Karthika Deepam May 28th Episode:చావుబతుకుల్లో దీప..కార్తీక్‌ సంతోషంగా ఉంటావా? డాక్టర్ మోనిత కుట్రలు

తెలుగు టెలివిజన్ రంగంలో అతి ఎక్కువ కాలం టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్న కార్తీకదీపం సీరియల్‌ చాలా ఉద్వేగంగా కొనసాగుతున్నది. చావు బతుకుల్లో దీప ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైపోతుంటే.. డాక్టర్ మోనిత మాత్రం ఓ రకమైన ఆనందంతోపాటు పైశాచికత్వాన్ని చూపిస్తున్నది. ఈ క్రమంలో 1051 ఎపిసోడ్‌లో మోనిత పాత్ర ఎలా బిహేవ్ చేసిందంటే...

దీపకు కార్తీక్ దగ్గర కావడంపై

దీపకు కార్తీక్ దగ్గర కావడంపై

పదేళ్లుగా అవమానించి దూరంగా పెట్టిన దీపకు కార్తీక్ దగ్గర కావడంపై దీప జీర్ణించుకోలేకపోయింది. నీకు ట్రీట్‌మెంట్ చేయించడం భర్తగా నా బాధ్యత అంటూ దీపతో కార్తీక్ చెప్పిన డైలాగ్స్‌తో మోనిత అసహనంతో ఊగిపోయింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి నీకు ఏమైనా చెప్పిందా మోనిత అంటూ కార్తీక్ అడిగిన తీరుతో ఇంట్లో కూర్చొని మనసును కలుషితం చేసుకొంటూ కనిపించింది. ఇప్పటి వరకు నాపై చూపించినది ప్రేమ కాదా అనే విధంగా తనను తాను ప్రశ్నించుకొన్నది.

భోజనం ప్లేట్‌ను విసిరికొట్టిన మోనిత

భోజనం ప్లేట్‌ను విసిరికొట్టిన మోనిత

అసహనంతో ఊగిపోతున్న సమయంలో మోనిత వద్దకు ప్రియమణి ప్లేటు పట్టుకొని భోజనం తెచ్చింది. దీపను హస్పిటల్‌లో చేర్పించారు కదా.. ఆమె ఆరోగ్య పరిస్థితి అడగడం మరిచిపోయాను. కార్తీక్ ఏం చేస్తున్నాడు? దీపమ్మకు బాగా లేదని తాను కూడా బెంగపెట్టుకొన్నాడా? దీప చనిపోతే పోనివ్వమని మీతో కబుర్లు చెబుతూ కూర్చొన్నాడా అంటూ ప్రశ్నలు వేయడంతో మోనిత ఆగ్రహం చెంది భోజనం ప్లేట్‌ను విసిరికొట్టింది.

నాకు దగ్గరవుతాడనుకొంటే..

నాకు దగ్గరవుతాడనుకొంటే..


మోనిత చేసిన పనికి ప్రియమణి షాక్‌లో ఉండిపోయింది. అంతలోనే.. చూస్తావేంటి.. అంతా క్లీన్ చేయి అంటూ వేరే గదిలోకి వెళ్లి కుట్రలు పన్నే ఆలోచనల్లో మోనిత పడిపోయింది. దీప అనారోగ్యం కార్తీక్‌లో ఇంత మార్పు తెస్తుందని అసలే అనుకోలేదు. దీపకు దూరంగా ఉంటే ఏదో ఒకరోజు నాకు దగ్గర అయిపోతాడని కలగన్నాను. కానీ ఈ రోజుతో అది అడియాస అని తేలిపోయింది అంటూ మోనిత ఊగిపోయింది

దీపకు కార్తీక్‌ను దగ్గర కానివ్వను

దీపకు కార్తీక్‌ను దగ్గర కానివ్వను

ఇన్నాళ్లు ప్రేమతో నా కార్తీక్ అనుకొన్నాను. కానీ ఈ రోజుతో అది అబద్దం అని తేలిపోయింది. నాకు కార్తీక్‌ను దూరం చేసిన దీపను ఆనందంగా ఉండనివ్వను. దీపకు కార్తీక్‌కు దగ్గర కానివ్వను. కార్తీక్, దీప ఇద్దరు సంతోషంగా ఎలా ఉంటారో నేను చూస్తా అంటూ మోనిత ఆగ్రహం, అసహనంతో ఊగిపోతూ అసలు రూపాన్ని బయటపెట్టింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
నా దగ్గర ఆ ప్లాన్ ఉందంటూ..

నా దగ్గర ఆ ప్లాన్ ఉందంటూ..

నన్ను కాదని దీప వద్దకు వెళ్లాలని చూస్తున్నావు కదా కార్తీక్.. ఇప్పుడు కాదు.. వందేళ్లైనా మీ ఇద్దర్ని కలువనివ్వకుండా దూరం చేసే ప్లాన్ నా వద్ద ఉంది. ఈ మోనిత అంటే ఏమిటో చూపిస్తా.. అంటూ ఛాలెంజ్ విసిరింది. మళ్లీ ప్రియమణిని పిలిచి ప్లేట్‌లో భోజనం తెచ్చిపెట్టు అంటూ హుంకరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X