు కదా ఏంటది అంటాడు శ్రీధర్. మన రెస్టారెంట్ కి ఎదురుగా ఉన్న వ్యక్తి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు, మీ ఫ్రెండు లాయర్ కదా అతనితో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటాడు దశరథ్. సరే అంటాడు శ్రీధర్. మీరు ఇంకొక సాయం కూడా చేయాలి అన్నయ్య, దీపకి విడాకులు ఇప్పించాలి అంటుంది సుమిత్ర. వద్దు అంటుంది దీప. దీప అక్కడే ఉండటం వలన అప్పటికే టెన్షన్ పడుతూ ఉన్న శ్రీధర్ తనకి ఇష్టం లేనప్పుడు బలవంత పెట్టడం ఎందుకు అంటాడు.
భార్యని అమితంగా ప్రేమించే మీరు అలా మాట్లాడకూడదు అంటుంది కాంచన. అయినా మొదటి పెళ్ళాం ఉంచుకొని రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు అంటూ నర్సింహని అడ్డమైన తిట్లు తిడుతుంది పారిజాతం. ఆ తిట్లన్నీ తనకే తగులుతున్నట్లు ఫీల్ అవుతాడు శ్రీధర్. ఈ విషయం నువ్వు పర్సనల్గా తీసుకున్నట్లు ఉన్నావు అంటాడు కార్తీక్. వాడు రెండో పెళ్లి చేసుకోవటం వల్లే కదా ఈ దీప మన ఇంటికి రావడం, మన ఇంట్లో ఇన్ని సమస్యలు తలెత్తడం. వాడే రెండో పెళ్లి చేసుకోకపోయి అసలు ఈ దీప మన ఇంట్లోకే వచ్చేది కాదు అంటూ నర్సింహాని మరిన్ని తిడుతుంది పారిజాతం.

ఇబ్బందిగా ఫీలైన శ్రీధర్ హ్యాండ్ వాష్ నెపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య స్కూల్ కి టైం అవుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావు అని తల్లిని అడుగుతుంది. స్కూల్ కి లేటుగా వెళ్తే పనిష్మెంట్ ఇస్తారా అంటుంది పారిజాతం. ఇస్తారు కానీ నాకు కాదు అమ్మకి అంటుంది శౌర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











