Karthika Deepam May 29th Episode: ఇల్లాలు దీపకు దగ్గరిగా.. ప్రియురాలికి దూరంగా.. భావోద్వేగంలో కార్తీక్

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న కార్తీకదీపం సీరియల్‌లో పాత్రల మధ్య సానుకూల సందర్భాలు, సన్నివేశాలు కనిపిస్తున్నాయి. సర్జరీ సక్సెస్ కావడం, దీప ఆరోగ్యం మెరుగుపడటం లాంటి అంశాలు కార్తీక్ కుటుంబ సభ్యులకు ఊరట, ఉపశమనం కలిగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీరియల్‌లో మే 29వ తేదీ 1052లో ఎపిసోడ్‌లో జరిగిన విషయాలు ఏమిటంటే...

సింధురా గద్దె.. చాలా రోజులు తరువాత హాట్ స్టిల్స్

 కార్తీక్... దీప సేఫ్

కార్తీక్... దీప సేఫ్

కార్తీక్‌తో డాక్టర్ భారతీ మాట్లాడుతూ.,. కార్తీక్ నీవు మంచి వాడివి. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు అన్యాయం జరగలేదు. నీ పిల్లల అదృష్టం కూడా తోడైంది. దీప సేఫ్ అంటూ చెప్పగానే... భారతీ.. నా భార్యను బతికించడానికే నిన్ను దేవుడు ఇండియాకు రప్పించాడేమో అని కార్తీక్ అన్నాడు. దాంతో నాకేమి గొప్ప క్వాలిఫికేషన్స్ లేవు. నీ నమ్మకాన్ని నిలబెట్టుకో గలిగాను అని డాక్టర్ భారతీ సమాధానం ఇచ్చింది.

మోనిత నిజ స్వరూపం గురించి

మోనిత నిజ స్వరూపం గురించి

ఒక డాక్టర్‌గా నేను ఏం చేయగలుగుతానో.. అది చేశాను. దీప ప్రాణాలతో నీకు దక్కింది. అంతకంటే మనకు కావాల్సిందేమిటి అంటూ భారతీ చెప్పింది. అయితే మోనిత చేస్తున్న కుట్రలను, నిజస్వరూపం గురించి కార్తీక్‌తో చెప్పాలని ప్రయత్నించింది. అయితే ఇది సందర్బం కాదని గుర్తు చేసుకొని.. కార్తీక్ ఏదో సర్దిచెప్పబోయింది.

మోనిత కుట్రల గురించి చెప్పడం

మోనిత కుట్రల గురించి చెప్పడం

మోనిత కుట్రల గురించి చెప్పడం ఇప్పుడు సబబు కాదు. మానసికంగా డిస్ట్రబ్ చేసినట్టు అవుతుంది. కానీ ఎప్పటికైనా మోనిత నిజస్వరూపం చెప్పకుండా ఉండను అంటూ డాక్టర్ భారతీ తన మనసులో అనుకొంటుండగా.. కార్తీక్ ఏమిటి భారతీ అంటూ ఆసక్తిగా అడిగితే... దీప స్పృహలోకి వచ్చింది. వెళ్లి చూడండి అంటూ భారతీ మాట మార్చింది.

భావోద్వేగంలో కార్తీక్

భావోద్వేగంలో కార్తీక్

కార్తీక్ నీవు ఇప్పుడు వెళ్లి చూడవచ్చు. ఆమెను పిలిస్తే లేచి నడిచి వచ్చేలా ఉంది అంటూ భారతీ అంటే.. దీపకు నడిచి వచ్చే రోజులు పోయాయి. ఇక ఈ మాటలు ఆపేస్తే మంచింది. నా భావాలన్నీ చెప్పేస్తే బాగుండదు. కొన్ని దాచుకొంటేనే ఆనందంగా ఉంటుంది అంటూ కార్తీక్ అన్నారు. అక్కడి నుంచి దీప గదిలోకి వెళ్లాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
 పదేళ్లు వేచి చూసిన ఆనంద క్షణాలు

పదేళ్లు వేచి చూసిన ఆనంద క్షణాలు

దీప మగత నిద్రలో ఉంటే.. తల మీద ప్రేమగా చేతితో నిమిరాడు. రెండే రెండు రోజులు ఆగు దీప.. ప్రపంచంలో ఏ జంట ఉండని విధంగా మనం ఉంటాం. నేను నిన్ను ప్రేమగా చూసుకొంటాను. కొన్నిసార్లు పట్టలేనంత ఆనందం ప్రాణాలకు ప్రమాదం కావొచ్చు. నీవు పూర్తిగా కోలుకోవాలి. పదేళ్లుగా వేచి చూసిన ఆనంద క్షణాలు అనభవించడానికి కావాల్సిన శక్తిని నీవు కూడగట్టుకోవాలి అంటూ కార్తీక్ దీప చేతిని పట్టుకొని కన్నీళ్లు రాల్చాడు. భార్య దీపకు దగ్గరవుతుంటే.. ప్రియుడు దూరం అవుతున్నాడనే కోపం, బాధ, ఉక్రోషం డాక్టర్ మోనితలో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X