నా బిడ్డల పుట్టుకను అనుమానించా.. నిన్ను అవమానించా.. దీప చేతిని ముద్దాడుతూ కార్తీక్ కంటతడి

మోస్ట్ టీఆర్పీ రేటింగ్ కలిగిన కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి భావోద్వేగాలు ఉప్పొంగాయి. అనేక అనుమానాలతో పదేళ్లుగా దీపను నరకానికి గురిచేసిన డాక్టర్ కార్తీక్ ఇప్పుడిప్పుడే తన గురించి తెలుసుకొంటున్నాడు. తనలో తాను కుమలిపోతూ దీపకు చేసిన అన్యాయాన్ని తలచుకొంటున్నాడు. ఇలా తాజా ఎపిసోడ్‌ 1052 ఎపిసోడ్‌లో కార్తీక్ తనలో తాను ఎలా కుమిలిపోయారంటే..

కార్తీక్ తనలో తాను కుమలిపోతూ

కార్తీక్ తనలో తాను కుమలిపోతూ

నా చదువు, నా ప్రొఫెషన్, నా సంస్కారం ఏమైందని అనుకొంటూ కార్తీక్ కుమిలిపోయారు. నేను అందనంత పాతాళానికి జారిపోతూనే ఉన్నాను. ఎంతో మందికి అన్నం పెట్టిన చేయి.. అన్నపూర్ణమ్మ తల్లి చేయి. వంటలక్క అని ఈసడించుకొన్నాను. ఏది నాకు ప్రాయశ్చిత్తం. ఏదీ నాకు పాప పరిహారం అంటూ దీప చేయి పట్టుకొని ఆవేదనకు గురయ్యారు.

నీలాంటి పవిత్ర మూర్తిని

నీలాంటి పవిత్ర మూర్తిని

దీప నేను నీ విషయంలో చేసిన తప్పు మాములుగా కాదు. నీలాంటి పవిత్రమూర్తిని అనుమానించి అవమానించాను. నీ కడుపు పుట్టిన బిడ్డల పుట్టుకను కూడా అవమానించాను. ఎవరూ లేనప్పుడు.. ఒంటరిగా ఉన్నప్పుడు కాదు.. ఎంత మంది ముందైతో నేను అవమానించానో.. అంత మంది ముందు క్షమాపణ కోరుతాను. అప్పుడే నాకు మనశాంతి అంటూ దీప చేయిని ముద్దాడుతూ కార్తీక్ కంటతడి పెట్టుకొన్నారు.

మనకు ఇది పునర్జన్మే.. అంటూ కార్తీక్

మనకు ఇది పునర్జన్మే.. అంటూ కార్తీక్

డాక్టర్ బాబు.. నేను బతికే ఉన్నానా? దీప అంటే.. నేను బతికే ఉన్నాను అంటూ కార్తీక్ బాబు జవాబిచ్చాడు. ఇది నాకు పునర్జన్మే కదా అంటే.. అవును ఇది ముమ్మాటికి పునర్జన్మే.. అంటూ కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు. నీకు.. నాకు.. పునర్జన్మే.
పిల్లల పరిస్థితి ఏమిటని అడిగితే.. ఇంటికి వెళ్లారు. అత్తయ్య ఎక్కడంటే.. పిల్లల కోసం ఇంటికి వెళ్లింది... మీరు ఒక్కరే ఉన్నారా అంటే ఆదిత్య వచ్చాడు అని దీప ప్రశ్నలకు కార్తీక్ సమాధానం చెప్పారు.

ఆ ఒక్క విషయమే దాచాను..

ఆ ఒక్క విషయమే దాచాను..


కార్తీక్‌తో దీప తన సంభాషణను పొడిగిస్తూ.. మోనిత ఉందా అంటే.. అప్పడే వెళ్లిపోయింది. మోనిత ఉందా..లేక నేను ఏమైనా అనుకొంటానని చెబుతున్నారా అంటే.. నీ వద్ద నేను దాచింది.. ఒకటే.. ప్రాణాంతక జబ్బు వచ్చిందనే విషయాన్ని మాత్రమే నీతో చెప్పకుండా దాచాను. చివరకు చెప్పకుండా ఉండలేకపోయాను. అంతకుమించి ఏ అబద్దం చెప్పలేదు. నీవు మనసులో పెట్టుకోకు అని కార్తీక్ అన్నాడు.

దీప బుగ్గల్ని ప్రేమగా నిమురుతూ

దీప బుగ్గల్ని ప్రేమగా నిమురుతూ

నీ ఆరోగ్యం బాగుపడింది.. రేపు మనం ఇంటికి వెళ్లిపోతాం అని కార్తీక్ అంటే.. ఏ ఇంటికి అంటూ దీప అడిగితే.. మన ఇంటికే అంటూ కార్తీక్ ప్రేమగా చెప్పాడు. ఇక నిన్ను రెండు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడిస్తే.. డాక్టర్ భారతీ వచ్చి నన్ను బయటకు గెంటేస్తుంది. రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ ప్రేమగా దీప బుగ్గల్ని కార్తీక్ నిమిరి బయటకు వెళ్లిపోయాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
కార్తీక్‌లో మార్పు నిజమేనా?

కార్తీక్‌లో మార్పు నిజమేనా?

డాక్టర్ కార్తీక్ ప్రేమను చూసి.. ఇదంతా నిజమేనా లేక మత్తులో ఊహించుకొంటున్నానా? కార్తీక్ ప్రవర్తనలో మార్పు నిజంగానే స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదివరకు మాదిరిగా ఏటో చూస్తూ మాట్లాడటం లేదు. నేరుగా నా కళ్లలోకి చూసి మాట్లాడుతున్నాడు. ఇక నుంచి జాలి చూపిస్తున్నావా అని అడగను అంటూ దీప ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X