Karthika Deepam 2 May 29th: భయంతో పరుగులు తీసిన శౌర్య.. దీపకి చుక్కలు చూపిస్తానంటున్న నర్సింహ!

జరిగిందంతా అవమానంగా భావించిన నర్సింహ దీపపై పగ పెంచుకుంటాడు. శ్రీధర్ అతని రెండవ భార్యతో దీపకి దొరికిపోతాడు. దీప ఎక్కడ ఇంట్లో నిజం చెప్పేస్తుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 29వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 57వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

స్కూల్లో లేట్ అయితే అమ్మకి పనిష్మెంట్ ఇస్తారు అంటుంది శౌర్య. నీ కూతురు ఇప్పటినుంచే నీ మీద ఎంత కేర్ తీసుకుంటుందో అంటుంది సుమిత్ర. బయట డ్రైవర్ ఉన్నాడు కార్లో డ్రాప్ చేయమని చెప్తాడు దశరథ్. వద్దు బాబు టైం ఉంది ఆటోలో తీసుకువెళ్తాను అంటూ కూతుర్ని తీసుకొని బయటికి వస్తుంది దీప. అప్పటికే బయట టెన్షన్ పడుతున్న శ్రీధర్ ని చూసి కూతుర్ని షూ వేసుకోమని పంపించి దీప శ్రీధర్ దగ్గరికి వెళుతుంది.

Karthika Deepam May 29th 2024 Episode Number 57 Here is full story

దీపని చూసి టెన్షన్ పడతాడు శ్రీధర్. నేను ఇంట్లో నిజం చెప్పేస్తానేమో అని టెన్షన్ పడుతున్నారు కానీ నేను నిజం చెప్పక ముందే మీరు మీ ప్రవర్తన మార్చుకోండి,నాలాగా మరొక ఆడది బాధపడకూడదు. మీ భార్యకి మీరు దేవుడి కన్నా ఎక్కువ, అలాంటి భార్యకి అన్యాయం చేయకండి. నిజం తెలిసిన రోజు ఆమె గుండె ఆగిపోతుంది అంటుంది. నేను నిజం చెప్పి ఈ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేను.

వాళ్లందరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హోటల్ లాభాలలో నడుస్తూ ఉండటంతో దీపకి కృతజ్ఞతలు చెప్పి జీతం ఇస్తాడు బాబాయ్. ఇంకా నెల అవ్వలేదు కదా అని దీప అంటే నీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అంటాడు అలాగే అంత పెద్ద వాళ్ళ పరిచయం ఉన్న నువ్వు వాళ్ళ సహాయం ఎందుకు తీసుకోవడం లేదు అని కూడా అడుగుతాడు.

నువ్వే అంటావు కదా బాబాయ్ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అని ప్రస్తుతం అలాగే అనుకో అంటూ పాపకి లంచ్ ఇవ్వాలి అని చెప్పి బయటికి వస్తుంది దీప. మరోవైపు క్యాబ్లో ఎవరినో దింపడానికి స్కూలుకు వచ్చిన నర్సింహకి తల్లి కోసం ఎదురుచూస్తున్న శౌర్య కనిపిస్తుంది. తనకి నేనే తండ్రిని అని చెప్పాలనుకుని శౌర్య ని పిలుస్తాడు కానీ నర్సింహ ని చూసిన శౌర్య బూచాడు అని భయంతో పారిపోతుంది.

ఆమెని వెంబడిస్తాడు నర్సింహ దొరక్కుండా దాక్కుంటుంది శౌర్య. అప్పుడే క్యారియర్ తీసుకువచ్చిన దీప నర్సింహ కారు చూసి శౌర్య దగ్గరికి వెళ్లి ఉంటాడు అని అనుమానిస్తుంది. అలా అనుకుంటూనే పైకి వచ్చిన దీపకి శౌర్య ని వెంబడిస్తున్న నర్సింహ కనిపిస్తాడు. దీప ని చూసిన శౌర్య అమ్మ బూచాడు అంటుంది. నర్సింహ ని చూస్తూ భయపడుతూ ఇంకెప్పుడూ పువ్వులు కొయ్యను అంటుంది. దీప శౌర్యని దగ్గరికి తీసుకుంటుంది.

భయపడకు అతనేమీ చెయ్యడు నువ్వు వెళ్లి లంచ్ చేయు అని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తుంది. అప్పటికే శౌర్య ప్రవర్తనికి ఆశ్చర్యపోతున్న నర్సింహ నన్ను బూచాడు అంటుంది ఏమిటి నా కూతురు దృష్టిలో నన్ను బూచోడిని చేసావా అంటాడు నర్సింహ. మాతో ఏ సంబంధం లేదు అని చెప్పావు కదా మళ్ళీ ఎందుకు మా వెంట పడుతున్నావు అంటుంది దీప. ఏ సంబంధం లేని దానివి నా మీద కేసు ఎందుకు పెట్టావు, వాళ్ళు కొట్టిన దెబ్బలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.

ఇన్నాళ్ళు ఏం చేస్తే భయపడతావో అనుకున్నాను ఇప్పుడు నీ వీక్నెస్ దొరికింది నీ కూతురు దగ్గర నిజం చెప్పేస్తాను, అనుక్షణం నువ్వు భయంతో వణికి పోయేలాగా చేస్తాను అని దీపని బెదిరిస్తాడు. ఆ కేసు నేను పెట్టలేదు, ఇదంతా ఇక్కడితో వదిలేయ్ అని హెచ్చరిస్తుంది దీప. అంతలోనే అక్కడికి వచ్చిన వాచ్మెన్ ఏమైనా ఉంటే బయట చూసుకోండి అనటంతో దీప వెళ్ళిపోతుంది. నర్సింహ మాత్రం కోపంతో రగిలిపోతూ ముందు ఇది పని చేస్తున్న దగ్గర నుంచి దీన్ని తరిమేయాలి అనుకుంటాడు.

మరోవైపు టెన్షన్ లో ఉన్న శ్రీధర్ సుమిత్ర కాఫీ ఇస్తుంటే వద్దు కావేరి అంటాడు. కావేరి ఎవరు అంటూ అందరూ అడగటంతో మరింత టెన్షన్ పడిపోతాడు శ్రీధర్. ఏదో టెన్షన్ లో కాంచన పోయి కావేరి అనేసాను అంటాడు శ్రీధర్. అక్కడ ఉండలేక బయలుదేరి వెళ్లిపోతున్న శ్రీధర్ తో లాయర్ సంగతి చూడండి అంటాడు దశరథ్. అలాగే దీప మొగుడు రెండో పెళ్లి సంగతి కూడా చూడండి అంటుంది పారిజాతం. ఈవిడ మళ్లీ టాపిక్ మొదలెట్టింది అనుకుంటాడు శ్రీధర్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X